- Home
- Entertainment
- 12 సినిమాలు చేస్తే అందులో 10 అట్టర్ ప్లాప్, అయినా ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు
12 సినిమాలు చేస్తే అందులో 10 అట్టర్ ప్లాప్, అయినా ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు
ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు, కాస్త లక్కు కూడా తోడవ్వాలి. ఎంత టాలెంట్ ఉన్నా.. కొన్నిసార్లు సక్సెస్ దొరకడం కష్టమవుతుంది. టాలీవుడ్లో సక్సెస్ రేట్తో సంబంధం లేకుండా.. స్పెషల్ ఇమేజ్ సాధించిన హీరోయిన్ తెలుసా?

సాఫ్ట్వేర్ నుంచి వెండితెరకు..
అనన్య నాగళ్ల ఫిల్మ్ జర్నీ.. కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిదాయకం. నటనపై ఉన్న ఇష్టంతో లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది అనన్య. ఫస్ట్ మోడలింగ్ లోకి వచ్చు.. తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తన నేచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నటుడు ప్రియదర్శి సరసన వచ్చిన 'మల్లేశం' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తెలంగాణ గ్రామీణ యువతి పాత్రలో ఆమె కనబరిచిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి.
వకీల్ సాబ్’ సినిమాతో పెద్ద బ్రేక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం అనన్య కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఒక కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె, ఈ సినిమాతో భారీ గుర్తింపును సాధించారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కెరీర్లో ముందుకు సాగుతూ 'మ్యాస్ట్రో', 'ఊర్వశివో రాక్షసివో', 'శాకుంతలం', 'మళ్లీపెళ్లి', 'పొట్టేల్', 'తంత్ర' వంటి డిఫరెంట్ కథలతో తెరకెక్కిన సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించింది.
హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేని ఇమేజ్..
అనన్య ఇప్పటివరకు దాదాపు 12 చిత్రాలలో నటించారు. అయితే, బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే వీటిలో మెజారిటీ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. కేవలం రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. అయినప్పటికీ, ఆమె నటనపై.. నటిగా ఆమెకున్న ఇమేజ్ పై ఈ ఫలితాలు ఎలాంటి నెగెటీవ్ ప్రభావం పడలేదు. ఓటమి ఎదురైనా నిరాశచెందకుండా, పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విభిన్నమైన జోనర్లను ప్రయత్నిస్తున్నారు.
సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అనన్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. తరచూ తన గ్లామరస్, ట్రెడిషనల్ ఫొటోలు, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. ఈ రకంగా డిజిటల్ మాధ్యమంలో కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్గా మారారు. ఫలితాల కంటే కంటెంట్కే ప్రాధాన్యమిస్తూ, కొత్త అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్లో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

