Guppedantha Manasu: దేవయానికి ఊహించని షాకిచ్చిన జగతి.. కాలేజీలో ఫెర్వెల్ పార్టీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు ఆ బొమ్మని చూసుకుంటూ రిషి గురించి ఆలోచించుకుంటూ ఆ ఉంగరాన్ని తాడుతో కట్టి ఆ బొమ్మ మెడకి పెడుతుంది.రిషి సార్ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఉండగా రిషి తన గదిలో వసుధార ఒకప్పుడు పట్టుకున్న కర్చీఫ్ ని పట్టుకుంటూ వసుధార నువ్వు నన్ను ఎప్పుడు వెంటాడే అనుబంధానివా, నువ్వు ఎప్పుడూ నా కళ్ళముందే ఉండాలి ,నాతోనే ప్రయాణం చేయాలి అని అనుకుంటాడు రిషి.అప్పుడు కాలెండర్ దగ్గరికి వెళ్లి 24 అనే డేట్ దగ్గర ఫేర్వెల్ అని రాసుకుంటాడు.
ఆ తర్వాత జగతి మహీంద్రాలు మేడ మీద నుంచి కిందకు దిగుతూ ఫేర్వెల్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతట్లో దేవయాని అక్కడికి వచ్చి ఫేర్వెల్ లో ఇంక మీ హడావిడి ఆ వసుధార హడావిడి మామూలుగా ఉండదు కదా అని అనగా వసుధార ఎందుకు అక్కయ్య ఇప్పుడు మధ్యలో వచ్చింది అని అంటాది జగతి.అదేంటి డిబిఎస్టి అంటే వసుధార, వసుధార అంటే డిబిఎస్టి ఏ కదా అని దేవయాని అనగా వసు అంత ఎత్తుకు ఎదగడం కూడా మంచిదే కదా అక్కయ్య అని అంటుంది జగతి.
స్వీట్లు తీసుకు వచ్చాను తింటావా జగతి అని దేవయాని అనగా బయటకు నవ్వుతూ లోపల విషయం పెట్టుకొని తినే అలవాటు లేదు అక్కయ్య అంటుంది జగతి. అప్పుడు దేవయాని కోపంతో,అయినా కన్న కొడుకు చేత తల్లి అని కూడా పిలిపించుకోలేవు కనీసం నువ్వు అయినా కొడుకుని అరే, ఒరేయ్ కాదు కదా కనీసం పేరు పెట్టి రిషి అని కూడా పిలవలేవు.సార్ అని పిలవాలి ఏం బతుకు జగతి అని అనగా అదే సమయంలో రిషి కిందకి వస్తాడు. జగతి కావాలనే రిషి కాఫీ కావాలా, రిషి ఫోన్ వస్తుంది అని అంటుంది.
దేవయాని ఆశ్చర్య పోతుంది రిషి కోపంతో కాఫీని కింద పడేస్తాడు అని దేవయాని అనుకుంటుంది.కానీ రిషి చాలా నెమ్మదిగా ఉంటాడు అప్పుడు జగతి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో కాలేజ్ లో అందరూ ఫేర్వెల్ కోసం డెకరేషన్లు చేస్తూ ఉంటారు.వాసుధార అక్కడికి వచ్చి నేను చేస్తాను అని అనగా ఈ ఫేర్వెల్ మీకే,నువ్వే చేస్తే ఇంక మేమేం చేయాలి నువ్వు నాకు కనబడే దగ్గర కూర్చో వసుధారా అని అంటాడు రిషి.అప్పుడు గౌతమ్ ఈ రోజైనా వీళ్ళిద్దరి మనసులు విప్పుకొని మాట్లాడితే బాగుండు అని అనుకుంటాడు.
ఇంతట్లో మహేంద్ర అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళకి ఏకాంతం ఉంటుంది కదా అని అనుకోని అక్కడ అందర్నీ పంపిస్తాడు. ఇంతట్లో రిషి, వసు దగ్గరికి వెళ్లి వసు బ్యాక్ తీసుకొని ఇప్పుడు కూడా ఈ బరువులు మోయడం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు వసు, ఇది కేవలం బ్యాగ్ మాత్రమే కాదు సర్, నా నాలుగేళ్ల కాలేజ్ జ్ఞాపకాలు కూడా ఇందులోనే ఉన్నాయి అని అంటుంది. ఇంతట్లో రిషి వాళ్ళ పెదనాన్న రిషి ని పిలుస్తాడు. ఆ తర్వాత రిషి మహేంద్ర వాళ్ళతో భోజనాలు కూడా ఏర్పాట్లు అయిపోయాయి అందరూ నవ్వుకుంటూ తిరిగి వెళ్ళాలి అని అనుకుంటాడు.
ఇంతట్లో ఫేర్వెల్ మొదలయి రిషి పిల్లలు గురించి మాట్లాడతాడు. మనమీ నాలుగేల్లు ఒక కుటుంబంలా ఉన్నాము. నేను కొన్నిసార్లు మిమ్మల్ని తిట్టినా సరే అది మీ మంచి అందరూ బాగా చదివి పరీక్షలు రాయండి అంటాడు. ఆ తర్వాత జగతి కూడా పిల్లల గురించి కొన్ని మాటలు మాట్లాడుతుంది. తర్వాత పిల్లల్లో ఎవరినైనా ఒకరు వచ్చి మాట్లాడమని చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ వసుధార అని అంటారు. అప్పుడు వసు పైకి వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!