- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి సూపర్ షాకిచ్చిన రిషీ.. మహేంద్ర, జగతి పెళ్లి రోజు సెలబ్రేషన్స్!
Guppedantha Manasu: దేవయానికి సూపర్ షాకిచ్చిన రిషీ.. మహేంద్ర, జగతి పెళ్లి రోజు సెలబ్రేషన్స్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి దేవయాని గదిలోకి వస్తాడు. అప్పుడు దేవయాని, రిషి ఎందుకు ఇక్కడికి వచ్చాడు.ఏమైనా సమస్య వచ్చిందా, ఈ సమస్యను నేను నాకు అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటుంది. ఏమైంది రిషి ఎలాగున్నావు వసదార విషయంలోనా అని అనగా అవును పెద్దమ్మ అని అంటాడు రిషి. నేను ముందే చెప్పాను రిషి సాక్షి విషయం లో కేవలం పొరపాటు మాత్రమే అయింది.ఇంకా సమయం మించిపోలేదు వెళ్లి సాక్షి వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడమంటావా అని అనగా తల్లిదండ్రులతో మాట్లాడాలి పెద్దమ్మ. కానీ సాక్షి వాళ్ళ తల్లిదండ్రులు కాదు వసుధార తల్లిదండ్రులతో అని అంటాడు. ఆ మాటలకి ఒకేసారి దేవయాని షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావ్ రిషి అని అనగా నా జీవితంలో ఏం జరిగినా ముందు మీకే చెప్పాను పెద్దమ్మ.
మీరు నా అభిప్రాయాన్ని కాదనరు అని నమ్మకంతో ఉన్నాను. నాన్న నా స్నేహితుడి అవ్వొచ్చు కానీ ఏం చేసినా మీతో చెప్పడం అలవాటు కనుక చెప్తున్నాను. వసుధార నేను కలిసి జీవితం సాగించాలి అని అనుకుంటున్నాము. ఈ విషయం మీరే అందరికీ చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే నాన్న వాళ్ళ పెళ్లిరోజు కూడా ఇంట్లోనే ఘనంగా జరుపుకుందాము అని అంటాడు. దవయాన్ని మళ్ళీ ఆశ్చర్య పోతుంది.దానికి ఏర్పాట్లు మీరే చూడండి పెద్దమ్మ నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. దేవయాని ఆశ్చర్యంతో అలా ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరికీ దేవయాని భర్త వచ్చి,దేవయాని మీ ఇద్దరికీ ఇంట్లో ఘనంగా పెళ్లి రోజు జరిపించాలని అనుకుంటుంది అని అంటాడు. ఆ మాటలను విన్న మహేంద్ర ఎంతో ఆనందపడతాడు జగతి కూడా ఆనందపడుతుంది.
ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి థాంక్స్ పెద్దమ్మ అని దేవిని బుగ్గలు గిల్లు. అంతలో రిషి అక్కడికి వస్తాడు.అప్పుడు జగతి రిషి కి ఇష్టమో లేదో ఒక మాట అడగండి అని అనగా రిషి, వసుధార తనతో చెప్పిన సంఘటనను గుర్తుతెచ్చుకుంటాడు.జగతి మేడం వాళ్లు,వాళ్ళంతట వాళ్ళు జరుపుకుంటే అది సెలబ్రేషన్ అవుతాది సార్, అదే మీరు వాళ్ళ కోసం జరిపిస్తే అది సంబరం అవుతది అని అంటుంది. ఆ మాటలు గుర్తుతెచ్చుకున్న రిషి, ఇంట్లో పెద్దమ్మ ఏం చేసినా కుటుంబం మంచి కోసమే కనుక పెద్దమ్మ ఏం చేసినా నేను ఆపను అని చెప్పి జగతి మహీంద్రాలు వెళ్లి శుభాకాంక్షలు అని అంటాడు. దానికి జగతి మహీంద్రాలు ఎంతో ఆనంద పడిపోతారు. ఆ తర్వాత రిషి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు.
జగతి ఆనంద పడడం చూసి తను కూడా ఆనంద పడతాడు. అంతలో జగతి అక్కడికి వస్తుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి రిషి అని అంటుంది మీరు థాంక్స్ చెప్పడానికి వచ్చినట్లు అయితే వద్దు మేడం అని అంటాడు రిషి. నీకు థాంక్స్ చెప్పాలంటే దానికి నా జీవితం సరిపోదు రిషి. ఈ పెళ్లి రోజు జరుపుకోవాలని మహీంద్రా ఎంతో ఆశపడ్డాడు కానీ నేను ముందే చెప్పాను తన మనసులో ఆశలు పెంచుకోవద్దు అని. కానీ నీకు తన మనసులో మాట అర్థమైంది తనకోసం ఇంత చేసావు అని అంటుంది. ఇందులో నేను చేసింది ఏమీ లేదు మేడం అయినా ఈ ఆలోచన నాది కాదు వసుధార ధి అని అంటాడు.
అప్పుడు జగతి ఎంతో ఆనందపడుతుంది. ఇంకో విషయం మేడం వసుధార ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరి సారి అని అంటాడు.రిషి ఎందుకలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది జగతి.తను అతిథి గా ఇంటికి రావడం ఇదే ఆఖరి సార్ మేడం వచ్చే పండుగ నుంచి తను ఈ ఇంటి మనిషి అవుతుంది అని అనగా జగతి ఎంతో ఆనందపడి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. అప్పుడు రిషి నేను మీకు కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నాను మిగిలిన విషయాలన్నీ పెద్దమ్మ గారు మీకు చెప్తారు అని అంటాడు. అప్పుడు జగతి, చెంబుడు నీళ్లు కావాలి అని అడిగితే నది నే తీసుకొచ్చినంత ఆనందంగా ఉన్నది రిషి అని ఆనందభాష్పాలు తెచ్చుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు జగతి వెంటనే మహేంద్రని వెళ్లి హద్దుకొని ఇప్పుడు నన్ను ఏమీ అడగవద్దు మహేంద్ర, ఈ ఆనందాన్ని నన్ను అనుభవించని తర్వాత జరిగింది చెప్తాను అని అంటాది. అది తర్వాత సీన్లో జగతి మహిళలు, వసుధార దగ్గరికి వెళ్లి, ఎవరూ చేయలేని పని నువ్వు చేసావ్ అమ్మ. రిషి ని ఒప్పించావు ఈమధ్య రిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది అని అనగా, నేనేం చేయలేదు సార్ ఈ ఆలోచన అంతా దేవయాని మేడం దే అని అంటుంది వసు. దానికి జగతి మహీంద్రాలు ఆశ్చర్యపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!