MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Chiranjeevi: రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్‌, జాతీయ అవార్డుపై సెటైర్లు

Chiranjeevi: రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్‌, జాతీయ అవార్డుపై సెటైర్లు

రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌ అని కామెంట్‌ చేశారు చిరంజీవి. ప్రధాని మోడీ పాల్గొన్న కాంక్లెవ్‌లో అంతా ఆయన్ని అలానే అభినందించారని తెలిపారు మెగాస్టార్‌. ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2026, 05:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌
Image Credit : Asianet News

రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌

రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌ అని వెల్లడించారు చిరంజీవి. ఇటీవల నేషనల్‌ మీడియా నిర్వహించిన కాంక్లెవ్‌లో మోడీతోపాటు రామ్‌ చరణ్‌ పాల్గొన్నాడని, ఆ సందర్భంగా అంతా చరణ్‌ని కాబోయే మెగాస్టార్‌ అంటూ ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ని న్యూ ఏజ్‌ మెగాస్టార్‌ అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇకపై రామ్‌ చరణ్‌ తన ముందు ఉంటాడని, అతని వెనకాలే తాను ఉంటానని చెప్పాడు చిరంజీవి. పుత్రుడు గొప్ప వాడు అయినప్పుడు కలిగే పుత్రోత్సహంతో చెబుతున్నానని వెల్లడించారు. `పెద్ది` మూవీ విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ క్రమంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాం-చిరంజీవి
Image Credit : Asianet News

పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాం-చిరంజీవి

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూస్తుంటే, పెద్ది మాత్రమే కనిపించాడని, చరణ్‌ ఎక్కడా కనిపించలేదని, సినిమా చూస్తున్నంత సేపు పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయామని, అంతగా ఇన్‌వాల్వ్ అయ్యేలా చరణ్‌ తన నటనని ప్రదర్శించాడని తెలిపారు. సినిమా కోసం చరణ్‌ ఎంతో కష్టపడ్డాడని వెల్లడించాడు. ఉదయం, సాయంత్రం జిమ్‌లో శ్రమించినట్టు తెలిపారు. షూటింగ్‌ కి వెళ్లి వచ్చాక కూడా సాయంత్రం జిమ్‌లో చెమటోడ్చాడని, ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని మళ్లీ గంట సేపు ఎక్సర్‌సైజ్‌లు చేసేవాడని తెలిపారు. ఆసమయంలో ఎందుకు నాన్న అంత కష్టపడుతున్నావని అడిగితే, అలా చేస్తేనే రేపు షూటింగ్‌లో ఎనర్జిటిక్‌గా ఉండగలమని చెప్పేవాడు, పాత్ర కోసం కఠోర శ్రమ చేశాడని చెప్పాడు చిరంజీవి.

35
రామ్‌ చరణ్‌ ఒక పరిపక్వత కలిగిన నటుడిగా మారిపోయాడు
Image Credit : Asianet News

రామ్‌ చరణ్‌ ఒక పరిపక్వత కలిగిన నటుడిగా మారిపోయాడు

రామ్‌ చరణ్‌ నటన పరంగా `రంగస్థలం`లో అద్భుతంగా నటించాడు, కానీ దాన్ని మించి `పెద్ది`లో నటించాడని, ఇందులో ఒక పరిపూర్ణమైన నటనని కనబరిచాడని, ఆ విషయంలో చరణ్‌ ని చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని చెప్పారు. ``రంగస్థలం`లో చరణ్‌ అద్భుతంగా చేశాడు, కానీ మళ్లీ అలాంటి సినిమాలు చేయాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నాను, ఎందుకంటే చాలా సినిమాలు వస్తుంటాయి, అలరిస్తుంటాయి, కానీ కొన్ని మాత్రమే గుర్తిండిపోతాయి. అలాంటి వాటిలో రాజమౌళి రూపొందించిన `మగధీర`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, మళ్లీ ఇంత త్వరగా `పెద్ది` లాంటి సినిమా వస్తుందని ఊహించలేదు, ఆ రకంగా రామ్‌ చరణ్‌ చేసుకున్న అదృష్టం ఈ మూవీ. పెద్ది పాత్రని అవపోసన పట్టాడు, దాన్ని అంతగా నమ్మాడు, కాబట్టి అంత బాగా నటించగలిగాడు. పాత్రని, దర్శకుడిని, కథని నమ్మకపోతే, ఇంతటి కఠోర శ్రమ చేయకపోతే ఇందులో సక్సెస్‌ అయ్యేవాడు కాదు, మీ ప్రశంసలు పొందేవాడు కాదు` అని తెలిపారు చిరంజీవి. 

45
అలా చేస్తే పర్ఫెక్ట్ యాక్టింగ్‌ కాదు
Image Credit : Asianet News

అలా చేస్తే పర్ఫెక్ట్ యాక్టింగ్‌ కాదు

ఈ సందర్భంగా చిరంజీవి ఇంకా మాట్లాడుతూ, ఆర్టిస్ట్ లు అనేవాళ్లు పాత్రలోని ఎమోషన్‌ని ఫీల్‌ అవ్వాలి తప్ప, ముఖకవలికలతోటి, మజిల్స్ తో రాణించాలనేది పర్‌ఫెక్ట్ యాక్టింగ్‌ కాదు, చాలా మంది గొప్ప యాక్టర్లు ఉంటారు, తెరపై వాళ్లు బాధపడుతూ, మనల్ని బాధపెడుతుంటారు, కానీ పాత్రలోని ఎమోషన్‌ని తాను ఫీలవుతూ, ఆ ఎమోషన్స్ ని కళ్లద్వారానే చూపిస్తూ, మనల్ని కంటతడి పెట్టించేలా చేశారే, అది పరిపూర్ణమైన యాక్టింగ్‌. పరిపక్వత ఉన్న నటన. ఈ రోజు రామ్‌ చరణ్‌లో ఆ పరిపక్వత కలిగిన నటనని నేను చూసేలా చేశాడని చెప్పారు చిరంజీవి.

55
జాతీయ అవార్డుపై చిరంజీవి కామెంట్‌
Image Credit : Asianet News

జాతీయ అవార్డుపై చిరంజీవి కామెంట్‌

ఇక జాతీయ అవార్డుల గురించి చెబుతూ, పెద్దిలో రామ్‌ చరణ్‌ నటని చూసి అంతా అవార్డ్ విన్నింగ్‌ పర్‌ఫెర్మెన్స్ అంటున్నారు. అవార్డులు వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు అవార్డు విన్నింగ్‌ యాక్టింగ్‌ అంటుంటే చాలా గర్వంగా ఉంది. `రంగస్థలం` సమయంలో ఇది అవార్డు విన్నింగ్‌ పర్ఫర్మెన్స్, చరణ్ అంత అద్భుతంగా చేశాడని సుకుమార్‌ తనతో చాలా సార్లు చెప్పాడని, అలాంటి ప్రశంసలు వచ్చాయంటే దాన్ని మించిన అవార్డు మరోటి ఉండదని తాను ప్రగాఢంగా నమ్ముతానని తెలిపారు చిరు. ఇప్పుడు `పెద్ది`కి అలాంటి ప్రశంసలు రావడం గర్వంగా ఉందని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు మెగాస్టార్. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Related Stories
Recommended image1
India Top 10 Heroes: అల్లు అర్జున్‌కి దెబ్బ మీద దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ స్థానాలు ఇవే
Recommended image2
India Top 10 Heroines: సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. సమంత, త్రిష దూకుడు.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved