- Home
- Entertainment
- Deepika About NTR, Bunny: ఎన్టీఆర్, బన్నీగురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పదుకునే...
Deepika About NTR, Bunny: ఎన్టీఆర్, బన్నీగురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పదుకునే...
పెళ్లి తరువాత కూడా బాలీవుడ్ లో సూపర్ హాట్ అనిపించుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకొనే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ టలీవుడ్ యంగ్ స్టార్స్ ఎన్టీఆర్, బన్నీపై హాట్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ సూపర్ హాట్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. వరుస సినిమాలతో దూసుకుపోతున్న దీపికా ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ మీద కూడా కాంన్సంట్రేట్ చేసింది. దీపికా తాజాగా నటించిన గెహ్రైయాన్ ఈ రోజు అమెజాన్ ప్ర్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య పాండే కూడా ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇక ఈ మూవీలో సిద్దాంత్ తో హాట్ హాట్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది దీపికా. వీటి గురించి ఎన్ని విమర్షలు వచ్చినా లెక్క చేయడనని చెప్పేసింది.
ఇక గెహ్రైయిన్ మూవీ ప్రమోషన్ లో బాగంగా చాలా కార్యక్రమల్లో పాల్గోంది దీపిక. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన మనసులో మాటలను పంచుకుంది. అందులో మన సౌత్ హీరోల గురించి అది కూడా మన ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని ఇండియన్ స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అంటూ దీపికను ప్రశ్నించగా ఆమె బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పకుండా సౌత్ హీరోలు అది కూడా తెలుగు హీరోల పేర్లు చెప్పింది. ఎన్టీఆర్ , అల్లు అర్జున్ తో కలిసి సినిమాలు చేయాలని ఉన్నట్టు చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ.
ఫస్ట్ ఎన్టీఆర్ పేరును చెప్పిన దీపిక పదుకునే తారక్ తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది దీపికా.
అలాగే మరో తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడింది బాలీవుడ్ బ్యూటీ. అల్లు అర్జున్ తో కూడా కలిసి నటించాలని ఉన్నట్టు చెప్పింది. ఈ ఇద్దరు స్టార్స్ కు ప్రస్తుంతం పాన్ ఇండియా రేంజ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో క్రేజ్ సంపాదిస్తే.. బన్నీ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ఈ ఇద్దరు స్టార్స్ తో నటించాలని దీపికా చెప్పడం తో.. ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇదే ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా దీపిక పదుకునే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ప్రభాస్ తో నటించడం చాలా బాగుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రబాస్ తో కలిసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. దీపికా నటిస్తుంది. ఇదే మూవీలో అమితాబ్ కూడా నటిస్తున్నారు.
ప్రభాస్ మరియు దీపిక పదుకునేలా ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సినిమా టైమ్ ట్రావెల్ కథతో రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రకటించినా.. కరోనాతో పాటు కొన్ని కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు దీపిక లుక్స్ డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే యూనివర్సల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమా చేయడం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు కూడా బాలీవుడ్ హీరోయిన్స్ లో ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఇప్పటికే ఎన్టీఆర్ తో ఆలియా బట్ ట్రిపుల్ ఆర్ లో నటిచింది. ఇప్పుడు దీపికా టాలీవుడ్ చేరింది. రాను రాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. సౌత్ హీరోలతో.. సౌత్ సినిమాల్లో మెరవబోతున్నట్టు తెలుస్తోంది.