- Home
- Entertainment
- Deepika About Ananya : ఆమె ఎవరో తెలియదు.. అనన్య పాండేపై దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్..
Deepika About Ananya : ఆమె ఎవరో తెలియదు.. అనన్య పాండేపై దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్..
తన కోస్టార్ అనన్య పాండే గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone). ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ దీపికా ఏమన్నది..?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. లైగర్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday).. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరూ కలిసి గ్రెహ్రాయా అనే మూవీలో నటించారు. ఈసినిమా 11న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్ హడావిడిలో బిజీగా ఉన్నారు టీమ్
గ్రెహ్రాయా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గోంటున్నారు టీమ్. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కో స్టార్ అనన్య పాండే (Ananya Panday) గురించి హాట్ కామెంట్స్ చేసింది దీపికా. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇంటర్య్వూలో అనన్య(Ananya Panday) గురించి దీపికా (Deepika Padukone) మాట్లాడుతూ.. గెహ్రాన్ మూవీ చేసే ముందు వరకు నాకు అనన్య పాండే (Ananya Panday) అంటే ఎవరో తెలియదు. తనని ఎప్పుడు కలవలేదు కూడా అంటూ షాక్ ఇచ్చింది. అంతే కాదు ఇదేదో జోక్ చేయడానికి చెప్పడం లేదంటూ... అందరూ నివ్వెర పోయేలా చేసింది. నిజంగానే ఈ మూవీ స్టార్ట్ అయ్యే వరకూ అనన్య ఎవరనేది అసలు తెలియదు. అందరి లాగే నేను కూడా తన పేరును సోషల్ మీడియాలో విన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది దీపికా.
అంతే కాదు దీపికా (Deepika Padukone) తమ వయసుల ప్రస్తావన కూడా తీసుకు వచ్చింది. నా వయసు 36, అనన్య వయసు 23. అనన్య (Ananya Panday) నా చెల్లి కన్నా చిన్నది. తనతో కలిసి నటించడం నిజంగా చక్కటి అనభూతిని ఇచ్చింది. అనన్య అందరి అమ్మాయిల్లా.. అందరు యాక్ట్రస్ ల్లా కాదు..ఆమె చాలా తెలివైన అమ్మాయి అంటూ కితాబిచ్చింది దీపికా(Deepika Padukone). అంతే కాదు... సెట్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది బాగా గమనిస్తుంది.. వాళ్ల నుంచి కొత్త విషయాలు వదిలిపెట్టుకుండా నేర్చుకుంటుంది అంటూ.. అనన్యను ఆకాశానికెత్తేసింది దీపికా.
ఇక అనన్యను చూస్తే..భవిష్యత్తులో తను ఇంకా పెద్ద స్టార్ అవుతుందని తనకు అనిపించిందంటుంది దీపికా (Deepika Padukone). అంతే కాదు ఆమె మరిన్నీ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నానని అంటూ దీపికా చెప్పుకొచ్చింది. అయితే అనన్య ఎవరో తెలియదంటూ దీపికా (Deepika Padukone) కామెంట్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన అనన్య తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ప్రస్తుతం గెహ్రాన్ సినిమా హడావిడిలో ఉన్నారు ఈ ఇద్దరు స్టార్లు. ఈ మూవీలో దీపికా పదుకొనే (Deepika Padukone) లీడ్ రోల్ చేస్తుండగా.. అనన్య పాండే (Ananya Panday), గల్లిబాయ్ ఫేం సిద్ధార్థ్ చతర్వేది కో స్టార్స్ గా నటించారు. యంగ్ స్టార్ షకుల్ ఈమూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.