- Home
- Entertainment
- మహేష్, ప్రభాస్, చైతు లకి దారుణమైన డిజాస్టర్లు.. ఆమెతోనే రిస్క్ చేస్తున్న సౌత్ స్టార్ హీరో
మహేష్, ప్రభాస్, చైతు లకి దారుణమైన డిజాస్టర్లు.. ఆమెతోనే రిస్క్ చేస్తున్న సౌత్ స్టార్ హీరో
బాలీవుడ్ హీరోయిన్లు చాలా మందికి సౌత్ లో నిరాశ తప్పడం లేదు. కొందరు మాత్రమే సౌత్ హీరోలతో నటించి విజయాలు అందుకుంటున్నారు. కృతి సనన్ తెలుగు చిత్రంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

బాలీవుడ్ హీరోయిన్లు చాలా మందికి సౌత్ లో నిరాశ తప్పడం లేదు. కొందరు మాత్రమే సౌత్ హీరోలతో నటించి విజయాలు అందుకుంటున్నారు. సౌత్ హీరోలకి కలసిరాని బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కృతి సనన్ గురించి.
కృతి సనన్ తెలుగు చిత్రంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు సరసన తొలి చిత్రంలోనే నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్, కృతి జంటగా నటించారు. టెక్నికల్ గా, మహేష్ నటన, సుకుమార్ టేకింగ్ పరంగా ఆ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ మూవీ దారుణమైన డిజాస్టర్.
నాగ చైతన్యతో దోచెయ్ అనే చిత్రంలో కూడా నటించింది. ఆ మూవీ కూడా నిరాశపరిచింది. ఇక ప్రభాస్ సరసన నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించింది. అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం విమర్శలపాలైంది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్ తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
సౌత్ లో కృతి సనన్ కి ఏమాత్రం కలసి రాలేదు. అయినా కూడా కృతి సనన్ సౌత్ లో మరో స్టార్ హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ధనుష్ కి జోడిగా కృతి సనన్ 'తేరే ఇష్క్ మేయిన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆమె ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కృతి సనన్ బోల్డ్ గా సిగరెట్ కాల్చుతూ కనిపిస్తోంది. ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఈ టీజర్ లో ఉంది. మొత్తంగా కృతి సనన్, ధనుష్ కలసి ఒక ఇంటెన్స్ కథలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆమెకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.