MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన కెరీర్‌ నాశనం కావడానికి గల కారణం బయటపెట్టిన అమీషా పటేల్‌.. అప్పట్నుంచి మగాళ్లకి దూరంగా ఉంటున్నా అంటూ షాక్‌

తన కెరీర్‌ నాశనం కావడానికి గల కారణం బయటపెట్టిన అమీషా పటేల్‌.. అప్పట్నుంచి మగాళ్లకి దూరంగా ఉంటున్నా అంటూ షాక్‌

తన కెరీర్‌ నాశనం కావడానికి గల కారణం బయటపెట్టిన అమీషా పటేల్‌. ఆ దర్శకుడి వల్లే తన సినిమా కెరీర్‌ నాశం అయ్యిందని చెప్పింది. దీంతో  అప్పట్నుంచి మగాళ్లకి దూరంగా ఉంటున్నా అంటూ షాకిచ్చింది.

2 Min read
Aithagoni Raju
Published : Jul 04 2023, 03:26 PM IST| Updated : Jul 04 2023, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అమీషా పటేల్‌.. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసి ఆకట్టుకుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని షేక్‌ చేసింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో సక్సెస్‌ కాలేకపోయింది.  తెలుగులో బాలయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, మహేష్‌ వంటి బిగ్‌ స్టార్స్ తో చేసింది. ఆమె నటించిన చిత్రాల్లో `బద్రి` హిట్‌ కాగా, `నాని`, `నరసింహుడు`, `పరమవీరచక్ర` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో బాలీవుడ్‌కి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు సినిమాలు అడపాదడపా సినిమాల్లో మెరుస్తుందీ ముదురు భామ. 

26

ఐదు పదుల వయసులోనూ ఇంకా పెళ్లి చేసుకోని ఈ సీనియర్‌ హీరోయిన్‌ తాజాగా బాలీవుడ్‌ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతని కారణంగానే తన జీవితం నాశనం అయ్యిందని పేర్కొంది. బాలీవుడ్‌ దర్శక, నిర్మాత విక్రమ్‌ భట్‌తో తన రిలేషన్‌షిప్‌ గురించి గతంలో బహిరంగంగా మాట్లాడటం వల్ల తన కెరీర్‌ దెబ్బతిన్నదని చెప్పింది. 
 

36

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది అమీషా పటేల్‌. ఆమె చెబుతూ, విక్రమ్‌ భట్‌తో రిలేషన్‌ షిప్‌ వల్ల సినిమా కెరీర్‌ నాశనం అయ్యిందని, దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగానే ఉంటూ వస్తున్నానని చెప్పింది. చిత్ర పరిశ్రమలో నిజాయితీకి విలువ లేదని, తాను ఎంతో నిజాయితీగా ఉన్నానని, కానీ తాను ఎవరినైతే హృదయానికి దగ్గరకు చేర్చుకున్నానో అదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అయ్యిందని చెప్పింది. ఓ రకంగా అది పెద్ద గుణపాఠంగా భావిస్తున్నట్టు చెప్పింది అమీషా పటేల్‌. 
 

46

పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం వల్లే నా కెరీర్‌ దెబ్బతిన్నది. దీని వల్ల 13ఏల్ల వరకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదని, దీని కారణంగా తన జీవితంలోకి మరో పురుషుడికి చోటు ఇవ్వలేదని, శాంతి మాత్రమే తనతో ఉందని, తన జీవితంలోకి ఇంకేమీ అక్కర్లేదని పేర్కొంది అమీషా పటేల్‌. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించే టైమ్‌లో దర్శక, నిర్మాత విక్రమ్‌ భట్‌తో డేటింగ్‌ చేసింది. విక్రమ్‌ భట్‌ రూపొందించిన `ఆప్‌ ముజే అచ్చే లగ్నే లగే` చిత్రంలో అమీషా పటేల్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుంచి ఈ ఇద్దరు ప్రేమలో పడి చాలా కాలం డేటింగ్‌ చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం అమీషా పటేల్‌ ఇంట్లో ఏర్పడి గొడవలు, విక్రమ్‌ భట్‌తో ఏర్పడిన మిస్‌ అండర్‌స్టాండింగ్స్.. ఇలా కారణమేదైనా ఈ ఇద్దరు విడిపోయారు. 
 

56

అనంతరం అమీషా పటేల్‌ సినిమాలు కూడా తగ్గిపోయాయి. ఏడాదికి ఒకటి అర సినిమాలు చేస్తూ, ఐటెమ్స్ లోనూ నటిస్తూ కెరీర్‌ని లాక్కొచ్చింది. అంతకు ముందు స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న అమీషా.. క్రేజ్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఓ వైపు ఇంట్లో ఇబ్బందులు, మరోవైపు సినిమాలు లేకపోవడంతో అమీషా పటేల్‌ కెరీర్‌ స్ట్రగులింగ్‌లో సాగింది. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె సన్నీ డియోల్‌తో కలిసి `గదర్‌ 2`లో నటించింది. 1971 ఇండో పాక్‌ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందు ఇలా గతాన్ని గుర్తు చేసుకుటూ ఎమోషల్‌ అయ్యింది. 
 

66

ఇటీవల ఆమె చెక్‌ బౌన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యింది. ప్రముఖ నిర్మాత, బిజినెస్‌ మ్యాన్‌ అజయ్ కుమార్ వద్ద  ఓ ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా రూ2.5కోట్లు అమీషా పటేల్‌ తీసుకున్నారు. ఆ సినిమా చేయకపోగా అమీషా పటేల్ ఆయనకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఒకసారి చెక్ జారీ చేసింది. అది కాస్తా బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ ఆమెపై కేసు పెట్టారు. ఈ కేసులో రాంచీ సివిల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో చేసేది లేక ఆమె కోర్టులో లొంగిపోయారు. ఇటీవల ఇది పెద్ద చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
Recommended image2
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Recommended image3
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved