అఫీషియల్.. షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. మంట పెట్టింది ఎవరు
దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక దీప్తి అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా చేసింది. చివరి వరకు షణ్ముఖ్ ని గెలిపించడానికి ప్రయత్నించింది.
దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో దీప్తి, తనీష్ మధ్య లవ్ ట్రాక్ గురించి బాగా చర్చ జరిగింది. అయితే అది హౌస్ వరకే పరిమితం. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సన్నీ విజేతగా అవతరించాడు.
ఇదిలా ఉండగా దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక దీప్తి అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా చేసింది. చివరి వరకు షణ్ముఖ్ ని గెలిపించడానికి ప్రయత్నించింది. వీలైనన్ని ఎక్కువ ఓట్లు షణ్ముఖ్ కి పడేలా ప్రయత్నించింది. కానీ షణ్ముఖ్ రన్నరప్ తోనే సరిపెట్టుకున్నాడు.
ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ 5 ముగిశాక సునైనా, షణ్ముఖ్ గురించి రూమర్స్ ఎక్కువయ్యాయి. త్వరలో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియా ఎక్కువయ్యాయి. దీనికి తోడు దీప్తి సునైనా కూడా 'మార్పు అవసరం' అంటూ పరోక్షంగా హింట్స్ ఇస్తూ వచ్చింది. నిన్న డిసెంబర్ 31న అభిమానులు ఊహించిందే జరిగింది. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు దీప్తి సునైనా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీనితో అటు షణ్ముఖ్ ఫ్యాన్స్, ఇటు సునైనా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
'ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను షణ్ముఖ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేమిద్దరం ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తాం. ఐదేళ్ల పాటు మేమిద్దరం ఎంతో ప్రేమగా ఉన్నాం. ఇకపై మా దారులు వేరని తెలిసింది. మా దారులు వేరని మేమిద్దరం రియలైజ్ అయ్యాము. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం అని దీప్తి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
బ్రేకప్ విషయాన్ని దీప్తి సునైనా అధికారికంగా ప్రకటించింది. కానీ షణ్ముఖ్ మాత్రం మౌనం వహిస్తున్నాడు. అసలు వీరిద్దరి మధ్య మంట ఎలా మొదలయింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ 5లో షణ్ముఖ్ సిరితో బాగా క్లోజ్ గామూవ్ అయ్యాడు. ప్రతి సీజన్ లో లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది. కానీ షణ్ముఖ్, సిరి మధ్య రొమాన్స్ అందరికి చిరాకు పుట్టించింది.
ఫ్రెండ్ షిప్ పేరుతో వీరిద్దరూ శృతిమించేలా హగ్గులు, కిస్సులతో విసుగు పుట్టించారు. ప్రతి విషయంలో షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చేస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. ఈ లవ్ ట్రాక్ వల్లే షణ్ముఖ్ ఫైనల్ వరకు రాగలిగాడని, హౌస్ లో అతడు చేసింది ఏమీ లేదనే విమర్శలు ఇప్పటికి వినిపిస్తున్నాయి.
సిరి, షణ్ముఖ్ ల వ్యవహారం దీప్తి సునైనాకి కోపం తెప్పించి ఉండొచ్చు. అందువల్లే వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి బ్రేకప్ వరకు వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. Also Read: RRR Postpone:'ఆర్ ఆర్ ఆర్' వాయిదా,ఈ రోజే ఎనౌన్సమెంట్?