- Home
- Entertainment
- దీపికా పెట్టిన కండిషన్స్ కి శింబు ఫ్యూజులు అవుట్.. ఆ బడ్జెట్ తో మరో క్రేజీ సినిమా తీసేయొచ్చు..
దీపికా పెట్టిన కండిషన్స్ కి శింబు ఫ్యూజులు అవుట్.. ఆ బడ్జెట్ తో మరో క్రేజీ సినిమా తీసేయొచ్చు..
తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు.

తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు. తమిళనాట శింబుకి రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఉంది.
శింబు చివరగా నటించిన చిత్రం 'పత్తుతల' తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో శింబు తన 48వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. శింబు కెరీర్ లోనే క్రేజీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి పెరియసామి దర్శకుడు.
హై బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో శింబుకి జోడిగా బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనె నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించగా దీపికా ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆమె డిమాండ్లకు శింబు అండ్ టీం కి ఫ్యూజులు ఎగిరిపోయాయట. దీపికా పదుకొనె శింబు చిత్రం కోసం ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు ఆమె విప్పిన ఖర్చుల చిట్టా చూసి అంతా కంగుతిన్నారు. లగ్జరీ హోటల్ లోనే ఆమెకు బస ఏర్పాటు చేయాలట. షూటింగ్ జరిగినన్ని రోజులు హోటల్ లో ఫ్లోర్ మోత్తం తనకే బుక్ చేయాలనీ కోరిందట. ఇక ట్రావెల్ ఖర్చులు, ఆమె సిబ్బంది ఖర్చులు ఎలాగు ఉన్నాయి.
దీపికా పదుకొనె పారితోషికం నాయాంతరా పారితోషికం కంటే చాలా ఎక్కువ. ఈ రేంజ్ ఖర్చులు భరించలేం అని దీపికా పదుకొనెని ఎంపిక చేసుకునే ఆలోచన శింబు చిత్ర యూనిట్ విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొనె రీసెంట్ గా షారుఖ్ పఠాన్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పఠాన్ చిత్రంలో గ్లామర్ బౌండరీలన్నీ బ్రేక్ చేస్తూ దీపికా పదుకొనె అందాల ఆరబోతలో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆమె స్కిన్ షోకి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఓ సాంగ్ లో షారుఖ్ తో కలసి ఆమె చేసిన డ్యాన్స్, కాస్ట్యూమ్స్ అసభ్యంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి.