డాకు మహారాజ్ కి ఆదిత్య 369 తో లింక్.. బాలయ్య మామూలోడు కాదుగా
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బాలయ్య ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు డాకు మహారాజ్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ మొదలు పెట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ అయింది. సంక్రాంతి చిత్రాల్లో నెక్స్ట్ రాబోయే మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న అంటే ఆదివారం రోజు రిలీజ్ అవుతోంది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బాలయ్య ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు డాకు మహారాజ్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ మొదలు పెట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనితో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి, రిలీజ్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
డాకు మహారాజ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ అదే రోజు తిరుపతిలో వైకుంఠ ద్వారం దర్శన టికెట్స్ జారీ చేస్తుండగా తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి విషాదకర పరిస్థితుల్లో ఈవెంట్ నిర్వహించడం సరైనది కాదు అని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసింది. శుక్రవారం రోజు హైదరాబాద్ లో సింపుల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు డాకు మహారాజ్ చిత్రంపై ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. డాకు మహారాజ్ కథ మొదలు కావడానికి మూలకారణం తానే అని బాలయ్య తెలిపారు. ఒకప్పుడు బాలయ్య అంటే.. డైరెక్టర్లు చెప్పినట్లు చేసే క్రమశిక్షణ కలిగిన హీరో అని చాలా మంది ప్రశంసలు కురిపించేవారు. కానీ ఇటీవల బాలయ్య కూడా కథల ఎంపిక విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. భగవంత్ కేసరి చిత్రంలో పోలీస్ పాత్ర పెట్టమని తానే దర్శకుడికి సూచించినట్లు బాలయ్య తెలిపారు.
ఇక డాకు మహారాజ్ చిత్ర కథ కథతో డైరెక్టర్ బాబీ తన వద్దకి వచ్చినప్పుడు బాలయ్య కొన్ని మార్పులు సూచించారట. అందులో ముఖ్యమైనది తన గెటప్ అని బాలయ్య తెలిపారు. డాకు మహారాజ్ గా బాలయ్య గుర్రంపై నల్లటి దుస్తులతో తలపాగా ధరించి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తన గెటప్ అలా ఉండాలని బాలయ్యే చెప్పాడట. దానికి ఆదిత్య 369 చిత్రంతో లింక్ ఉందట.
బాలయ్య కెరీర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రంలో ఈ చిత్రంలో బాలకృష్ణ టైం ట్రావెల్ చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళతారు. అక్కడ బాలకృష్ణ సమస్యల్లో చిక్కుకుంటారు. శ్రీకృష్ణ దేవరాయలుగా ఉన్న బాలయ్య.. కృష్ణ కుమార్ ని రక్షించేందుకు మారు వేషంలో వెళతారు. నల్లటి దుస్తులు ధరించి, గుర్రంపై వెళ్లి రక్షిస్తారు. ఆ గెటప్ లో పూర్తి స్థాయి చిత్రం చేయాలనే కోరిక బాలయ్యకి ఎప్పటి నుంచే ఉందట. దీనితో డాకు మహారాజ్ గెటప్ ని అలా సిద్ధం చేయమని డైరెక్టర్ బాబీకి బాలయ్య చెప్పారు. మొత్తంగా బాలయ్య డైరెక్టర్లకు అద్భుతమైన ఐడియాలు ఇస్తూ వరుస హిట్లు కొడుతున్నారు.