- Home
- Entertainment
- బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు..? మిస్టేక్.. కంటెస్టెంట్స్ గా అయ్యుంటుంది, ఏకిపారేస్తున్న నెటిజెన్స్!
బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు..? మిస్టేక్.. కంటెస్టెంట్స్ గా అయ్యుంటుంది, ఏకిపారేస్తున్న నెటిజెన్స్!
బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ బాధ్యతలు మంచు విష్ణుకు అప్పగించాలని మేకర్స్ ఆలోచనట. ఈ క్రమంలో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే బిగ్ బాస్ వేదికపై మంచు విష్ణును చూడొచ్చనే ఓ వాదన... తెరపైకి వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 6 టోటల్ డిజాస్టర్. ఓపెనింగ్ ఎపిసోడ్ తో మొదలైన పతనం ఫినాలే వరకూ కంటిన్యూ అయ్యింది. ఎలిమినేషన్స్ వివాదాస్పదం అయ్యాయి. కొత్తదనం లేని టాస్క్స్, గేమ్స్ విసిగి పుట్టించాయి. అన్నింటికీ మించి నాగార్జున హోస్ట్ గా ఫెయిల్ అయ్యాడన్న వాదన వినిపించింది.
పక్షపాతంగా సాగిన నాగార్జున హోస్టింగ్ ఎలాంటి కిక్ ఇవ్వలేకపోయిందని ఆడియన్స్ అభిప్రాయం. ఆయన వీకెండ్ సమీక్షలు అవకతవకలుగా ఉండేవి. ప్రేక్షకుల అభిప్రాయానికి ఆయన సమీక్షకు సింక్ అయ్యేది కాదు. పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసిన కంటెస్టెంట్స్ ని ఏమీ అనేవారు కాదు, కొందరివి మాత్రం చిన్న తప్పులను బూతద్దంలో చూస్తూ సీరియస్ వార్నింగ్స్ ఇచ్చేవాడు.
ఇక ఆయన నిర్ణయాలు కంటెస్టెంట్స్ ని బట్టి మారిపోతూ ఉండేవి. బిగ్ బాస్ రూల్స్ పక్కన పెట్టిన గీతూను తిట్టిన నాగార్జున... అదే పని రేవంత్ చేస్తే మెచ్చుకున్నాడు. రాజ్, బాలాదిత్య, ఆదిరెడ్డిల విషయంలో నాగార్జున కటువుగా ఉండేవారు. ముఖ్యంగా బాలాదిత్య, ఆదిరెడ్డి ఏమాత్రం చిన్నతప్పు చేసినా భారీ క్లాస్ పీకేవాడు.
బిగ్ బాస్ సీజన్ 6... షోపై ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీసింది. ఈ క్రమంలో నాగార్జునకు గుడ్ బై చెప్పేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటి నుండే కొత్త హోస్ట్ కోసం వెతుకుతున్నారు. మేకర్స్ మదిలో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఎన్టీఆర్. సీజన్ 1 హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన ఒప్పుకుంటే కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా కమిట్మెంట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ చేయరు.
Bigg Boss Telugu 6
నెక్స్ట్ రానా, బాలకృష్ణతో పాటు కొందరు పరిశీలనలో ఉన్నారు. అనూహ్యంగా మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలో నిజం ఉండకపోవచ్చని మెజారిటీ వర్గాల అంచనా. ఎలాంటి స్టార్డం లేని మంచు విష్ణుకి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉండదు.
Bigg boss Telugu
మంచు విష్ణుకు ఆసక్తి ఉన్నప్పటికీ మేకర్స్ కన్సిడర్ చేయకపోవచ్చు. స్టార్డం పక్కన పెడితే ఆయనకు అనుభవం లేదు. గొప్ప వ్యాఖ్యాత కూడా కాదు. తెలుగు అంతంత మాత్రమే, కాబట్టి మంచు విష్ణు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు అనే వార్తలో నిజం ఉండకపోవచ్చని పలువురి అభిప్రాయం. ఆయన కంటే మంచు లక్ష్మి చాలా వరకు బెటర్. ఆమెకు హోస్ట్ గా అపార అనుభవం ఉంది. కాబట్టి మంచు లక్ష్మికి అవకాశం ఇస్తే కొంతలో కొంత న్యాయం జరుగుతుంది, అంటున్నారు.
Bigg boss Telugu
ఇక ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్ సెటైర్స్ పేలుస్తున్నారు. మీరు పొరపాటు పడ్డారు. హోస్ట్ గా కాదు కంటెస్టెంట్ గా అయ్యుంటుంది... అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మొత్తంగా తన ప్రమేయం లేకుండా మంచు విష్ణు ట్రోలర్స్ బారినపడ్డారు.