MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అది నోరా డ్రైనేజా..? బిగ్ బాస్ సోనియా ఆకులపై మండిపడుతున్న నెటిజన్లు

అది నోరా డ్రైనేజా..? బిగ్ బాస్ సోనియా ఆకులపై మండిపడుతున్న నెటిజన్లు

బిగ్ బాస్ లో జరుగుతున్న గొడవలు.. జారుతున్న మాటలలను ఆడియన్స్ గమనిస్తున్నారు. విమర్శిస్తున్నారు కూడా. ఈ విషయంలో ఫైర్ బ్యాండ్ సోనియాకు గడ్డి పెడుతున్నారునెటిజన్లు.   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 10 2024, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్, ఫన్ కన్నా గొడవలు.. ఎక్కువగా అవుతున్నాయి. ఇది వరకు సీజన్స్ లో ఓ వారం గడిచిన తరువాత గొడవలు స్టార్ట్ అయ్యేవి. ముందు అందరు పరిచయాలు పలకరింపులు ఉండేవి. కాని ఈసారి సీజన్ లో ఫస్ట్ డే నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి అవి హద్దు మీరుతున్నాయి కూడా. 

అమరావతి లో ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్, చంద్రబాబు, పవన్ చీఫ్ గెస్ట్ లు, ఫ్యాన్స్ కు పండగే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయ్యి అప్పుడు వారం అవుతుంది. అప్పుడే సెకండ్‌ వీక్‌లోకి షో అడుగుపెట్టింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ మాత్రం అలానే కొనసాగుతోంది. ఇక హౌస్ లో గొడవలు తారాస్థాయికి చేరి.. మాటల తూటాలుపేలుతున్నాయి. మరీ ముఖ్యంగా సోనియా మాటలు మితిమీరుతున్నట్టు అనిపిస్తోంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

38

హౌస్ లో ఏది పడితే అది మాట్లాడటం.. డామినేషన్ చేయడం అనేది ఆడియన్స్ గమణిస్తుంటారు. కాని సోనియా అయితే తన నోటి దురుసుతో దారుణంగా డామినేట్ చేయడంతో పాటు.. అందరిని ఇబ్బందిపెడుతుంది.  కిర్రాక్‌ సీత, విష్ణుప్రియలను నానా మాటలు అంది. ఆమె అన్న మాటలు చాలా దారుణంగా ఉండటంతో ఆడియన్స్ ఆమెపై మండిపడుతున్నారు. 

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ సినిమా ఏదో తెలుసా..? టైటిల్ ఇదే..?
 

48

సోనియా పర్సనల్ అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా  సోనియా వ్యక్తిగత దూషణకు దిగడం చాలా మందికి నచ్చలేదు. మొదటి వారం నామినేషన్ లో ఆమె ఎలా రెచ్చిపోయిందో అందరికి తెలుసా.. ఇక రెండో వారం నామినేషన్‌ ప్రక్రియలో కూడా  ఇంతకంటే ఎక్కువే చేసింది సోనియా. 

58
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ లో  విష్ణుప్రియ ఇద్దరిని ఎంపిక చేసుకుంది. మొదట మణికంఠను నామినేషన్‌ చేసిన విష్ణుప్రియ  ఆ తర్వాత  సోనియాను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలోనే వారిద్దరు తిట్టుకున్నారు. పాపం విష్ణుప్రియ ఏమీ అనలేదు కానీ సోనియానే రెచ్చిపోయింది. చూస్తున్నవాళ్లకు చిరాకుపుట్టేలా ప్రవర్తించింది. 

68
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మరీ దారుణంగా  కంపరం కలిగించే మాటలు మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే.. విష్ణు ప్రియను పట్టుకుని. 'నువ్వు ముందు బట్టలే సరిగ్గా వేసుకోవు.. ఇలాటి డ్రెస్సులేసుకుని పక్కన నిల్చుంటే.. నీ పక్కన ఉన్నవారు ఇబ్బందిపడుతున్నారు.  

నీ వల్ల వారు డిస్‌కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్‌.  అని ఆమెను నోటికి వచ్చినట్టు మాట్లాడింది.

 అంతే కాదు నీ మాటలు, చేతలు  చాలా తేడా ఉన్నాయి'.. హౌజ్‌లో ఇలా ఉండటం కరెక్ట్ కాదు..నువ్వు ఈ హౌస్ కు కరెక్ట్ కాదు అంటూ.. విష్ణుప్రియను పర్సనల్ అటాక్‌ చేసింది. ఇక అంత వరకూ చెప్పి ఆగి ఉంటే బాగుండేది. కాని ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది సోనియా. '

78

నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటా.. నన్ను మాత్రం  అలాంటివి చేయడానికి పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్‌ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ నోటికి ఎంతొస్తే అంత అనేసింది. 
 

88
Sonia Akula

Sonia Akula

ఇక ఇదంతా చూసిన వారు సోనియాను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. సోనియాను దారుణంగా తిడుతున్నారు. ఆమెది నోరా డ్రైనేజా.. సాటి ఆడపిల్లను పట్టుకుని ఇలా అంటుందా.. ఆలోచించకుండా మాట్లాడుతుంది.. సోనియాకు తిక్క ఉందా అంటూ.. ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఆమెను ఇలా ఎలా వదిలేశారు.. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved