బిగ్ షాక్.. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా అన్ని ఏర్పాట్లు పూర్తి, కానీ
జనవరి 9న అంటే గురువారం రోజు ఈవెంట్ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. చీఫ్ గెస్ట్ గా నారా లోకేష్ హాజరు కానున్నారు. కానీ ఇంతలో ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. ఉన్నపళంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది.
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం జనవరి 12న రిలీజ్ అవుతోంది. నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ బాబీ గ్రాండ్ గా ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశారు. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మరిన్ని ప్రచార కార్యక్రామాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
జనవరి 9న అంటే గురువారం రోజు ఈవెంట్ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. చీఫ్ గెస్ట్ గా నారా లోకేష్ హాజరు కానున్నారు. కానీ ఇంతలో ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. ఉన్నపళంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఏర్పాట్లు పూర్తయ్యాక ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు మరణించారు. కొందరు గాయాలపాలయ్యారు.
వైకుంఠద్వార దర్శనం టోకెన్స్ జారీ చేసే కేంద్రం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఇలాంటి విషాదకర పరిస్థితిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సరికాదు అని డాకు మహారాజ్ చిత్ర యూనిట్ భావించింది. మరణించిన భక్తులకు సంతాపంగా ఈవెంట్ ని రద్దు చేశారు. తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మమ్మల్ని ఎంతగానో బాధించింది. హృదయాన్ని కలిచివేసే సంఘటన ఇది.
తప్పని పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం. అభిమానులు అర్థం చేసుకోవాలి అంటూ ప్రకటన విడుదల చేశారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ చిత్రంలో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. జంగిల్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.