- Home
- Entertainment
- Guppedantha Manasu: ఆనందాన్ని తట్టుకోలేకపోతున్న మహేంద్ర.. రిషికి మరింత దగ్గరలో వసు!
Guppedantha Manasu: ఆనందాన్ని తట్టుకోలేకపోతున్న మహేంద్ర.. రిషికి మరింత దగ్గరలో వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి జగతిని (Jagathi), వసు ను తన డాడ్ సంతోషం కోసం తన ఇంటికి రమ్మనడంతో ఇద్దరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఇప్పుడే బయలుదేరాలి అనేసరికి ఇద్దరూ సంతోషంగా బయలుదేరుతారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ధరణి (Dharani)ముగ్గు వేస్తూ ఉండగా దేవయాని వెటకారంగా మాట్లాడుతుంది.
పక్కనే ఉన్న గౌతమ్ (Gautham) ఆ ముగ్గును చూసి బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇక దేవయాని గౌతమ్ తో కూడా వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగడంతో.. అందులో నుంచి దిగిన రిషిని (Rishi) చూసి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటారు.
ఇక వసు (Vasu) దిగటంతో ఆశ్చర్య పోగా.. గౌతమ్ మాత్రం సంతోషంగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత జగతి దిగడాన్ని చూసి దేవయాని ఒకేసారి షాక్ తింటుంది. కానీ ధరణి మాత్రం సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక గౌతమ్ (Gautham) సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చావు అంటూ రిషికి థాంక్స్ చెబుతాడు.
జగతి (Jagathi) వాళ్లు లోపలకు వస్తుండగా.. దేవయాని ఏంటిది రిషి అని అడుగుతుంది. నేనే తీసుకొచ్చాను పెద్దమ్మ అనటంతో దేవయానికి మండిపోతుంది. ఇక గౌతమ్ కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉండగా.. దేవయాని (Devayani) గౌతమ్ ను ఆపి.. రిషి దగ్గరికి వెళ్లి మళ్లీ అడుగుతుంది.
అసలు విషయం తర్వాత చెబుతానని అనటంతో దేవయాని (Devayani) కోపంతో ఇంట్లోకి వెళ్లిపోతుంది. రిషి లోపలకు పదండి అంటూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక వసు తెగ సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే ఫోటో తీస్తుంది. జగతి (Jagathi) గుమ్మం దగ్గరికి వచ్చి గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.
కోపంతో రగిలిపోతున్న దేవయాని (Devayani) వైపు చూస్తూ.. గుమ్మానికి దండం పెట్టుకుని ఇంట్లోకి వస్తుంది. రిషి సైలెంట్ గా ఉంటూ గతంలో తను మాట్లాడిన మాటలు తలచుకుంటాడు. ఇక జగతి ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు మహేంద్రవర్మ జగతి (Jagathi) గురించి ఆలోచిస్తాడు. అప్పుడే రిషి వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు.
మార్నింగ్ లో గుడ్ ఉండదు రిషి (Rishi) అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక రిషి నా పైన నమ్మకం లేదా అంటూ పక్కకు జరిగి జగతిని చూపిస్తాడు. తరువాయి భాగంలో మహేంద్రవర్మ ఆనందంను తట్టుకోలేకపోతాడు. మరోవైపు రిషి వసు కు రూమ్ చూపిస్తుండగా దేవయాని (Devayani) కాలితో తన్నినట్టు కనిపిస్తుంది.