MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషిని ఓదారుస్తున్న వసు.. వారి అన్యోన్యతను చూసి కోపంతో రగిలిపోతున్న దేవయాని!

Guppedantha Manasu: రిషిని ఓదారుస్తున్న వసు.. వారి అన్యోన్యతను చూసి కోపంతో రగిలిపోతున్న దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Oct 28 2022, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి గౌతమ్ గదిలో కూర్చుని ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది నా జీవితంలో మా డాడ్ కన్న నాకు ఎవరు ఎక్కువ కాదు. ఒక రెండు అక్షరాలు నా చిన్ననాటి సంతోషాన్ని పోగొట్టాయి. చిన్నప్పుడు ఆ రెండు అక్షరాల కోసం నేను ఎంతో తపన పడ్డాను కానీ దొరకలేదు ఇప్పుడు అవే రెండు అక్షరాలు నన్ను వాళ్లకి దూరం చేశాయి. నా జీవితంలో ప్రతి ఒక దశలో ఏదో ఒకటి కోల్పోతూనే ఉన్నాను ఇంక నా జీవితంలో కోల్పోవడానికి ఏమి మిగిలింది ఒక్క వసుధార తప్ప. తను కూడా నన్ను విడిచి వెళ్ళిపోతాది అంటే ఆ మాట కూడా నాకు భయంకరంగా ఉన్నది అని అంటాడు.
 

28

 అప్పుడు వసు రిషి దగ్గరికి వచ్చి మీరు ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు అని కన్నీళ్లు తుడుస్తూ నేను మీ నీడ సార్ నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను మీరు అలా మాట్లాడొద్దు అని అంటుంది. దానికి రిషి,  నువ్వు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నావు కదా మరి ఆ ఒక్క విషయం దగ్గర ఎందుకు అలా మొండి పట్టు పడుతున్నావు ఒకప్పటి రిషిలా కాకుండా నేను కొన్ని మెట్లు దిగాను కదా అది కూడా డాడ్ మీద ప్రేమతో నన్ను ఇంకా అని అనే లోగ మీ పొగరుకు బుద్ధి లేదు సార్ అని అంటూ లెగండి సార్ ఇంక మనం గదిలోకి వెళ్దాము మీరు పడుకోండి మనశ్శాంతిగా పడుకోండి.
 

38

 బాధలేవి మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి రిషిని తన గదిలో కూర్చోబెట్టి మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతుంది వసు. మరోవైపు గదిలో కూర్చున్న రిషి కూడా బాధపడతాడు. ఇది ఇలా ఉండగా జగతి, మహీంద్రలు గదిలో కూర్చుని బాధపడతారు. ఆ తర్వాత రోజు ఉదయం ధరణి వంటగదిలో ఉండగా దేవయాని అక్కడికి వచ్చి రిషికి కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది. లేదు అత్తయ్య అని ధరణి అనగా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ధరణి. రిషికి కాఫీ ఇవ్వకుండా  ఏ పనులు ఉంటాయి ఆ జగతి మహీంద్రలు ఎలాగా రిషిని పట్టించుకోరు నేనైనా పట్టించుకోవాలి కదా అని అరుస్తుంది.
 

48

 ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. రిషి రావడం గమనించిన దేవయాని నేను నీకు కాఫీ పెడుతున్నాను రిషి అని కాఫీ పెట్టి ఇస్తుంది. పెద్దమ్మ  వాసుధార కాఫీ తాగిందా అని అనగా లేదు రిషి ఇంకా కిందకి రాలేదు అని ధరణి అంటుంది. అయితే నేను వెళ్లి కాఫీ ఇస్తాను అని రిషి అంటాడు. నువ్వు వెళ్ళడమేంటి రిషి అని దేవయాని అడగగా, వసుధార కూడా మన ఇంటి మనిషే కదా పెద్దమ్మ ఇందులో తప్పేమున్నది అని కాఫీ తీసుకొని వసు గది దగ్గరికి వెళ్తాడు.అప్పుడు ధరణి దేవయానితో, మనం అనుకున్నవన్నీ అవుతాయని ఆశించకూడదు కదా అత్తయ్య గారు కొన్ని కొన్ని జరగవు అని అంటుంది.
 

58

 ఆ తర్వాత సీన్లో వసు జగతితో మాట్లాడుతూ, మేడం మీరు ఇలాగ వదిలేసి వెళ్లిపోవడం న్యాయమా. మీకు నిజంగా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి మొన్న చీర కట్టలేనప్పుడు కొట్టినట్టే కొట్టండి నేను భరిస్తాను కానీ ఇలా వెళ్ళిపోవద్దు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగా జగతి మేడం ఇక్కడే ఉన్నట్టు ఊహించుకున్నానా! మేడమ్ కి మెయిల్ చేశాను మేడం తో మాట్లాడినట్టు ఊహించుకుంటున్నాను అని అనుకుంటుంది. 
 

68

అప్పుడు రిషి కప్ ఆ, సాసర్ ఆ అని అడగగా, ఏదో ఒకటి సార్ ఏదైనా పర్లేదు అని అడ్జస్ట్ అవుతాను ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోని అని వసు అంటుంది. చిన్న చిన్న విషయాల్లో అలా ఉంటావుగాని ఎందుకు వసుధారా ఆ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వవు అని రిషి అడుగుతాడు. దానికి వసు, మనం ఒకటి అనుకుంటే జీవితాంతం అదే మనకు శాశ్వతం కానక్కర్లేదు సార్ అభిప్రాయాలు మారుతాయి మీ విషయంలో కూడా మారొచ్చేమో అని అంటుంది. అప్పుడు రిషి నన్ను ఎందుకు ఇంత గౌరవిస్తావు నువ్వు అని అడగగా సమయం సందర్భం వచ్చినప్పుడు మీకే చెప్తాను సార్ అని వసు అంటుంది.
 

78

 తర్వాత వసు బ్యాగ్ పట్టుకొని కిందకు వెళ్తున్నప్పుడు దేవయాని  ఆపి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా క్షేమంగా వెళ్ళు జాగ్రత్త ఆరోగ్యం అని అంటుంది. మేడం నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే చూడడానికి మీరు ఆశగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు రిషి సార్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను. రిషి సార్ వెళ్ళమన్నా కూడా నాకు నచ్చితేనే వెళ్తాను అని వసు అంటుంది. ఆ మాటలకు దేవయాని కోప్పడగా అదే సమయంలో రిషి వచ్చి ఏమైంది పెద్దమ్మ వసుధార ని ఏదో అంటున్నట్టున్నారు అని అంటాడు. 
 

88

దానికి వసు, ఏం లేదు సార్ నేను ఇక్కడ ఉండడం మేడంకి చాలా నచ్చుతుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని నన్ను అభినందిస్తున్నారు అని అనగా దేవయాని ఇంకేం చేయలేక బుర్ర ఊపుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sameera Bharadwaj Remuneration: సింగర్‌ సమీరా భరద్వాజ్‌ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Lokesh-Nelson: ఓటు వేయని దళపతి విజయ్ దర్శకులు.. లోకేష్, నెల్సన్ పై ట్రోల్స్‌.. కారణం ఇదేనా?
Recommended image3
Mahavatar Cinematic Universe: మహావతార్‌ సినిమాల లిస్ట్ వచ్చింది.. 11ఏళ్లపాటు వేరే లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved