- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుపై కోపంతో రగిలి పోతున్న దేవయాని..రిషి ఇంట్లో సెటిల్ అయిన వసు..?
Guppedantha Manasu: వసుపై కోపంతో రగిలి పోతున్న దేవయాని..రిషి ఇంట్లో సెటిల్ అయిన వసు..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై గుప్పెడంత(Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 27 న ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలో వసు(vasu) తన రూమ్ లో ఒంటరిగా ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి డోర్ కొట్టడంతో వసు భయపడుతుంది. అప్పుడు వసు భయంతో రిషి కి ఫోన్ చేస్తే రిషి(rishi) ఫోన్ లిప్ లేకపోవడంతో వసు మరింత భయపడుతుంది. ఇంతలోనే సడన్ గా వసు రూమ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎవరా అని చూడగా వసు బావ రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు.
ఈ లోకం నుండి దూరంగా వెళ్లిపోదాం అంటూ వసు చేయి పట్టుకొని మరొక దారిలో వెళుతూ ఉండగా ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. రిషి ని చూసిన వసు (vasu)ఆశ్చర్యపోతుంది. అప్పడు రిషి మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి వస్తావు అని నాకు ముందే తెలుసు, అయితే నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ఇంతలో రిషి, రాజీవ్ (rajeev)మధ్య ఫైట్ జరుగుతుంది.
అప్పుడు వసు ఇద్దరిని ఆపడానికి ప్రయత్నించినా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రిషి(rishi) చేతికి గాయం అవడంతో అది చూసి వసు సార్ అని అనరుస్తుంది. అప్పుడు రాజీవ్ భయపడి అక్కడినుంచి పారిపోతాడు. అప్పుడు వసు, రిషి చేతికి తన చున్నీ ని చింపి కట్టుకడుతుంది. ఆ తర్వాత వసు (vasu)మీరు సమయానికి రాకపోతే నా పరిస్థితి ఏమి అయి ఉండేది సార్ అంటూ ఎమోషనల్ అవుతుంది.
అప్పడు రిషి (rishi)నువ్వు ఇలా ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు అని కాస్త కోపంగా మందలిస్తాడు. ఈ రోజు పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ అని అనడంతో మరి రేపటి నుంచి ఎక్కడికి వెళ్తావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వసు(vasu) ఎమోషనల్ అవుతూ నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది అనడంతో.. ఆ ప్రశ్నలన్నింటికీ నేనే సమాధానం అని అంటాడు రిషి.
అప్పుడు వస్తు షాక్ అవుతుంది. రిషి(rishi) నీ ప్రతి సమస్య వెనుక నీకు నేను తోడుగా ఉంటాను అని మాట ఇస్తాడు. ఆ తర్వాత వెళ్ళి లగేజ్ తీసుకొనిరా అని అనడంతో ఎక్కడికి సార్ అని అడగడంతో అప్పడు రిషి ఎక్కడికో చెబితే కానీ రావా వెళ్ళి లగేజ్ తీసుకొనిరా అని అంటాడు. ఒకవైపు ఇంట్లో అందరు రిషి (rishi)కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉంటారు.
ఇంతలో రిషి, వసు(vasu) ని తీసుకొని ఇంటికి రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు దేవయని వసు ఇంట్లోకి రావడం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ దేవయాని(devayani) మాత్రం ఎలా అయినా సరే బయటికి పంపించాలి అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసు కోసం రిషి వంట గదిలోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తాడు.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..