- Home
- Entertainment
- మూర్ఖులే అలాంటి పనిచేస్తారు, బాడీ షేమింగ్ బాధితులపై నటి రచితా రామ్ కామెంట్స్ వైరల్..
మూర్ఖులే అలాంటి పనిచేస్తారు, బాడీ షేమింగ్ బాధితులపై నటి రచితా రామ్ కామెంట్స్ వైరల్..
కూలీ సినిమాలో విలన్‌గా నటించి ఫేమస్ అయిన రచితా రామ్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. బాధితులు ముర్ఖులు అయితేనే ఏం చేయాలో తెలియక తప్పటడుగులు వేస్తారంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

విలన్ గా నటించిన రచితా రామ్..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలో మాస్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు నటి రచితా రామ్. ఆ సినిమాలో విలన్ షోబిన్ షాహిర్ భార్యగా నటించారు. కూలీ సినిమా తర్వాత రచితా రామ్‌కు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో రచితా రామ్ చాలా బిజీగా ఉన్నారు.
ఎవరు ఏమన్నా లెక్క చేయను..
ఆమె నటించిన 'కల్ట్' అనే సినిమా ప్రస్తుతం విడుదలవుతోంది. దాని ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో బాడీ షేమింగ్ గురించి రచితా మాట్లాడారు. తను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని, దాన్ని తెలివిగా హ్యాండిల్ చేశానని చెప్పారు. 'మహిళలు ఎందుకు లావవుతారు? వారి ఆరోగ్య సమస్యలు ఏంటి?' అనే దానిపై మాట్లాడారు. 'ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను' అని రచితా తేల్చేశారు.
ఇతరులను సంతృప్తి పరచలేం
బాడీ షేమింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకునే వాళ్లను 'మూర్ఖులు' అని రచితా రామ్ అన్నారు. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది. పీసీఓడీ, ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారన్నారు. "పీరియడ్స్‌కు ముందు, తర్వాత మహిళల శరీరంలో మార్పులు వస్తాయి. అందేకే అందరికి నచ్చినట్టు ఉండటం సాధ్యం కాదు.. ఈ విషయంలో ఇతరులను సంతృప్తి పరచలేం. ఇది మా జీవితం, మా శరీరం, మా ఇష్టం" అని రచితా రామ్ చెప్పారు.
మూర్ఖులే ఆ పనిచేస్తారు..
మన శరీరాన్ని మనం గౌరవించాలని రచితా రామ్ అన్నారు. "ఇతరులు చెప్పేదానికి ఎందుకు ఒత్తిడికి గురికావాలి? ఎవరి అవసరాలు వారికి తెలుస్తాయి. నిద్ర లాంటి అలవాట్లు కూడా బరువును ప్రభావితం చేస్తాయి" బాడీ షేమింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు మూర్ఖులు. నెగటివ్ కామెంట్స్ ఎందుకు పట్టించుకోవాలి? పాజిటివ్ విషయాలు చాలా ఉన్నాయి" అని రచితా రామ్ చెప్పారు. ఆమె మాటలకు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.

