MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఆనంద్ రావ్, సౌందర్యలను చూసిన వంటలక్క.. అప్పు తీర్చాకే వాళ్ళని కలుస్తాం అంటూ?

Karthika Deepam: ఆనంద్ రావ్, సౌందర్యలను చూసిన వంటలక్క.. అప్పు తీర్చాకే వాళ్ళని కలుస్తాం అంటూ?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 19 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రకృతి వైద్యశాలలో సౌందర్య (Soundarya).. రుద్రాణిని కొట్టిన విషయం తెలుసుకున్న దీప (Deepa) ప్రకృతి వైద్యశాల కు వెళుతుంది. మనశ్శాంతి కోసం వచ్చిన ఆమె ఎవరో కానీ రుద్రాణిని కొట్టిందంటే ఆమెను చూడాల్సిందే అని అక్కడ వాళ్ళని అడిగి లోపలికి వెళ్తుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఇక అక్కడ లోపల చూసేసరికి సౌందర్య (Soundarya), ఆనందరావు (AnandRao) కనిపించడంతో వెంటనే కంటనీరు పెడుతుంది. అత్తయ్య, మామయ్య గారు ఇక్కడున్నారు ఏంటి.. వీరికి ఏం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు. అసలు ఎప్పుడు వచ్చారు అనుకోని బాధపడుతుంది.
 

39

అంటే రుద్రాణిని (Rudrani) కొట్టింది అత్తయ్య నేమో అని అసలు ఎందుకు కొట్టింది.. వారి మధ్య ఏం జరిగింది అని తెగ ఆలోచనలో పడుతుంది దీప (Deepa). వారు ఈ పరిస్థితికి రావడానికి ఏం జరిగిందో అని బాగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

49

మరోవైపు రుద్రాణి (Rudrani) చెట్లకు నీళ్లు పోస్తూ ఉండగా వస్తున్న కార్తీక్ ను గమనించి కూర్చుంటుంది. కార్తీక్ వచ్చి రుద్రాణిని ఎంత పిలిచినా పలకకుండా తన మనుషులతో మాట్లాడుతూ ఉంటుంది. కార్తీక్ (Karthik) కోపంతో అరుస్తూ నా పిల్లలకు భోజనం ఎందుకు పంపిస్తున్నావు అని తనపై గట్టిగా అరుస్తాడు.
 

59

రుద్రాణి (Rudrani) కూడా కార్తీక్ (Karthik) మాటలకు తనదైన శైలిలో సమాధానం చెబుతూ తన మాటలతో బాగా రెచ్చిపోతుంది. అదే సమయంలో టైలర్ రావడంతో ఆమె దగ్గర ఉన్న బట్టలు తీసుకొని పిల్లల కోసమే కుట్టించానని అంటుంది. 
 

69

దానికి కార్తీక్ (Karthik) షాక్ అవుతాడు. నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు బట్టలు కుట్టించానని అంటుంది. వెంటనే కార్తీక్ ఎందుకు నా పిల్లలు జోలికి వస్తున్నావు అని గట్టిగానే వాదిస్తాడు. రుద్రాణి (Rudrani) మళ్లీ అప్పు గురించి టాపిక్ తీస్తూ కార్తీక్ ను బెదిరిస్తుంది.
 

79

దీప (Deepa) దారిన వస్తూ అత్తయ్య, మామయ్య వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఎవరికి ఏం జరిగిందని అనుకుంటుంది. ఈ విషయం డాక్టర్ బాబు (Doctor Babu) కు చెబితే ఊర్లో ఉండి కూడా చూడలేని పరిస్థితి అని బాధ పడతాడేమో అప్పు తీర్చాకే అసలు విషయం చెబుతానని అనుకుంటుంది.
 

89

మరోవైపు కార్తీక్ (Karthik) కూడా అదే విషయాన్ని తలుచుకుంటూ దీపకి చెప్పాలా వద్దా అని.. చెప్పకుండా ఉండటమే మంచిది అని అనుకుంటాడు. ఇక ఆశ్రమం లో సౌందర్య (Soundarya) వాళ్ళ దగ్గరికి అందులో ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెబుతోంది.
 

99

మరోవైపు మోనిత (Monitha) చేష్టలను చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది. ఇక కార్తీక్ ఇంటికి రాగానే పిల్లలు బయటికి వెళ్దామా అంటారు. కార్తీక్ (Karthik) అమ్మానాన్న విషయం గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు వద్దని అక్కడి నుంచి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved