MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసును నిలదీసిన పక్కింటివాళ్ళు.. రిషికి జరగబోయే ప్రమాదాన్ని చూసి భయపడిన జగతి?

Guppedantha Manasu: వసును నిలదీసిన పక్కింటివాళ్ళు.. రిషికి జరగబోయే ప్రమాదాన్ని చూసి భయపడిన జగతి?

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తమ్ముడు అభివృద్ధి చేసిన సంస్థని తనదిగా చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 11 2023, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

 ఎపిసోడ్ ప్రారంభంలో దీని అందరికీ నువ్వే కారణం నిజం చెప్పు అంటూ ఎమ్మెస్సార్ మీద ఎటాక్ చేయబోతాడు రిషి. నువ్వు ఆగు వెళ్లి కార్లో కూర్చో వీడి సంగతి నేను చూస్తాను అని శైలేంద్ర  అనటంతో రిషి వెళ్లి కారులో కూర్చుంటాడు. బాగానే ప్లే చేస్తున్నావు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు సీన్లో ఎంటర్ అవ్వాలి రెడీగా ఉండు అని నెమ్మదిగా అంటాడు శైలేంద్ర.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ రిషి వినబడే లాగా మాట్లాడుతాడు. అలాగే చూసుకుందాం మీరు ఎంతవరకు వెళ్తే నేను కూడా అంతవరకు వెళ్తాను అంటూ ఎమ్మెస్సార్ కూడా రిషి వినబడేలాగా మాట్లాడుతాడు. మరోవైపు దేవయాని ఇంటికి పేరంటం పిలవడానికి వస్తారు పక్కింటి వాళ్ళు.
 

310

 ఏం వ్రతం అంటుంది దేవయాని. భార్యాభర్తలు కలిసి ఉండటానికి వ్రతం చేయించమన్నారు పంతులుగారు అందుకే చుట్టుపక్కల ఉన్న భార్యాభర్తలని పిలుస్తున్నాము అంటుంది వచ్చినావిడ. మీ ఇద్దరూ తోటి కోడళ్ళు లాగా కాకుండా సొంత అక్క చెల్లెల్లు లాగా ఉంటారు అని దేవయాని, జగతిని  మెచ్చుకుంటారు వచ్చిన వాళ్ళు. బొట్టు పెట్టించుకోవటం కోసం జగతి, దేవయాని తాళిబొట్టు తీస్తారు.
 

410

 వసుకి బొట్టు పెట్టి తాళిబొట్టు బయటకి తీయమంటుంది వచ్చినామే. తాళి లేదు అని వసు అనడంతో ఆమె ఆశ్చర్య పోతుంది ఏం జరిగింది అని అడుగుతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అంటుంది వసు. అదేంటి నీకు పెళ్లి అయింది కదా అందుకే ఈ ఇంట్లో ఉంటున్నారు కదా అంటుంది ఆవిడ.

510

సాంప్రదాయ బద్ధంగా అవ్వలేదు అందుకే మేము మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము అంటుంది జగతి. అలాంటప్పుడు ఇద్దరినీ ఒకే ఇంట్లో ఎందుకు ఉంచారు అంటూ నిలదీస్తుంది. అందరూ మీరు ఉన్నట్లే ఉండాలి అనుకుంటే ఎలా.. జనరేషన్ మారింది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు అంటాడు శైలేంద్ర. ఇది జీవితం విడిపోవడానికి అవన్నీ పనికొస్తాయి కానీ కలిసి ఉండాలంటే సంప్రదాయాన్ని పాటించాలి.
 

610

 అయినా మంచి చెడు పిల్లలకి చెప్పవలసింది పోయి మీరే ఇంట్లో పెట్టుకున్నారేంటి అని మహేంద్రని నిలదీస్తుంది. వాళ్లు చేసింది తప్పేమీ కాదు అయినా కన్నవాళ్ళుగా మాకు లేని బాధ మీకు ఎందుకు అంటాడు మహేంద్ర. మీరు సమాజంలో బ్రతుకుతున్నారు కాస్త సమాజానికి కూడా నచ్చినట్లుగా చేయండి అయినా దేవయాని గారు పద్ధతులు పదిమందికి చెప్పటం కాదు ముందు మీ ఇంటిని చక్కపెట్టుకోండి.
 

710

మీలాంటి వాళ్ళు పేరంటానికి వస్తే ఉన్న జంటలు కూడా విడిపోతాయి అంటుంది ఆవిడ. పేరంటానికి వచ్చారు నచ్చితే పిలవండి లేకపోతే వెళ్లిపోండి అంటూ కసురుకుంటాడు ఫణీంద్ర. వచ్చిన వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా పెళ్లి ముందే ఒక ఇంట్లో ఉండొద్దు అంటే వినలేదు అంటూ కోప్పడుతుంది దేవయాని.వీళ్లని అనటం ఎందుకు వీళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేసేయ్ అంటాడు  శైలేంద్ర. ఇది శూన్యమాసం అంటుంది దేవయాని. అలాంటప్పుడు పెట్టుడు ముహూర్తం పెట్టించి ఎంగేజ్మెంట్ అయినా చెయ్యు అంటాడు శైలేంద్ర. అందుకు ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు కానీ జగతి మాత్రం మౌనంగా వూరుకుంటుంది. 

810

తర్వాత తన గదిలోకి వెళ్లి శైలేంద్ర మాటలు వెనక ఏదైనా రహస్యం దాగి ఉందా ఎందుకు రిషి మంచి కోసం ఆలోచిస్తున్నాడు అంటూ మదన పడుతుంది జగతి అంతలోనే వసు వచ్చి నేను చాలా ఆనందంగా ఉన్నాను త్వరలో రిషి సర్ నాకు దక్కబోతున్నారు అంటూ ఆనందంగా చెప్తుంది. వసు నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఏదో చెప్పబోయే అంతలో అక్కడికి రిషి కి వస్తాడు. చూశారా మా అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో.. అన్నయ్యకి, పెద్దమ్మకి నేను ఏం చేసినా తక్కువే అంటాడు రిషి. పెద్దమ్మ షాపింగ్ కి వెళ్ళమంది పదా వెళ్దాం అని వసుతో చెప్తాడు రిషి.

910

డల్ గా ఉన్న జగతి మొహం చూసి మీకు ఈ ఎంగేజ్మెంట్ చేయటం ఇష్టం లేదా మేడం అని అడుగుతాడు రిషి. అలాంటిదేమీ లేదు ఎంగేజ్మెంట్ జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే అంటుంది జగతి. ఆ తరువాత రిషి తన రూమ్ కి వెళ్లి షాపింగ్ లో నేను ఇలాంటి ఉంగరాలు రెండు తీసుకోవాలనుకుంటున్నాను అంటూ వి ఆర్ ఉంగరాన్ని చూపిస్తాడు రిషి.
 

1010

తరువాయి భాగంలో కాలేజ్ ఎండి స్థానంలో నేనే కూర్చోవాలి హలో కుదరకపోతే రిషి ని చంపటానికి కూడా వెనకాడను అని జగతిని బెదిరిస్తాడు శైలేంద్ర. అనుకోకుండా ఆ మాటలు విన్న వసు నిర్ధాంత పోతుంది. మరోవైపు రిషి వాళ్ళని చంపటానికి లారీ అరేంజ్ చేస్తాడు శైలేంద్ర. దగ్గరుండి ఆ సీన్ జగతికి చూపిస్తాడు. ఆ దృశ్యం చూడలేక భయంతో కళ్ళు మూసుకుంటుంది జగతి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image2
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Sunny Leone: "మా అమ్మ ఏడ్చేసింది.." అడల్ట్ ఫిల్మ్స్ గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరిగిందో చెప్పిన సన్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved