దీప కోసం సౌందర్య.. అందరూ మారిపోయారంటూ బాధతో కుమిలిపోతున్న వంటలక్క?
బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ప్రేక్షకులకే కాకుండా సెలబ్రెటీలకు కూడా అలవాటుగా మారింది. అంతేకాకుండా ఈ సీరియల్ మొదటి రేటింగ్ లోనే దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

దోష నివారణ కోసం భారతి మోనిత (Monitha) దగ్గరికి వెళ్లి సౌందర్య చెప్పిందని చెప్పినా కూడా వినకుండా ఓవర్ గా ప్రవర్తిస్తుంది. దీంతో ఈ విషయాన్ని భారతి సౌందర్యతో చెప్పటంతో సౌందర్య రాత్రి సమయంలోనే మోనిత ఇంటికి బయలు దేరుతుంది. ఇక దీప (Deepa) సౌందర్య భారతితో ఫోన్ లో మాట్లాడిన మాటలు విని ఎక్కడికి అని ఆలోచిస్తుంది.
అత్తయ్య గారు మారారు అంటూ ఇంతకు ముందులా అసలు లేరు అని తను కూడా దూరం పెడుతుందని బాధ పడుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తుందని ఇంతకుముందే దేవుడి గదిని శుభ్రం చేయాలని అనుకుంది. మళ్లీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తుందని అబద్ధాలు చెబుతున్నారని అనుకుంటుంది దీప (Deepa)
సౌందర్య (Soundarya) మోనిత వాళ్ల ఇంటికి కారులో బయలుదేరుతూ ఇదంతా దీప కోసం అని చేస్తున్నాను అనుకుంటుంది. ఎందుకు ఇలా చేసావు కార్తీక్ (Karthik) అంటూ బాధపడుతుంది. కుటుంబం కోసం ఒక మెట్టు కాదు రెండు మెట్లు కూడా దిగుతానని.. ఇప్పుడు మోనిత దగ్గరికి వెళ్లి ఎలా అడగాలి అని ఇబ్బంది పడుతుంది.
దీప (Deepa) ఆలోచిస్తూ ఉండగా సౌర్య వచ్చి తీసుకెళ్తుంది. గదిలో హిమ తన తండ్రితో సరదాగా మాట్లాడుతుంది. అక్కడికి సౌర్య, దీప రావటంతో కార్తీక్ (Karthik) దీపని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఏమి మాట్లాడ లేక మనసులో అనుకోని కుమిలిపోతాడు. దీప కూడా మౌనంగానే ఉండిపోతుంది.
మరోవైపు సౌందర్య (Soundarya) మోనిత వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ప్రియమణి ఉండటంతో ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీపమ్మనే వెళ్లిపోమన్నది అనేసరికి మోనిత (Monitha) వచ్చి ప్రియమణిని లోపలికి పంపిస్తుంది. ప్రియమణి లోపలికి వెళ్లి వాళ్ళ మాటలను వింటుంది.
ఇక సౌందర్య దోష నివారణ పూజ గురించి మోనితతో మాట్లాడుతుంది. ఒక మెట్టు దిగి వచ్చాను అని పొగరు చూపించకని మోనితపై (Monitha) ఫైర్ అవుతుంది. మోనిత మాత్రం ఓవర్ గా ప్రవర్తిస్తుంది. సౌందర్య గట్టిగా క్లాస్ పీకి రేపు పూజకు రమ్మని చెప్పి వెళ్లిపోతుంది. ప్రియమణి వచ్చి మోనితను అడిగేసరికి భారతి (Bharathi) కి ఫోన్ చేసి రేపు పూజకు వస్తున్నానని అంటుంది.
ఇంట్లో పిల్లల దగ్గర ముచ్చట్ల పెట్టకుండా దీప (Deepa), కార్తీక్ (Karthik) ఒకరొకరు ముఖాలు చూసుకుంటూ తమ గతాలను తలుచుకుంటారు. పిల్లలు తమ అమ్మ నాన్నలను తమ మొదటి పరిచయాల గురించి అడిగేసరికి తమ జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతారు.