‘సలార్’ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్.. మేకర్స్ ఆ తేదీనే ఫైనల్ చేశారంట.!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై తాజాగా బజ్ క్రియేట్ అయ్యింది.

మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తో తన సత్తా చూపించిన ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ ను Salaarలో మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నారు.
ఇఫ్పటికే 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని దర్శక నిర్మాతలు గతంలోనే అప్డేట్ అందించారు. ఈ అప్డేట్ తర్వాత మరో షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో చిత్ర యూనిట్ మరో షెడ్యూల్ ను ప్రారంభించనుందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ మాత్రం ఎక్కడా ఆలస్యం కావడం లేదు. నిర్విరామంగా షూట్ కొనసాగుతుండటంతో త్వరలోనే సినిమా బయటికి రానుందని తెలుస్తోంది.
‘సలార్’ నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందన్నారు. నెలలో పదిహేను రోజుల పాటు ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. దీంతో 2022 ముగిసే వరకు ‘సలార్’ షూటింగ్ పార్ట్ పూర్తి కానుండటం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా చిత్రం రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం పరిస్థితులు అన్నీ బాగుంటే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా పరిస్థితులు, కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ తో కాస్తా ఆలస్యమవుతూ వచ్చింది. తొలుత చెప్పిన డేట్ కంటే.. వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపించింది. కానీ ఏదేమైనా వచ్చే ఏడాది ఏప్రిల్ 14నే ‘సలార్’ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు గట్టిగా వినిపిస్తోంది. ఆ దిశగానే టీం అడుగులు వేస్తోందంట.
ప్రభాస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించారంట. ఒక్కో యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంటున్నారు. ప్రభాస్ కేరీర్ లోనే ‘సలార్’ అసలైన యాక్షన్ ఫిల్మ్ గా నిలవబోతున్నట్టుగా ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. మరోవైపు సలార్ ఫీవర్ అభిమానుల్లో, మార్కెట్ లో రోజురోజుకు పెరుగుతోంది.
ఇక, ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. చివరిగా ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకులను, అభిమానులకు కాస్తా అప్సెట్ చేసిన ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ‘సలార్’నూ పూర్తి చేస్తున్నారు. అటు ‘ప్రాజెక్ట్ కే’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మొత్తం ప్రభాస్ దే అంటున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruthi Haasan) నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రద్ద కపూర్‌తోనూ ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక రవి బస్రూర్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ రూ.200 కోట్లతో చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.