MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Dasari Narayana Rao: అప్పట్లో అరటిపళ్లు అమ్మేవాడిని.! ఆకలిని చూశా.. పేదరికాన్ని జయించా..

Dasari Narayana Rao: అప్పట్లో అరటిపళ్లు అమ్మేవాడిని.! ఆకలిని చూశా.. పేదరికాన్ని జయించా..

Dasari Narayana Rao: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'దర్శకరత్న'గా నీరాజనాలు అందుకున్న దాసరి నారాయణరావు ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి, ఆకలిని చవిచూసి, చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఆయన ఎలా ఎదిగారో..

2 Min read
Author : Pavithra D
Published : Apr 21 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేదరికం నుండి పాఠశాల వరకు
Image Credit : Pinterest

పేదరికం నుండి పాఠశాల వరకు

దాసరి చాలా పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి చేసే పొగాకు వ్యాపారం అగ్నిప్రమాదం వల్ల దెబ్బతినడంతో ఆర్థికంగా చితికిపోయారు. చదువు మాన్పించి ఆరో తరగతిలోనే ఆయనను వడ్రంగి పనికి పంపారు. అయితే, ఆయన ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల సహాయంతో మళ్ళీ బడిలో చేర్పించారు. స్కూలు ఫీజుల కోసం సెలవు రోజుల్లో కావిడిపై అరటిపళ్ళు అమ్ముతూ తన చదువును కొనసాగించిన పట్టుదల ఆయనది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రంగస్థలం నుండి వెండితెర వరకు
Image Credit : the indian express

రంగస్థలం నుండి వెండితెర వరకు

ఆయన 10వ ఏటనే నాటక రంగంపై అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే రవీంద్రభారతిలో నాటకాలు వేసేవారు. ఒక నాటకాన్ని చూసి సినిమాల్లో కమెడియన్ వేషం కోసం ఆయనను మద్రాస్ పిలిపించారు. విచిత్రమేమిటంటే, మద్రాస్ లో కాలు పెట్టిన రోజే షూటింగ్ లో పాల్గొని మేకప్ వేసుకున్న అరుదైన రికార్డు ఆయనది. అయితే, ప్రధాన కమెడియన్ గా వెళ్ళిన ఆయనకు అసిస్టెంట్ వేషం ఇచ్చినా, వెనక్కి తగ్గకుండా తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

Related Articles

Related image1
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Related image2
Now Playing
Bandla Gnesh Speech: మనోడు మంచి ప్యాకేజీని ఇచ్చాడు వాడుకోండి | Cinema Releases | Asianet News Telugu
35
అత్యధిక పారితోషికం అందుకున్న టెక్నీషియన్
Image Credit : google

అత్యధిక పారితోషికం అందుకున్న టెక్నీషియన్

దర్శకుడిగా మారిన తర్వాత దాసరి గారు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఏకైక టెక్నీషియన్ ఆయనే. ఒక టాప్ హీరో 5 లక్షలు తీసుకుంటే, ఆయన దర్శకుడిగా 6 లక్షలు తీసుకునేవారు. హిందీ ఇండస్ట్రీలో కూడా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించారు. ఎంత సంపాదించినా, ఆస్తుల కంటే విలువలకు, మనుషులకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

45
నిజాయితీకి మారుపేరు.. ఇండస్ట్రీ పెద్ద దిక్కు
Image Credit : google

నిజాయితీకి మారుపేరు.. ఇండస్ట్రీ పెద్ద దిక్కు

సినీ పరిశ్రమలో దాసరి అంటే ఒక టెర్రర్ అనే పేరుంది. దానికి కారణం ఆయన కఠినత్వం కాదు, ఆయన చెప్పే పచ్చి నిజం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి చరిత్ర ఆయనకు తెలుసు. ఎవరైనా తప్పు చేస్తే ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ముఖ్యంగా చిన్న సినిమాల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎప్పుడూ ముందుండి పోరాడేవారు. ఆ నిబద్ధతే ఆయనను చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మార్చింది.

55
నేటి తరం యువతకు..
Image Credit : our own

నేటి తరం యువతకు..

"ఉన్నంత కాలం రాజులా బతుకుదాం.. చేతనైనంత సహాయం చేద్దాం" అనే సిద్ధాంతాన్ని దాసరి తుచా తప్పకుండా పాటించారు. ఆయన జీవితం నేటి తరం యువతకు, ముఖ్యంగా ఎంతో మంది సినీ ఔత్సాహికులకు ఒక గొప్ప పాఠం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Recommended image2
Now Playing
Bandla Gnesh Speech: మనోడు మంచి ప్యాకేజీని ఇచ్చాడు వాడుకోండి | Cinema Releases | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved