పెళ్లయ్యాక ఇవేం పనులు దీపికా... పాపం రణ్వీర్ అంటూ భర్తపై జాలిపడుతున్న నెటిజెన్స్!
ట్రెండ్ మారిపోయింది. పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ కూడా బోల్డ్ రోల్స్ కి, స్కిన్ షోకి అడ్డు చెప్పడం లేదు. బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె బికినీలో తెగించి అందాల ప్రదర్శన చేస్తుంది.
Deepika Padukone
ఒకప్పుడు పెళ్ళైన హీరోయిన్స్ సినిమాలు మానేసేవారు. బుద్దిగా కాపురం చేసుకునే వాళ్ళు. ఒకరి భార్యగా ఉండి పరాయి పురుషుడితో ఆడిపాడటం తప్పనుకునేవాళ్ళు. కాలం మారిపోయింది. జనాల్లో విశాల భావాలు పెరిగిపోయాయి.
Deepika Padukone
పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి ముడిపెట్టకూడదు అంటున్నారు. అభిషేక్ ని చేసుకున్న ఐశ్యర్య రాయ్ ధూమ్ 2 లో హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్స్ చేసింది. అక్కడ దాకా ఎందుకు మన తెలుగు హీరోయిన్ సమంత చైతూ భార్యగా ఉండి, సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మాన్ 2 లో దారుణమైన శృంగార సన్నివేశాల్లో పాల్గొంది.
తాజాగా దీపికా పదుకొనె పఠాన్ సినిమా కోసం ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. ఆ చిత్రంలోని బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీలో కనిపించారు. బేషరమ్ సాంగ్ డిసెంబర్ 12న విడుదల కానుంది. ఆ సాంగ్ లోని తన స్టిల్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హీటు పెంచుతుంది.
దీపికా బికినీ ఫోజులు చూసి... పెళ్లి తర్వాత కూడా ఈ అరాచకం ఏమిటీ? అంటున్నారు. అదే సమయంలో పాపం రణ్వీర్ సింగ్ అంటూ భర్తపై జాలి పడుతున్నారు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ జనవరి 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
ఇక ప్రాజెక్ట్ కే మూవీతో దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే హీరోయిన్ గా దీపికా నటిస్తున్నారు. ఆమె ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అయితే దీపికా మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ మధ్య ప్రాజెక్ట్ కే సెట్స్ లో దీపికా అనారోగ్యానికి గురయ్యారట. వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక దీపికా కారణంగా ప్రాజెక్ట్ కే సమస్యల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక రణ్వీర్ సింగ్ ని దీపికా వివాహం చేసుకొని నాలుగేళ్లు కావస్తుంది. ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్న ఈ సెలెబ్రిటీ జంట ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం లేదు. అప్పుడప్పుడు మీడియా ఈ విషయాన్ని అడిగినా మెల్లగా దాటవేస్తున్నారు.