MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార తనకు కాబోయే భార్య అని చెప్పిన రిషి.. షాక్ లో దేవయాని?

Guppedantha Manasu: వసుధార తనకు కాబోయే భార్య అని చెప్పిన రిషి.. షాక్ లో దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 17 2022, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో వసుధార ఏ హక్కుతో ఇక్కడికి వస్తున్నావు ఏ హక్కుతో ఇక్కడ ఉంటున్నావ్ అని ప్రశ్నించే కళ్ళకి దగ్గర సమాధానం లేదు సార్ అని బాధపడుతుంది. నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ అని అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కష్టం వస్తే ఈ అమ్మ దగ్గరికి వస్తాను అందరూ తరిమేస్తే మా అమ్మ దగ్గరికి వెళ్లి పోతాను అనడంతో బాధపడతాడు. వెంటనే రిషి వసుధార చేయి పట్టుకుంటాడు. వెళ్దాం పదా అనడంతో ఎక్కడికి సార్ అనడంతో నీకు సమాధానం దొరికి చోటికి అని వసుధార అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు మహేంద్ర జగతికి సేవలు చేస్తూ ఉంటాడు.
 

26

 అప్పుడు జగతి తలకి ఉన్న కట్టు విప్పి ప్లాస్టర్ వేస్తాడు. జగతి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అనగా మహేంద్ర అక్కయ్య విషపు ఆలోచనల గురించి నీకు తెలిసిందే కదా. రిషి వసుధార లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఒకవేళ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్న అక్కయ్య ఇలాంటి ప్లాన్లు వేస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర భయపడకు జగతి మన జీవితానికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇంతలో రిషి,వసుధార ని ఇంటికి పిల్చుకొని వస్తాడు.
 

36

అప్పుడు ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లిన రిషి ఇంట్లో అందరిని రమ్మని పిలుస్తాడు. అప్పుడు వసుధార ఎందుకు సార్ అందరిని రమ్మని పిలుస్తున్నారు అనడంతో నువ్వు కాసేపు మౌనంగా ఉండు వసుధార అని అంటాడు. ప్రశ్నలకు సమాధానాలు కావాలి అని అడిగావు కదా వసుధార ప్రశ్నలు నువ్వు అడిగావు సమాధానం నేను చెబుతాను అని అంటాడు రిషి. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి వసుధారని చూసి షాక్ అవుతుంది. అప్పుడు రిషి,వసుధార లని చూసి జగతి వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే రిషి,వసుధార చేయి పట్టుకోవడంతో దేవయాని షాక్ అవుతుంది.
 

46

ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా సంతోష పడుతూ ఉంటారు. నేను వసుధార ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరమా అని అనడంతో అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు పెద్దమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఇష్టం ఉందా లేదా అనడంతో అందరి ముందు ఇలా నిలబెట్టి అడిగితే ఏం చెప్తాము అనుకోని అది కాదు నాన్న రిషి అని చెప్పబోతుండగా అవన్నీ కాదు పెద్దమ్మ ఇష్టం ఉందా లేదా అనడంతో ఇష్టమే రిషి అని అంటుంది దేవయాని.
 

56

అప్పుడు జగతి మహేంద్ర, ఫణీంద్ర, ధరణి ల నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు అందరూ ఇష్టమే అని చెప్పడంతో జగతి, మహేంద్ర నవ్వుకుంటూ దేవయాని తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు రిషికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు రిషి వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఏ అర్హతతో ఇంటికి రావాలి సార్ అని అడిగావు ఇప్పుడు చెబుతున్నాను విను ఈ రిషేంద్ర భూషణ్ భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టు అనడంతో దేవయాని షాక్ అవుతుంది.
 

66

ఈ రిషేంద్ర భూషన్ తో కలిసి జీవితాంతం నడిచే భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టు అని అంటాడు రిషి. అప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక దేవయాని షాక్ తో అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది. వసుధార లోపలికి పిలుచుకొని వచ్చిన రిషి పెద్దమ్మ మా ఇద్దరి పెళ్లి జరిపించండి అనడంతో చేసేదేమీ లేక అందరి ముందు సరే అని ఒప్పుకుంటుంది. జరిపిస్తాను మీ పెళ్లి జరిపించే బాధ్యత నాదే కదా అని అంటుంది. వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి అప్పుడు పెళ్లి చేద్దాము అని అంటుంది. మీకు ఏం కావాలో నీ పెళ్లి ఎలా చేయాలో నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది రిషి అని జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది. తర్వాత ధరణి వసుధార ని లోపలికి పిలుచుకుకొని వెళ్తుంది. ఇప్పుడు మేడం అనడంతో ఇంకా మేడం ఏంటి వసుధార నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టావు అక్క అని పిలువు అని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే
Recommended image2
R B Choudary: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత ఆర్. బి. చౌదరి కన్నుమూత, ఏం జరిగిందంటే?
Recommended image3
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved