- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయాని మాటలు విని వణికిపోయిన ధరణి.. రాజీవ్ మాటలకు రిషీ సీరియస్ నిర్ణయం?
Guppedantha Manasu: దేవయాని మాటలు విని వణికిపోయిన ధరణి.. రాజీవ్ మాటలకు రిషీ సీరియస్ నిర్ణయం?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi), వసులు పక్క పక్కన కూర్చుని టిఫిన్ చేస్తూ ఉండగా దేవయాని అది చూసి జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఈలోపు అక్కడకు జగతి (Jagathi) వచ్చి రిషి కి టిఫిన్ వడ్డిస్తూ ఉండగా నాకు అక్కర్లేదు అన్నట్టుగా సైగ చేసి చెబుతాడు. అప్పుడే అక్కడకు గౌతమ్ వస్తాడు.
ఆ తర్వాత వసు (Vasu) ఒక బోండా ట్రై చేయండి సార్ టేస్ట్ చాలా బాగుంది అని రిషి తో అంటుంది. దాంతో రిషి వసు ప్లేట్లో బోండా తీసుకుంటాడు. ఇక మహేంద్ర, గౌతమ్ లు అది చూసి ఆశ్చర్య పోతారు. ఇక దేవయాని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఆ తర్వాత రాజీవ్ (Rajeev) కు కాల్ చేసి నేను చెప్పిన పని ఎక్కడ దాక వచ్చింది అని అడుగుతుంది.
నువ్వేం చేస్తావో చెయ్.. వసు (Vasu) మాత్రం రిషి ను వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోవాలి అని రాజీవ్ కి చెబుతుంది. ఇక రాజీవ్ త్వరలో మీకు శుభవార్త చెబుతాను మేడం అని ఫోన్ కట్ చేస్తాడు. ఈలోపు దేవయాని మాటలు విన్న ధరణి (Dharani) ఆవిడ ఎదో విషపు ప్లాన్ చేస్తున్నారు అని జగతి తో చెబుతుంది.
మరోవైపు కాలేజీ స్టూడెంట్ ధనుష్ (Dhanush) అందర్నీ భయపెట్టే రిషి సార్ వసు ఏం చెప్తే అది వింటాడు అట అని తన తోటి స్టూడెంట్స్ తో చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు వసు పక్కనే ఉండి వింటుంది. దాంతో వసు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది సార్ అని రిషి (Rishi) కు ఫోన్ చేసి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది.
ఈ క్రమంలో వసు (Vasu) కు తన బావ అయినటువంటి రాజీవ్ (Rajeev) ఎదురు అవుతాడు. వసు దగ్గర మంచివాడి లా నటించి మీ అమ్మా నాన్న నీ కోసం స్వీట్లు , పిండి వంటలు పంపారు అని వసుకు ఇస్తాడు. ఇక మొత్తానికి రాజీవ్ స్వ్వీట్స్ పేరుతో వసు పై ఒక ఏవిల్ ప్లాన్ వేసినట్టు అర్థమవుతుంది.
ఇక తరువాయి భాగంలో రిషి (Rishi) వసు పనిచేసే రెస్టారెంట్ లో ఉండగా అక్కడకు వసు వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. ఈ లోపు పక్కనే ఉన్న రాజీవ్.. హలో వెయిటర్ గారు ఎప్పుడు రిషి సార్ సేవలోనే తరిస్తారా.. కొంచెం మా ఆర్డర్ కూడా తీసుకోండి అని అంటాడు. మీరు ఏమీ తన ప్రాపర్టీ కాదు కదా అని అంటాడు. ఆ మాటతో రిషి రాజీవ్ (Rajeev) పై ఒక రేంజ్ లో విరుచుకుపడతాడు.