MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆదిపురుష్ పోస్టర్, టీజర్ కాపీ కొట్టారా ? సంచలన ఆరోపణలు చేస్తున్న యానిమేషన్ స్టూడియో

ఆదిపురుష్ పోస్టర్, టీజర్ కాపీ కొట్టారా ? సంచలన ఆరోపణలు చేస్తున్న యానిమేషన్ స్టూడియో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

26

అసలే టీజర్ వర్కౌట్ కాలేదు అనే గందరగోళంలో ఆదిపురుష్ టీం ఉంటే మరో చిక్కు వచ్చి పడింది. టీజర్, పోస్టర్ కాపీ కొట్టారు అంటూ ఓ యానిమేషన్ స్టూడియో సంచలన ఆరోపణలు చేస్తోంది. తమ వర్క్ ని కాపీ చేసారు అంటూ సోషల్ మీడియాలో వానరసేన అనే యానిమేషన్ స్టూడియో ఆరోపించింది. 

36

ఆదిపురుష్ టీజర్ లో ప్రభాస్ రాముడిగా.. లక్ష్మణుడు, హనుమంతుడితో కలసి నడిచి వస్తున్న దృశ్యాన్ని వానర సేన అనే యానిమాషన్ స్టూడియో రూపొందించింది. దానిని ఓం రౌత్ కాపీ కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. 

46

అలాగే ఆదిపురుష్ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టి నిల్చుని ఉండే ఫోజుని కూడా ఆ సంస్థ రూపొందించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియాలో బయట పెట్టింది. మేము ఇప్పుడు గొడవ పెట్టుకునే ఉద్దేశంతో ఈ విషయాలు బయట పెట్టడం లేదు. కానీ మాకు చాలా నిరాశగా ఉంది. 

56

ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ మా కష్టం ఇలా వృధా అవుతోందని తెలియజేయడానికి ఈ సంగతులు బయట పెడుతున్నట్లు పేర్కొన్నారు. 

66

మరి దీనిపై ఆదిపురుష్ టీం, డైరెక్టర్ ఓం రౌత్ ఎలా స్పందిస్తారో చూడాలి. దర్శకుడు ఓం రౌత్ ఈ రకంగా ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ఎవరూ ఊహించలేదు. వింత జంతువులు, అసలు ఏమాత్రం రామాయణానికి రిలవెంట్ గా అనిపించని పాత్రల వేషధారణతో తీవ్ర నిరాశకి గురి చేశాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Recommended image3
Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved