‘దేవర’వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్), బ్రేక్ ఈవెన్ లెక్కలు
ఓవర్సీస్‌లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘దేవర-1’ (Devara pre release business) ప్రీ రిలీజ్ ఏ మేరకు జరిగింది, ఏ ఏరియాలో ఎంతకు కొన్నారో చూద్దాం.
Junior NTR Devara
దేవర సినిమా సక్సెస్ దర్శకుడు కొరటాల శివకు ఎంత అవసరమో ..అంతకు మించి ఎన్టీఆర్ కు ఉంది. అందుకు కారణం సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రవేశిస్తూండటమే. ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ల తర్వాత చేస్తున్న సోలో చిత్రం ఇది. అంటే దేవర భారం మొత్తం ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ భుజాలపైనే కూడా ఉంది. దానికి తోడు RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. ఫ్యాన్స్ తో సమానంగా యాంటీ ప్యాన్స్ కూడా ఈ మూవీ కోసం వేయి కండ్లతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్స్ జనాల్లోకి బాగా వెళ్లాయి.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర' . ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు.
అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
devara part 1
దేవర అన్ని ఏరియాల్లోనూ మాసివ్ బిజినెస్ చేసింది. అడ్వాన్స్ బుక్కింగ్స్ అదిరిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు దాటింది. తెలుగు వెర్షన్ 160 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏరియా వైజ్ ఆ లెక్కలు చూస్తే.. :
నైజాం : 45 cr
సీడెడ్ : 25 cr
ఉత్తరాంథ్ర: 14 cr
గుంటూరు: 8.5 cr
ఈస్ట్ : 8.5 cr
వెస్ట్ : 6.5 cr
కృష్ణా : 7 cr
నెల్లూరు: 4 cr
ఆంధ్రా/ తెలంగాణా: 118.5 Crores
devara part 1
తమిళనాడు: 8 cr
కర్ణాటక: 16 cr
కేరళ: 2.5 cr
భారత్ లో మిగతా ప్రాంతాలు: 30 cr
ఆల్ ఓవర్ ఇండియా: 175 cr
ఓవర్ సీస్ : 28 cr
వరల్డ్ వైడ్ : 203 crores
బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ చిత్రం తెలుగులో దాదాపు 300 కోట్లు గ్రాస్ రావాలి. 100 కోట్లు మిగతా భాషల్లో గ్రాస్ రావాల్సి ఉంది. ఓవరాల్ గా 400 కోట్లు గ్రాస్ వస్తే దేవర బ్లాక్ బస్టర్ అయ్యినట్లు.
ఇక ఈ సినిమాకు క్లైమాక్స్ హైలెట్ అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే చివరి 40 నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్ అదిరిపోతాయని టీమ్ చెబుతోంది. అండర్ వాటర్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 200చదరపు గజాల్లో సముద్రాన్ని పోలిన సెట్ వేశారు. 35 రోజులపాటు షూట్ చేశారు. కృత్రిమ అలలు క్రియేట్ చేశారు. ట్రైలర్ లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి రోజంతా సమయం పట్టిందట.