MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepthi Sunaina:'నిజాలు నగ్నంగా మారుస్తాయి'... వర్మ ట్వీట్ ని షణ్ముఖ్ పై సంధించిన దీప్తి సునైన?

Deepthi Sunaina:'నిజాలు నగ్నంగా మారుస్తాయి'... వర్మ ట్వీట్ ని షణ్ముఖ్ పై సంధించిన దీప్తి సునైన?

బిగ్ బాస్ (Bigg Boss)సెలబ్రిటీలు దీప్తి సునైన, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ రెండు వారాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 18 2022, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deepthi Sunaina

Deepthi Sunaina

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) లో పాల్గొన్న షణ్ముఖ్-సిరి చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో దీప్తి (Deepthi Sunaina)లవ్ బ్రేకప్ సమాచారం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మరోవైపు దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి అంటున్నారు. కారణం ఎవరైనా... దీప్తి మాత్రం షణ్ముఖ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లున్నారు. ఆమె పరోక్షంగా షణ్ముఖ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

37

తాజాగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ట్వీట్ చేసిన ఓ కోట్ ని ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. ధనుష్-ఐశ్వర్యల విడాకులను ఉద్దేశిస్తూ వర్మ... జనాలు అబద్ధాలనే ఇష్టపడతారు. కారణం నిజాలు వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టి నగ్నంగా మారుస్తాయి. కానీ అబద్దాలు వాటిని కప్పిపుచ్చుతాయి... ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ దీప్తి సునైన తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది.

47
Deepthi Sunaina

Deepthi Sunaina

దీప్తి ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఖచ్చితంగా షణ్ముఖ్ గురించే చేసిందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. మరి అదే నిజమైతే దీప్తి ఉద్దేశంలో షణ్ముఖ్ అబద్దం వెనుకబడి నిజాన్ని విస్మరిస్తున్నాడని చెప్పవచ్చు. లేదంటే షణ్ముఖ్ దీప్తికి అబద్దాలు చెబుతూ తన నిజస్వరూపం దాస్తున్నాడని ఆమె నమ్మవచ్చు.

57

షణ్ముఖ్ పై కోపంగా ఉన్న దీప్తి అతనికి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. షణ్ముఖ్ మాత్రం ఇప్పటికీ ఆమె మనసు మార్చుకుంటుందని నమ్మకంతో ఉన్నాడు. దీప్తి ఖచ్చితంగా తిరిగి మరలా తనను ప్రేమిస్తుందని భావిస్తున్నాడు. షణ్ముఖ్ పేరెంట్స్ సైతం దీప్తి-షణ్ముఖ్ మరలా కలిసిపోతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

67

యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.

77

దీప్తి సునైన కూడా బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి పాల్గొన్నారు. ఇక లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. బ్రేకప్ తర్వాత ఇద్దరూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved