- Home
- Entertainment
- షణ్ముఖ్ ని దీప్తి సునైనా మరచిపోయినా.. నెటిజన్లు మాత్రం వదలడం లేదుగా, లేటెస్ట్ పిక్స్
షణ్ముఖ్ ని దీప్తి సునైనా మరచిపోయినా.. నెటిజన్లు మాత్రం వదలడం లేదుగా, లేటెస్ట్ పిక్స్
సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది.
తాజాగా దీప్తి సునైనా అందమైన బ్లాక్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. టైట్ ఫిట్ డ్రెస్ లో దీప్తి సునైనా స్టైలిష్ గా అదరగొట్టేసింది. దీప్తి సునైనా ఫోజులకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి.
దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా ఫోటో షూట్ చేసింది.
గతంలో షణ్ముఖ్, దీప్తి సునైనా మధ్య ఎఫైర్ సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. షణ్ముఖ్ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు. అతడి ప్రమోషన్స్ కోసం దీప్తి ఎంతో కష్టపడింది.
అయితే వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. షణ్ముఖ్ రీవెంట్ గా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్ గురించి నేరుగా దీప్తి సునైనా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.
కానీ ఆ సమయంలో ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా సమాధానం ఒక్కటే. అంతా మంచే జరుగుతుంది అని పోస్ట్ చేసింది. ఒక వేళ మంచి పరిస్థితులు కాకపోయినా అన్ని సర్దుకుంటాయి అన్నట్లుగా కామెంట్ పెట్టింది. నెటిజన్లు ఈ కామెంట్స్ షణ్ముఖ్ ని ఉద్దేశించే అని అంటున్నారు.
అయితే తాజాగా దీప్తి సునైనా షేర్ చేసిన ఫోటోలకి కూడా నెటిజన్లు షణ్ముఖ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.దీప్తి సునైనా షణ్ముఖ్ ని మరచిపోయినా నెటిజన్లు మాత్రం వదలడం లేదు.
అసలు షణ్ముఖ్ ఇంత అందమైన అమ్మాయిని ఎందుకు వదులుకున్నాడు అంటూ చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు. దీప్తి వల్ల సమ్మర్ వేడి మొదలైంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.