MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వంట చేస్తున్న వసుధార, రిషి.. ధరణి పై మండిపడిన దేవయాని..?

Guppedantha Manasu: వంట చేస్తున్న వసుధార, రిషి.. ధరణి పై మండిపడిన దేవయాని..?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Nov 04 2022, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో ధరణి వంట చేస్తూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మేడం అని అంటుంది. అప్పుడు ధరణి రిషికి ఇష్టమైన చపాతిని చేస్తున్నాను వసుధార అనడంతో వెంటనే వసు మా మధ్య ఈ చపాతి ప్రస్తావన ఎప్పుడు రాలేదు. మేడం ఈరోజు నేను చపాతి చేస్తాను మేడం ప్లీజ్ అని అనగా వెంటనే ధరణి నువ్వు అధికారికంగా కుడలిగా వచ్చి వంటలు చేయడానికి ఇంకా సమయం ఉందిలే వసుధార అంటుంది. చేస్తాను మేడం అనటంతో వద్దులే వసుధార అత్తయ్య తిడుతుంది అనగా ఏమి కాదులే అని చెప్పి వసుధర వంట చేస్తూ ఉంటుంది.

26

అప్పుడు వసుధార తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఆ చపాతీలకు రిషి సార్ పేరు పెడతాను. ప్రిన్స్ చపాతి,జెంటిల్మెన్ చపాతి అని పేర్లు పెడతాను అని మేడం అని వెనక్కి తిరిగి చూడగా రిషి ఉండడంతో అది చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. అప్పుడు రిషి ఏంటి వసుధార ఇది రిషి చపాతి జెంటిల్మెన్ చపాతి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు సర్ మీకు చపాతి ఎలా కావాలి అని అడగడంతో చపాతి చపాతి లాగా ఉంటే చాలు వసుధార అని అంటాడు. ఇప్పుడు రిషి వసుధర కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దు అని అంటాడు.
 

36

 అప్పుడు వసుధార రిషికి చపాతి ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. రిషి కూడా చపాతి చేస్తూ ఉంటాడు. మరొకవైపు ధరణి దేవయాని తలకి మసాజ్ చేస్తూ అత్తయ్య గారు ఈమధ్య మీకు తరచుగా తలనొప్పి వస్తుంది ఎందుకంటారు అనటంతో వెంటనే దేవయాని కామెడీగా ఒక పని చెయ్ ధరణి నా తలను తీసుకెళ్లి హాస్పిటల్ లో చెక్ చేయించుకుని రా అని అంటుంది. ఆ తర్వాత ఈవిడ గారు ఎక్కడున్నారో అనే దేవయాని అనడంతో ఎవరు అత్తయ్య జగతి అత్తయ్య గారా అని అడుగుతుంది ధరణి.

46

 అప్పుడు వెంటనే దేవయాని నీకు బుద్ధి ఉందా నేను జగతి గురించి ఎందుకు అడుగుతాను వసుధార గురించి అడుగుతున్నాను అని అంటుంది. వసుధార కిచెన్ లో చపాతీలు చేస్తుంది అత్తయ్య గారు అని అనగా రిషి కూడా ఉన్నాడ అన్ని అడగగా ఉన్నాడు అని చెప్పడంతో ఈ రిషికి ఏం పనిలేదు వసు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అని ధరణి మీద కోప్పడుతుంది. మరోవైపు వసుధార రిషి ఇద్దరు కలిసి చపాతి చేస్తూ ఉంటారు. అప్పుడు వసుధార చపాతి ఎలా తిక్కాలి అన్నది చూపిస్తూ ఉంటుంది.
 

56

అప్పుడు రిషి చపాతి చేస్తూ గట్టిగా తిక్కడంతో చపాతీ పిండి అతుక్కుపోతుంది. అప్పుడు వసుధార అలా కాదు సార్ ఇలా అని చూపిస్తూ ఉండగా అప్పుడు ఇద్దరు ఒకరిపై ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ధరణి వచ్చి రిషి నిన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారు అని అంటుంది. తర్వాత రిషి దేవయాని దగ్గరికి వెళ్తాడు. చెప్పండి పెద్దమ్మ అనడంతో కూర్చో రిషి నీతో మాట్లాడాలి అంటుంది. మరొకవైపు ధరణి అని గురించి టెన్షన్ పడుతూ ఉండగా వసుధార ధైర్యం చెబుతుంది.
 

66

తర్వాత దేవయాని మీ పెదనాన్న తొందరలోనే వస్తున్నారు మీ పెద్దన్న రాగానే వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడే పెళ్లి పనులు మొదలుపెడదాం అని అనడంతో వెంటనే రిషి డాడ్ లేకుండా ఏ పని జరగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ప్రేమగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved