- Home
- Entertainment
- Karthika Deepam: మోనిత చంప చెల్లుమనిపించిన దీప.. వారణాసి పరిస్థితి చూసి కుమిలిపోతున్న సౌర్య!
Karthika Deepam: మోనిత చంప చెల్లుమనిపించిన దీప.. వారణాసి పరిస్థితి చూసి కుమిలిపోతున్న సౌర్య!
Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 18వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దీప ఉదయాన్నే లేచి తన తాళిబొట్టుకి దండం పెట్టి తర్వాత దేవుడికి నమస్కారం పెట్టి బయటకు వస్తుంది. బయటికి వచ్చి చూసేసరికి కార్తీక్ అప్పటికే కూర్చుని ఆలోచనలో ఉంటాడు. ఇంతలో దీప వచ్చి ఏమైంది డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు తలుపు కొట్టాల్సింది కదా. ప్రతిరోజు ఉదయాన్నే లేచే దాన్ని ఈరోజు కొంచెం ఎక్కువ సేపు అయిపోయింది అని అంటుంది. ఏం కావాలి డాక్టర్ బాబు అని దీప అడగగా ఏమీ వద్దు నీ పనులు చేసుకో అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప పనులు చేస్తూ ఉండగా దీప దగ్గరికి వెళ్ళిన కార్తీక్, నీకు పిల్లలున్నారు కదా వంటలక్క అని అనగా, అవును ఇద్దరు పిల్లలు ఉన్నారు శౌర్యని వాళ్ళ నాన్న రౌడీ అని పిలుస్తారు అని అంటుంది దీప.వాళ్ళు ఎక్కడున్నారు అని కార్తీక్ అడుగుతాడు.
అప్పుడు దీప వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉన్నారు అని చెప్తుంది. లేదు దీప అందులో సౌర్య మనకోసమే ఎదురు చూస్తుంది మనం ఎప్పుడు తన దగ్గరకి తిరిగి వస్తామో అనుకుంటుంది అని ఆలోచనలో పడతాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ ఆలోచనలో పడటం చూసిన దీప ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది. ఏం లేదు వంటలక్క కొంచెం తలనొప్పిగా ఉన్నది అని కార్తీక్ అంటాడు. దానికి దీప టీ పెట్టి తెస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత తన గదిలో కార్తీక్ కోసం ఆలోచించుకుంటూ, ఏంటి కార్తీక్ ఇంకా రాలేదు రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు కొంపతీసి వంటలక్క దగ్గర ఉన్నాడా వెళ్లి చూడాలి అని అక్కడికి వెళ్లి చూస్తుంది. అప్పటికే కార్తీక్ వంటలక్క కలిపి టీ తాగుతూ వాళ్ళ గదిలో ఉంటారు. అప్పుడు మోనిత కోపంగా వెళ్లి వంటలక్క రాత్రంతా నా మొగుడిని నీతో పాటు అని అనేలోగే దీప మోనిత, దీప చంప చెల్లుమనిపిస్తుంది.
అప్పుడు మోనిత,నన్నే కొడతావా ఎంత ధైర్యం నీకు అని అనగా ఒక చంపుతో ఆపాను సంతోషించు.ఉదయం లేచిన సరికి డాక్టర్ బాబు ఇక్కడున్నారు అని అసలు జరిగిన విషయం అంత చెప్పుకొని వస్తుంది దీప.అప్పుడు మోనిత,అయినంత మాత్రాన నన్నే కొడతావ అని దీపకు చెప్తూ చూడు కార్తీక్ నీ భార్యని కొడుతుండు అని అడుగుతుంది. దానికి కార్తీక్ నా భార్య ఎవరు నువ్వా దీపనా? అంటే ఈ మధ్య నాకు గతం సరిగా గుర్తు రావడంలేదు అన్ని మర్చిపోతున్నాను ఇందాక నువ్వేదో అన్నట్టు ఉన్నావ్ కదా నా మొగుడుతో రాత్రి అని వంటలక్కే కాదు ఏ స్త్రీతో ఇలా సరే రెండు నిమిషాల్లో నీ చెంప చెల్లుమనకపోతే అడుగు అని అంటాడు కార్తీక్.దానికి మోనిత,అర్థమైంది కార్తీక్ నువ్వు ఈ మధ్య దీనికే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావ్ కదా చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత మోనిత బోటిక్ లో కూర్చుని ఉండగా కార్తీక్ కావాలని అక్కడికి వచ్చి ఏమైంది చెంప పట్టుకున్నావు అని అడుగుతాడు. ఇప్పుడే జరిగింది అప్పుడే మర్చిపోయావా కార్తీక్ కావాలనే అడుగుతున్నావ్ కదా అని అంటుంది మోనిత. ఎవరైనా వాళ్ల భార్యని కొడితే తిరిగి వాళ్ళ చెంప పగలగొట్టాలి కానీ నువ్వు నీతులు చెప్తున్నావు చాలా బాగుంది కార్తిక్ అని అరుస్తూ ఉంటుంది అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి మోనిత, నువ్వు అడిగినట్టు మనిద్దరి కోసం రెండు రవ్వ దోశలు తెచ్చాను అని అంటాడు. పక్కనే ఉన్న కార్తీక్ ని చూసి అయ్యో కార్తీక్ సార్ వచ్చేసారా కార్తీక్ సార్ రారనుకొని నువ్వు నాకు రెండే తెమ్మన్నావు కదా అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా పోనీ నాది ఇచ్చెయ్యనా అని దుర్గ అంటాడు.
ఇంతలో దీప వచ్చి, కార్తీక్ బాబు మీ కోసం నేను టిఫిన్ తెచ్చాను అని చెప్పి నిన్న రాత్రిది అన్నం మిగిలింది దాంతో ఉదయాన్నే పులిహార చేశాను అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ దీపతో మీ డాక్టర్ బుక్ కూడా పులిహోర ఇష్టమా అని అడగగా చాలా ఇష్టం అని దీప అంటుంది. అయితే పద నాకు తినాలని ఉంది అని హాల్ దగ్గరికి వెళ్తారు. దీప కార్తిక్ కి వడ్డిస్తున్నప్పుడు ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు దీప ఆనంద్ ని ఎత్తుకుంటుంది.కానీ దుర్గ మోనిత ని అడ్డుకుంటాడు. ఇందులో మోనిత అక్కడ బోటిక్ లో ఉన్న సుమలతతో వెళ్లి ఆనంద్ నీ తీసుకురామని చెప్తుంది.సుమలత దీప దగ్గరికి వచ్చి ఆనంద్ ఇవ్వమని అడగగా మొనిత ఏం చేస్తుంది తనకు కావాలంటే తననే తీసుకుంటాది అని అంటాడు కార్తిక్. ఇంతలో మోనిత అక్కడికి వస్తుంది.
నువ్వు ఈ మధ్య సరిగ్గా బాబుని చూసుకోవడం లేదు ఈరోజు నుంచి బాబు బాధ్యత దీప ది అని అనగా,ఏమి అవసరం లేదు కార్తీక్ నేను చూసుకుంటాను అని మోనిత చెప్పి ఆనంది దీప నుంచి బాబు ని తీసుకుంటుంది. అప్పుడు కార్తీక్, దీప ను చూసిన వెంటనే బాబు ఏడుపు ఆపేసాడు అని చెప్పి దీప ను చూసుకోమన్నాను అంతకుమించి ఏం లేదు అని చెప్తాడు. ఇంతలో కార్తిక్ కి ఒక ఫోన్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో సౌర్య, వాళ్ళ బాబాయ్ దగ్గరికి వచ్చి వారణాసి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. లేదు ఏం తెలియలేదు అమ్మ హాస్పిటల్ లో ఉన్నారట ఎవరో గట్టిగా కొట్టారట క్షీణ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పగా,ఎవరు కొట్టి ఉంటారు బాబాయ్ వారణాసి నాకోసం ఎన్నో చేశాడు.
జీవితంలో వారణాసి మేలు ఎప్పటికీ మరువలేను అమ్మా నాన్నలకు కూడా ఎంతో సహాయం చేశాడు అనుకొని ఒకవేళ మోనిత ఆంటీ పని అయ్యి ఉంటదా అని సౌర్య అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ బాబాయ్, ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు అని అడగగా మనం వెతుకుతున్న రహస్యం ఏదో వారణాసికి తెలిసి ఉంటదా అందుకే మాటలు రాకుండా ఇలా చేసి ఉంటదా అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో కార్తీక్ వారణాసి దగ్గరికి వచ్చి, వారణాసి నువ్వు నా కోసం దీప కోసం చాలా చేశావు దీప బాగోగులు ఈ పదేళ్లు చూసుకున్నావు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!