MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని, రాజీవ్.. కోపంతో రగిలిపోతున్న జగతి మహేంద్ర?

Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని, రాజీవ్.. కోపంతో రగిలిపోతున్న జగతి మహేంద్ర?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Feb 02 2023, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు పడవలు నీటిలో వదిలి మనసులో కోరికలు కోరుకొని కళ్ళు తెరిచి చూడగా అప్పుడు రెండు పడవలు ఒక చోట కలుసుకోవడంతో అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అది చక్రపాణి, మహేంద్ర,జగతి వాళ్ళు చూసి షాక్ అవుతారు. అప్పుడు రిషి ఈ పొగరు ఏంటి ఇక్కడికి వచ్చింది అయినా ఆ పేపర్లో ఏం రాసి ఉంటుంది అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార కూడా పడవలు వదలడానికి ఇక్కడికి వచ్చాడా రిషి సార్ ఏం కోరుకొని ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు వసు అక్కడికి వచ్చి ఏంటి సర్ ఇక్కడికి వచ్చారు అనగా ఏ రాకూడదా ఈ చెరువు ఏమైనా నీదా అని అంటాడు. అప్పుడు రిషి కొంతమంది కొన్ని మాటలు చెప్పారు కానీ అవన్నీ మాటలు గానీ మిగిలిపోయాయి అని అంటాడు. సర్ ఈ పడవలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో కదా అనగా మనుషులే ప్రయాణం చేయడం లేదు ఇంకా పడవలు ఎంత చెప్పు అని అంటాడు. ఆ తర్వాత సర్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడదాం అంటాడు రిషి. తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడిపోతుండగా వసుధార వెళ్లి పట్టుకుంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళిపోతుండగా చక్రపాణి అక్కడికి వచ్చి అందరూ ఒకటే చోట ఉన్నారు నేను నిన్ను వెళ్లి నిజం చెప్తాను అనడంతో వద్దు నాన్న అని చక్రపాణి ని ఆపుతుంది వసుధార.
 

36

ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరొకవైపు దేవయాని ధరణి వీళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పలేదా అనగా లేదు అత్తయ్య అని అంటుంది. చెప్పలేదు అత్తయ్య అనకపోతే ఇంట్లో ఎవరు ఇక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చు కదా అనగా ఇంతలోనే జగతి దంపతులు రావడంతో ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఉండగా అప్పుడు రిషి రావడం చూసి మౌనంగా ఉంటుంది దేవదాని. అప్పుడు వారి ముగ్గురిని చూసి ఏంటి నాన్న రిషి ఎక్కడికి వెళ్లారు అని అంటుంది. అప్పుడు దేవయాని ఎక్కడికి వెళ్లారు అని పదేపదే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు నోరు మెదపకపోవడంతో ఆ వసుధార వల్లే ఇదంతా తనను కాలేజీలో నుంచి తీసేస్తే అప్పుడు బాగుంటుంది అనడంతో పెద్దమ్మ తన మిషన్ ప్రాజెక్ట్ చేయడం కుదరదు అంటాడు రిషి.
 

46

అప్పుడు వసు సార్ కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పడంతో అప్పుడు రిషి అదే విషయాన్ని జగతి వాళ్లకు చెప్పగా ఎవరు చెప్పారు అని మహేంద్ర అనడంతో ప్రాజెక్ట్ హెడ్ చెప్పింది అనగా తను మనకు ఆర్డర్ వేసే వరకు వచ్చిందా అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని, వసుధారని తిడుతూ ఉండగా రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు చక్కర పని వసుధర తనను అడ్డుపడినందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగోలా పరిష్కారం ఆలోచించాలి అని చక్రపాణి ఆలోచించి రిషికి ఫోన్ చేస్తాడు. అప్పుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేయగా సిగ్నల్ లేకపోవడంతో చక్రపాణి ఎంత మాట్లాడినా కూడా రిషికి వినిపించదు. ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. 

56

అప్పుడు నాన్న నిజం చెప్పొద్దు రిషి సార్ అంతటి రిషి సార్ తెలుసుకుంటే మంచిది అని అంటుంది. ఇంతలోనే మళ్లీ చక్రపాణి ఫోన్ కి రిషి ఫోన్ చేయడంతో అప్పుడు వసుధర ఫోన్ కట్ చేస్తుంది. రాంగ్ నెంబర్ అని చెప్పి మెసేజ్ చేస్తుంది. నాన్న ప్లీజ్ నేను చెప్పేది వినండి నన్ను అర్థం చేసుకోండి ఇంకెప్పుడు ఇలా చేయకండి రిషి అంతట రిషి సార్ నిజం తెలుసుకుంటే బాగుంటుంది అని అంటుంది. ఇంకొకసారి ఇలా చేస్తే నా మీద ఒట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత దేవయాని, రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావు అనడంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాను అనడంతో అది సరే నిన్ను నమ్ముకున్నందుకు ఒక్క పని కూడా చేయలేదు అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి అంటుంది దేవయాని.
 

66

అప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రస్తుతం కాలేజీలో మీటింగ్ జరుగుతుంది నువ్వు అక్కడికి వెళ్లి వసుధార పరువు తీయాలి అని అంటుంది. అప్పుడు వసుధారని అవమానించడానికి రాజీవ్, దేవయాని ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తారు. తర్వాత రాజీవ్ కాలేజీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాజీవ్ డైరెక్టుగా మీటింగ్ హాల్లోకి వెళ్లి వసుధార అని పిలుస్తాడు. అప్పుడు వసుధార అక్కడ లేకపోవడంతో మహేంద్ర,జగతి వాళ్లకు దొంగ నమస్కారాలు పెడుతూ ఉంటాడు. అప్పుడు అందరి ముందు నా భార్య వసుధార ఎక్కడ ఉంది అని అడగడంతో జగతి మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీ అందరికీ నేను ఎవరో తెలియదు కదా వసుధార నా భార్య అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved