- Home
- Entertainment
- Devatha: మాధవకు కౌంటర్ ఇచ్చిన రుక్మిణి, ఆదిత్య.. చెస్ ఛాంపియన్‌షిప్‌లో పోటిల్లో దేవి!
Devatha: మాధవకు కౌంటర్ ఇచ్చిన రుక్మిణి, ఆదిత్య.. చెస్ ఛాంపియన్‌షిప్‌లో పోటిల్లో దేవి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో పిల్లలు చెస్ ఆడడానికి పిలవగా అప్పుడు రామ్మూర్తి దంపతులు కూడా చెప్పడంతో సరే అని మాధవ(madhava) పిల్లలతో గేమ్ ఆడటానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మాధవ దేవి ఇద్దరు గేమ్ ఆడుతూ ఉండగా అందరూ సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉంటారు. ఆటలో చివరికి దేవి(devi) గెలవడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అది చూసి రాధ సంతోష పడుతూ ఉంటుంది.
మరొకవైపు దేవుడమ్మ(devudamma)గుడిలో జరిగిన విషయాల గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ భర్త అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగగా ఆమె జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్యమ్మ అక్కడికి రావడంతో వారు ముగ్గురు కలిసి రాధ(radha) గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మరొకవైపు పిల్లలు జడ వేసుకోమూ అంటూ మారం చేస్తూ ఉండగా ఇంతలో రాద(radha)జడ వేసుకోకపోతే గుండు కొట్టిస్తాను అని అంటుంది. అప్పుడు పిల్లలు ముందు నువ్వు ముందు నువ్వు అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు రాద దేవికి జడ వేయగా, జానకి చిన్మయి కీ జడ వేస్తుంది. అప్పుడు దేవి(devi),రాధకు దేవుడమ్మ ఆదిత్య ల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది.
అప్పుడు ఆ మాటలు విన్న మాధవ(madhava) కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు దేవి నేను తప్పు చేశాను ఆఫీసర్ సారు అను దత్తత తీసుకుంటాను అన్నప్పుడు పోయి ఉంటే బాగుండు అనడంతో బాధగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ మాటలకు రాధ(radha) సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే రాధ ఫోన్ చేస్తుంది. దేవి అన్న మాటల గురించి ఆదిత్యతో చెబుతూ ఆనంద పడుతూ ఉంటుంది రాధ.
నాతో మాటలు విన్న మాధవ(madhava) కోపం తగిలిపోతూ ఉంటాడు. రాధ మాటలకు ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రాధ దేవుడి దగ్గరికి వెళ్లి సంతోషంతో మొక్కుతూ ఉంటుంది. మరొకవైపు మాధవ, రాధ(radha) అన్న మాటల గురించి తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలా అయినా దేవి ఆదిత్యను దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు.
ఇంతలోనే అక్కడికి రాధ,దేవి(devi) ఇద్దరు వస్తారు. మరొకవైపు దేవుడమ్మ, దేవి చెస్ కాంపిటీషన్ లో దేవి గెలవాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. మరొకవైపు దేవి వాళ్ళు చెస్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ లోపలికి అలో చేయకపోవడంతో దేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడికి ఆదిత్య(adithya) వచ్చి దేవిని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత చెస్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలవుతుంది.