సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్న ప్రభాస్ హీరోయిన్, సినిమాలను ఎందుకు వదిలేసిందంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కొంత మంది ఇది గ్రహించి మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క సారి ఛాన్స్ వస్తే చాలు.. టాలెంట్ చూపించి టాప్ హీరోయిన్ అవ్వడం పెద్ద విషయం కాదు. కాకపోతే కొంత మందికి కాస్త టైమ్ తీసుకుంటే.. మరికొంత మంది మాత్రం చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు. కాని వారు కెరీర్ ను అలాగే కంటీన్యూ చేయగలరా అనేది వారి ప్లానింగ్ ను బట్టి ఉంటుంది. కొంత మంది స్టార్ డమ్ వచ్చినా కాని.. మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి ఇతర రంగాలలో సెటిల్ అయిన వారు ఉన్నారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హీరోయిన్ తెలుగులో తక్కువ సినిమాలే చేసింది అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీతోనే యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసిన ఈ హీరోయిన్ కొన్ని సినిమాలు చేసిన తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యింది.
వరుస అవకాశాలు వస్తున్న టైమ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుకుంటే.. సడెన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ? ఆమె ఎవరో కాదు దీక్షా సేత్. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కనిపించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడిగా వేదం సినిమాలో రిచ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అందం, అభినయంతో జనాలను కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ సరనస వాంటెడ్ సినిమాలో మెరిసిన దీక్షాసేత్, మాస్ మహారాజ్ రవితేజ సరసన నిప్పు, మిరపకాయ సినిమాల్లో కనిపించింది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. ఇక సక్సెస్ రేటు లేకపోవడంతో ఈ హీరోయిన్ కు అవకావాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఒక దశలో అసలు దీక్షాకు ఆఫర్లు లేకపోవడంతో ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు.
చివరగా 2012లో ఊ కొడతార ఉలిక్కిపడతారా సినిమాలో నటించింది దీక్షా సేత్. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి సినిమాల్లో నటించింది. కానీ అక్కడ కూడా అంతగా కలిసిరాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఐటీ జాబ్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.