MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: డాక్టర్ బాబుని కలిసిన వంటలక్క.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన దీప!

Karthika Deepam: డాక్టర్ బాబుని కలిసిన వంటలక్క.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన దీప!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 22వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Aug 22 2022, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప, కార్తీక్ ఫోటో పట్టుకొని అందరినీ అడుగుతూ ఉంటుంది.అప్పుడు శివ దగ్గరికి వచ్చి ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసావా? అని అడగగా లేదు అని చెప్తాడు శివ. బయటకు వెళ్లి మిగిలిన వాళ్ళని అడుగుతుంది దీప.ఈ లోగ శివ, కార్తీక్ నీ వెంటనే కారులోకి కంగారుగా ఎక్కించేస్తాడు. ఎందుకయ్యా నన్ను ఇంత త్వరగా తీసుకెళ్లి పోతున్నావు అని కార్తీక్ అడగగా మేడం రమ్మంటున్నారు సార్ అని తీసుకువెళ్లిపోతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ లోగా దీప అక్కడ ఒకతన్ని ఈ ఫోటోలో ఉన్న వారిని చూసావా అని అడగగా ఇప్పుడు వరకు లోపలే జ్యూస్ తాగారు అని అంటాడు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కార్తీక్ ఉండడు. కానీ అక్కడ చుట్టుపక్కన ఉన్నవాళ్లు ఈ ఫోటోలో ఉన్న అతను ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు దీప  ఇంత దగ్గరగా తీసుకొచ్చి మళ్ళీ దూరం చేసేసావ్ ఎందుకు దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది.ఆ తర్వాత సీన్లో ఇంద్రుడు, చంద్రుడు శౌర్య దగ్గరికి వచ్చి బయలుదేరుదా? అని అంటారు.
 

37

ఎక్కడికి అని శౌర్య అడగగా సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాము అని అంటారు. నాకు రావాలని లేదు అని సౌర్య అంటుంది.దానికి వాళ్లు ఏది ఏమైనా శుక్రవారం సెకండ్ షో సినిమాకి వెళ్లకపోతే మాకు ముద్ద దిగదు బంగారం అని అంటారు. ప్రతిదానికి వద్దు అంటే వీళ్ళు బాధపడతారు, ఇష్టం లేకపోయినా వెళ్లాలి అని శౌర్య మనసులో అనుకొని సరే వెళ్దాము అని అంటుంది. ఆరోజు రాత్రి దీప బయట కూరగాయలు కొంటూ ఉంటుంది. అదే సమయంలో వెనకాతల సౌర్య, ఇంద్రుడు, చంద్రుడు తో బట్టల షాప్ దగ్గరికి వెళ్తుంది.
 

47

సౌర్య వెనకాతల కార్తీక్, శివ ఇద్దరూ నడుచుకుంటూ వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని శివ అడగగా ఇక్కడ బిర్యానీ బాగుంటుందటయ్యా. మీ మేడంకి చెప్తే బిర్యానీ వద్దు ఇంట్లో కూర్చుండి అని అంటుంది. అందుకే చెప్పకుండా వచ్చాను అని శివని లాక్కొని తీసుకెళ్తాడు కార్తీక్. అదే సమయంలో దీప, కార్తీక్ ని చూస్తుంది. డాక్టర్ బాబు! డాక్టర్ బాబు! అనుకొని ఎంతో ఆశతో కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కానీ కార్తీక్ ఎవరు మీరు? ఎవరో తప్పుగా అనుకోని ఉండుంటారు అని అంటాడు.
 

57

అప్పుడు దీప, నేను దీప ని, మీ వంటలు అక్కని నన్ను మర్చిపోయారా అని అడగగా మీరు ఎవరో అనుకోని నాతో మాట్లాడుతున్నారండి అని అంటాడు కార్తీక్.ఇంతట్లో పక్కన ఉన్న శివ పిచిదై ఉంటాది లెండి సార్ అని అంటాడు.అప్పుడు దీప శివని చూసి సాయంత్రం ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకు తెలుసా అంటే తెలీదు అని అన్నారు అంటే ఇక్కడ ఏదో   తప్పు జరుగుతుంది. అసలేం జరుగుతుంది నా భర్తను ఏం చేస్తున్నారు అని అనగా శివ, పిచ్చోళ్ళు సార్ డబ్బులు కోసం ఈమధ్య ఇలాంటి ఒక కొత్త నాటకం మొదలుపెట్టారు అని చెప్పి కార్తీక్ నుంచి తీసుకెళ్లిపోతాడు.
 

67

అప్పుడు దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత సీన్లో దీప తిరిగి ఇంటికి వచ్చి తనకు వైద్యం చేసిన డాక్టర్ తో, అన్నయ్య ఇందాక డాక్టర్ బాబును చూసాను కానీ అతను నన్ను గుర్తు పట్టట్లేదు అంటూ ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ నువ్వు చూసింది కచ్చితంగా కార్తీక్ నేనా? అని అడుగుతాడు.  నా భర్త మొఖం నాకు తెలియదా? మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అలాగని డాక్టర్ బాబు  కాదనుకుందాము, మరి ఆ పక్కనున్న అతను ఎందుకు మధ్యాహ్నం అయన ఫోటో ఇస్తే తెలీదు అని చెప్పారు.
 

77

అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది అని అంటుంది. అప్పుడు డాక్టర్, ఇక్కడే ఉన్నాము కదా కనిపెడదాము అని అంటాడు. ఇంతట్లో దీప క్యాలెండర్ చూడగా ఆగస్టు 22 అని ఉంటుంది. అప్పుడు దీప ఏడుస్తూ తన పెళ్లి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని డాక్టర్ అడగగా ఈరోజు మా పెళ్లి రోజు అన్నయ్య అని చెప్పి అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నేను అంటే కూడా ఎవరో తెలీదు అన్న స్థితిలోకి వచ్చేసారు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image2
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image3
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved