Guppedantha Manasu: రిషిని క్షమాపణ కోరిన దేవయాని.. కొడుకుని చూసి గర్వపడుతున్న మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తల్లిని చంపిన వాళ్లని పట్టుకోవాలని తపన పడుతున్న కొడుకు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 1 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో సరదాగా ఎంజాయ్ చేస్తున్న రిషి దంపతులను చూసి ఆనందపడతాడు మహేంద్ర. రిషి దంపతులు సంతోషంగా ఉన్న సమయంలో దేవయాని ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి చెప్పండి పెద్దమ్మ అంటాడు. అలా మాట్లాడుతున్నావ్ ఏంటి నాన్న కనీసం బాగున్నావా అని కూడా అడగటం లేదు, అంత పరాయిదాన్ని అయిపోయానా అంటుంది దేవయాని. అలాంటిదేమీ లేదు పెద్దమ్మ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు రిషి.
ఎలా ఉంటాం రిషి మీరు ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత అసలు భోజనం సహించడం లేదు, మీ అన్నయ్య అయితే గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. మా కోసం నువ్వు తిరిగి వచ్చేయ్, నేను మాట జారి ఒక మాట అని ఉంటే నన్ను క్షమించు అంటుంది దేవయాని. అలా అనకండి పెద్దమ్మ.
మీరు మాత్రం కుటుంబ గౌరవం కోసమే కదా మాట్లాడారు నేను కూడా అదే గౌరవం కోసం అక్కడికి రావడం లేదు అంటాడు రిషి. అలా అనుకు నాన్న మీరు ఇక్కడికి వస్తేనే నాకు మనశ్శాంతి అంటుంది దేవయాని. అక్కడికి వస్తే నేను అనుకున్నది జరగదు పెద్దమ్మ అమ్మని చంపిన వాళ్ళని పట్టుకొని తీరాలి. అయినా మీరు నా కోసం అంత కంగారు పడిపోవటానికి నేనేమీ చిన్నపిల్లడిని కాదు అంటాడు రిషి.
నువ్వు హంతకులని పట్టుకున్న తర్వాత వస్తాను అంటే ఈలోపు నేను పోతానేమో అంటుంది దేవయాని. అలా అనకండి పెద్దమ్మ వస్తానులెండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. అప్పటికే అక్కడ ఉన్న మహేంద్ర మీ పెద్దమ్మ ఏమంటుంది అని అడుగుతాడు. అక్కడికి వచ్చేయమంటుంది అంటాడు రిషి. ఏం చేస్తున్నావు వెళ్తున్నావా.. వెళ్తున్నామా? అని అడుగుతాడు మహేంద్ర.
మీకు అవమానం జరిగిన చోటికి మిమ్మల్ని తీసుకువెళ్లి ఎలా నిలబెడతాను, మిమ్మల్ని ఒక మాట అంటే నన్ను కూడా అన్నట్టే అందుకే నేను మాత్రమే వెళ్తాను అంటాడు రిషి. థాంక్యూ అని చెప్పి కొడుకుని హాగ్ చేసుకుని నీలాంటి కొడుకు ని కన్నందుకు గర్వంగా ఉంది అని ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. అమ్మని చంపిన వాళ్ల గురించి మీకు ఏమీ తెలియకపోవచ్చు కానీ వాళ్ళని పట్టుకొని ప్రాసెస్లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
అప్పుడు నాకు సమాధానం చెప్పి తీరాలి అంటాడు రిషి. కచ్చితంగా చెప్తాను ఆ హంతకులు ఎవరైనా సరే క్షమించే ప్రసక్తే లేదు అంటాడు మహేంద్ర. హంతకులని క్షమించాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు అని రిషి ని అడుగుతుంది వసుధార. అదేం ప్రశ్న ఈ విషయంలో డాడ్ మాటే నా మాట, అసలు క్షమించే పరిస్థితి లేదు అంటాడు రిషి. మరోవైపు తల్లిని తెగ పొగిడేస్తాడు శైలేంద్ర.
నువ్వు మహానటివమ్మ వెళ్ళిపోయిన వాడిని వాడి నోటితోనే వస్తాను అనిపించేలాగా చేసావు, నువ్వు నిజంగా గ్రేట్ అంటాడు. మరి ఏమనుకున్నావ్ ఈ దేవయాని అంటే ఆరోజు రిషి ముందే జగతిని ఇంటి నుంచి పంపించేశాను, ఇప్పుడు వెళ్లిపోయిన రిషి ని ఇంటికి రప్పిస్తున్నాను అని గర్వంగా చెప్తుంది దేవయాని. ఎన్ని జరిగినా నీకు ఎం డి సీటు వస్తుంది అంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది.
నా భయం రిషి గురించి కాదు ఆ అనుపమ గురించి అంటుంది దేవయాని. నువ్వు అలాంటివి ఏమి మనసులో పెట్టుకోకు ఇంటికి వచ్చిన తర్వాత రిషికి అలాంటి అనుమానం రాకుండా చూసుకో చాలు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అంటాడు శైలేంద్ర. మరోవైపు గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది అనుపమ ఇంతలో ఆమె పెద్దమ్మ అక్కడికి వచ్చి నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది.
ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ కూర్చుంటావు అని అడుగుతుంది. నా ఊపిరి పోయే వరకు ఇలాగే ఉంటాను పెద్దమ్మ, అందర్నీ వదిలేసి దూరంగా బ్రతుకుతున్నాను కానీ జ్ఞాపకాలని మర్చిపోలేక పోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది అనుపమ. అందుకే నువ్వు గతంలోకి వెళ్ళు అని సలహా ఇస్తుంది పెద్దమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.