- Home
- Entertainment
- Devatha: దేవుడమ్మకు అబద్దం చెప్పిన బాగమ్మ.. తోటి విద్యార్థులతో దెబ్బలు తిన్న దేవమ్మ!
Devatha: దేవుడమ్మకు అబద్దం చెప్పిన బాగమ్మ.. తోటి విద్యార్థులతో దెబ్బలు తిన్న దేవమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దేవుడమ్మ భాగ్యమ్మ దగ్గరకు వెళ్లి నేను ఏం తప్పు చేశాను, రుక్మిణి నాకెందుకు కనిపించడం లేదు? అని బాధపడుతూ ఉంటాది. నీకైనా రుక్మిణి ఎక్కడుందో తెలిసిందేమో అని ఆశగా వచ్చాను, కానీ నిరాశతోనే వెళ్లాల్సి వస్తుంది అని అంటుంది. భాగ్యమ్మ "అన్నం పెట్టిన నీకు అబద్ధం చెప్పినా",రుక్మిణికి ఇచ్చిన మాట కోసం మీకు అబద్ధం చెప్పాల్సి వస్తుందే అని అనుకుంటూ కుమిలిపోతాది భాగ్యమ్మ.
ఆ తర్వాత సీన్లో దేవి, చిన్మయి స్కూల్ నుంచి తిరిగి వస్తారు. దేవి,ముఖం మీద ఆ దెబ్బలు చూసి ఏమైంది? అని రుక్మిణి కంగారుగా అడుగుతుంది. అప్పుడు చిన్మయి "ఈరోజు రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నప్పుడు దేవికి కొంచెం మార్కులు తక్కువ వచ్చాయని తోటి స్నేహితులు వెటకారిస్తే దేవి వాళ్ళని కొట్టింది, వాళ్లు అందరూ కలిపి తిరిగి దేవుని కొట్టుతుండగా నేను వాళ్ళని వెళ్లి అడ్డుకున్నాను" అని అంటుంది.
బానే చదివావు కదా మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి? అని రుక్మిణి దేవిని అడగగా "ప్రతిసారి కన్నా ఈసారి మార్కులు చాలా తక్కువ వచ్చాయి" అని చిన్మయి చెబుతుంది. రుక్మిణి దేవికి ఆయింట్మెంట్ రాస్తూ ఒకసారి ఆ మార్కుల షీట్ తెమ్మని అడుగుతుంది. ఆ మార్కులు విని రుక్మిణి దేవిని ఎందుకు మార్కులు తగ్గాయి? ఇలా అయితే నువ్వు కలెక్టర్వి అవ్వగలవా? అని అంటుంది. అప్పుడు దేవి "చదివినా గుర్తుండడం లేదు నాయన గుర్తొస్తుండు, ఆయన నిన్ను పెట్టిన బాధ గుర్తొస్తుంది" అని అంటుంది.
ఆ మాటలు విని రుక్మిణి బాధపడుతూ దేవిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. ఆ మాధవ్ సారు దీని మనసునే బాధ పెడుతున్నాడు అనుకున్నా కానీ దీన్ని చదువు కూడా చెడగొడుతున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనే ధైర్యం నేను దేవికి ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది. నేను నిన్ను ఒక చోటికి తీసుకు వెళ్తాను అక్కడకు వెళ్తే నీకే ధైర్యం వస్తుంది అని రుక్మిణి అంటుంది. తర్వాత సీన్లో వాసు ఆ ఊరి జనం దగ్గర నుంచి తప్పించుకొని ఇంటికి వస్తాడు.
మళ్లీ అటువైపు ఎందుకు వెళ్లారు? అని వాసు వాళ్ళ భార్య వాసుని అడగగా "వదిన బాధ చూసి తట్టుకోలేక రుక్మిణిని వెతకడానికి వెళ్లాను" అని అంటాడు.ఈ మాటలను ఆదిత్య చాటుగా వింటాడు. ఈ మాటలు విని ఆదిత్య ఇప్పుడు నేను నిజం చెప్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో, మంచి సందర్భం చూసి చెప్పడమే మంచిది అని అనుకుంటాడు. తర్వాత సీన్లో రుక్మిణి దేవిని తీసుకొని కరాటే క్లాసులోకి వెళ్ళింది.
"తినకి శరీరమే కాకుండా మనసులో కూడా ధైర్యం నింపాలి" అని ఆ మాస్టారికి చెప్పి క్లాసులో జాయిన్ చేపిస్తాది. తర్వాత భాగ్యమ్మ ,రుక్మిణి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకు వచ్చావు అని రుక్మిణి భాగ్యమని అడగగా దేవుడమ్మ తన దగ్గరికి వచ్చిందని, జరిగిన విషయం అంతా రుక్మిణి చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!