MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • `డిడి నెక్స్ట్ లెవెల్` మూవీ రివ్యూ.. సంతానం నవ్వించాడా?

`డిడి నెక్స్ట్ లెవెల్` మూవీ రివ్యూ.. సంతానం నవ్వించాడా?

ఆర్యా నిర్మాణంలో ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో సంతానం హీరోగా నటించిన `డిడి నెక్స్ట్ లెవెల్` సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డిడి నెక్స్ట్ లెవెల్ సినిమా రివ్యూ

డిడి నెక్స్ట్ లెవెల్ సినిమా రివ్యూ

ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో సంతానం, గౌతమ్ మీనన్, యాషిక, కస్తూరి, సెల్వరాఘవన్ నటించిన `డిడి నెక్స్ట్ లెవెల్` సినిమా గ్రాండ్ గా విడుదలైంది. `డిడి రిటర్న్స్` సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని ఆర్యా నిర్మించారు. ఆఫ్రో సంగీతం అందించారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డిడి నెక్స్ట్ లెవెల్ కథ

డిడి నెక్స్ట్ లెవెల్ కథ

కథః 

కిస్సా అనే పాత్రలో సినిమా విమర్శకుడిగా నటించారు సంతానం. చాలా సినిమాలకి ఆయన నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. దాంతో మీకోసం స్పెషల్ షో వేస్తున్నాం థియేటర్ కి రండి అని ఫోన్ వస్తుంది. ఆహ్వానాన్ని అంగీకరించి సినిమా చూడటానికి వెళ్తాడు సంతానం. అక్కడికి వెళ్ళాక అది దెయ్యాలున్న థియేటర్ అని తెలుస్తుంది. ఆ థియేటర్ లోకి వెళ్తే బయటకు రాలేం. అంతలా దెయ్యాలు అడ్డుకుంటాయి.

అక్కడ ఒక దెయ్యం సినిమా నడుస్తుంది. ఆ దెయ్యం సినిమాలో చిక్కుకుపోతాడు సంతానం. ఆ దెయ్యాల నుండి తప్పించుకుంటేనే సంతానం బ్రతకగలడు అనే కండిషన్ ని థియేటర్ ని ఏలే దెయ్యాలు పెడతాయి. తెరపై నడిచే సినిమాలో దెయ్యాలకి చిక్కిన సంతానం బయటపడ్డాడా లేదా అనేది మిగతా కథ.

Related Articles

Related image1
డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?
Related image2
ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?
35
డిడి నెక్స్ట్ లెవెల్ రివ్యూ

డిడి నెక్స్ట్ లెవెల్ రివ్యూ

విశ్లేషణః 

సినిమా లోపల ఇంకో సినిమాని పెట్టి కథని విభిన్నంగా రాసుకున్నారు దర్శకుడు ప్రేమ్ ఆనంద్. చాలా సంక్లిష్టమైన కథని తెరపై అర్థమయ్యేలా చూపించారు. ఈ కథలో సంతానం తన టైమింగ్ కామెడీతో చాలా చోట్ల నవ్వించాడు. రెగ్యులర్ సంతానంలా కాకుండా కిస్సా పాత్రలో తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ విభిన్నంగా చూపించారు.

సినిమాలో సంతానం సినిమా విమర్శకుడిగా నటించినా, ఆయన ఏ సినిమానీ రివ్యూ చేసే సీన్ లేకపోవడం ఆ పాత్రకి బలం చేకూర్చలేదు. కొన్ని చెత్త సినిమాలని తీసుకుని రివ్యూ చేసి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటేనే దెయ్యం వెంటపడుతుందని నమ్మేలా ఉండేది. యూట్యూబ్ రివ్యూయర్లని ట్రోల్ చేసే అవకాశం ఉన్నా, దాన్ని వాడుకోలేదు.

45
డిడి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంది?

డిడి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంది?

నటీనటులుః

ఎలుక కామెడీ, టాయిలెట్ కామెడీ, చెంబు కామెడీ ఇలా మొట్ట రాజేంద్రన్, నిజల్గళ్ రవి, వంటి వారికి సిగ్నేచర్ కామెడీ సీన్స్ పెట్టి కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు. ఇందులో హైలైట్ గౌతమ్ మీనన్ - యాషిక లవ్ కామెడీ. వీళ్ళందరితో పాటు సంతానం కూడా తన వంతు కామెడీ చేశారు. సెల్వరాఘవన్ హిచ్ కాక్ ఇరుదయరాజ్ అనే దెయ్యంగా వచ్చి సంతానంని భయపెడతారు. యాషిక, కస్తూరి పోటీపడి గ్లామర్ చూపించారు.

55

టెక్నీకల్‌గాః 

ఆఫ్రో మ్యూజిక్ ఓకే. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు ప్రేమ్ ఆనంద్ క్లిష్టమైన కథని కామెడీతో నింపి నవ్వుల పుట్టించారు. డిడి రిటర్న్స్ అంత కామెడీ లేకపోవడం కాస్త మైనస్. 

ఫైనల్‌గాః ఓవరాల్గా మూవీ టైమ్‌ పాస్‌ నవ్వుల కోసం చూడొచ్చు. కానీ `డీడీ రిటర్న్స్`ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మించి ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆశించి థియేటర్‌కి వెళితే మాత్రం నిరాశ తప్పదు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Related Stories
Recommended image1
డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?
Recommended image2
ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved