`దేవర` ఓవర్సీస్ రైట్స్.. ఎంతకు కొన్నారు? ఎవరు కొన్నారో తెలుసా?.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ షాకే
ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న `దేవర` చిత్రం వచ్చే నెలలో రాబోతుంది. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా సెటిల్ అయినట్టు టాక్. తాజాగా ఓవర్సీస్ రైట్స్ ఫైనల్ అయ్యింది.
ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. చివరగా ఆయన `ఆర్‌ఆర్‌ఆర్`తో మెరిశాడు. సోలో హీరోగా ఆరేళ్లు అవుతుంది. దీంతో ఆయన అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సోలోగా బాక్సాఫీసు మీద తారక్ చేసే రచ్చ చూసేందుకు ఆతృతతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
రా కంటెంట్ తోనే కమర్షియల్ ఎలిమెంట్లు మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆయన చివరగా `ఆచార్య`సినిమాని రూపొందించారు. చిరంజీవితో చేసిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో `దేవర`ని చాలా కసితో చేస్తున్నారు కొరటాల. ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో దీన్ని విడుదల చేయబోతున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు పోయాయి. హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్లు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్నారట. తాజాగా టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే `దేవర` మూవీ ఓవర్సీస్ రైట్స్ కి సంబంధించిన నెంబర్స్ షాకిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 27కోట్లకు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది చాలా తక్కువ ఎమౌంట్. ఇటీవల `కల్కి 2898ఏడీ` చిత్రానికి 70కోట్లకుపైగా ఓవర్సీస్ బిజినెస్ అయ్యింది. `సలార్`, `ఆర్ఆర్‌ఆర్`, ఇలా చాలా సినిమాల బిజినెస్ ఎక్కువగానే ఉంది. కానీ తారక్ సినిమాకి ఇంత తక్కువ బిజినెస్ కావడం ఆశ్చర్యం పరుస్తుంది. ఎన్టీఆర్‌కి అక్కడ బలమైన మార్కెట్ లేకపోవడమే కారణం అంటున్నారు. మరి `దేవర`తో అయినా స్ట్రాంగ్‌గా పాగా వేసుకుంటాడా అనేది చూడాలి.
మరోవైపు `దేవర` తెలుగు రైట్స్ భారీగానే అమ్ముడు పోయాయట. తెలుగు రైట్స్ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ దక్కించుకున్నాడు. అయితే ఆయన ఏకంగా రూ. 115కోట్లకు రెండు తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. హిందీ రైట్స్ 45కోట్లు అని తెలుస్తుంది. ఇలా థియేట్రికల్ బిజినెస్ 200కోట్లకుపైగా అమ్ముడు పోయిందని, రూ.155కోట్లకుపైగా(నెట్ ఫ్లిక్స్) ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయట. ఇలా రిలీజ్‌కి ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది `దేవర`. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.