MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comrade Kalyan Day 1 Collections: కామ్రేడ్‌ కళ్యాణ్‌కి ఫస్ట్ డే షాకింగ్‌ కలెక్షన్లు.. శ్రీవిష్ణు రచ్చ మామూలుగా లేదుగా

Comrade Kalyan Day 1 Collections: కామ్రేడ్‌ కళ్యాణ్‌కి ఫస్ట్ డే షాకింగ్‌ కలెక్షన్లు.. శ్రీవిష్ణు రచ్చ మామూలుగా లేదుగా

Comrade Kalyan Day 1 Collections: ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచిన శ్రీవిష్ణు తాజాగా `కామ్రేడ్‌ కళ్యాణ్‌` చిత్రంలో నటించాడు. నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రచ్చ చేస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 10 2026, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కామ్రేడ్‌ కళ్యాణ్‌కి మిక్స్డ్ టాక్‌
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్‌ కళ్యాణ్‌కి మిక్స్డ్ టాక్‌

కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రాణిస్తోన్న యంగ్‌ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు `కామ్రేడ్‌ కళ్యాణ్‌` అనే చిత్రంలో హీరోగా నటించాడు. జానకీరామ్‌ మారెళ్ల దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ సమర్పణలో స్కంధ వాహన మోషన్‌ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. ఇందులో మహిమా నంబియర్‌ హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సాయి చంద్‌, శత్రు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని రాణిస్తుందనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కామ్రేడ్‌ కళ్యాణ్‌ కలెక్షన్లు
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్‌ కళ్యాణ్‌ కలెక్షన్లు

`కామ్రేడ్‌ కళ్యాణ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద కూడా మిక్స్ డ్ గానే సందడి చేసింది. శ్రీవిష్ణు గత చిత్రం కంటే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే తన కెరీర్‌లో హైయ్యెస్ట్ తో పోల్చితే డల్‌గానే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.40కోట్ల కలెక్షన్లని సాధించింది. రూ.2.10కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. కోటీ వరకు షేర్‌ వచ్చింది. అయితే శ్రీవిష్ణు గత చిత్రం `మృత్యుంజయ`తో పోల్చితే ఇది బెస్ట్ ఓపెనింగ్ గా చెప్పొచ్చు. ఆ సినిమాకి రెండు కోట్ల లోపే వచ్చాయి. అదే సమయంలో ఆయన హీరోగా వచ్చిన `సింగిల్‌` మూవీ మాత్రం ఏకంగా రూ.4.15కోట్లు, `విష్ణు విన్యాసం` రూ.3.95కోట్లని రాబట్టాయి. వాటితో పోల్చితే ఇది వెనకబడింది.

34
కామ్రేడ్‌ కళ్యాణ్‌ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్‌ కళ్యాణ్‌ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఇక `కామ్రేడ్‌ కళ్యాణ్‌` మూవీ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ చూస్తే, ఈ చిత్రానికి సుమారు రూ.22కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. ప్రమోషన్స్ తో కలుపుకొని. సినిమాకి థియేట్రికల్‌గా అయిన బిజినెస్‌ రూ.11కోట్లు అని సమాచారం. అంటే దాదాపు రూ.22కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. కానీ ఇప్పుడు అందులో కేవలం 10శాతం మాత్రమే వసూలు చేసింది. ఇంకా 90శాతం రావాలి. అలా ఇరవై కోట్ల గ్రాస్‌ రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. శనివారం నుంచి పుంజుకుంటే ఇది పెద్ద లెక్క కాదు, కానీ పుంజుకోలేదంటే కష్టమనే చెప్పాలి. అయితే శనివారం నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు. దీంతో కలెక్షన్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి. ఈ సినిమా ఏం చేసినా ఈ వారంలోనే రాబట్టాలి, మళ్లీ గురువారం నుంచి పెద్ద సినిమాలున్నాయి. థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఐదు రోజులు ఈ సినిమాకి చాలా కీలకం.

44
కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ కథ ఏంటంటే?
Image Credit : X/@KonaFilmCorp

కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ కథ ఏంటంటే?

కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీని లవ్‌స్టోరీకి, నక్సల్స్ కి ముడిపెట్టి రూపొందించారు. హీరో పాత థియేటర్‌ని నడిపిస్తుంటాడు. అందులో ఆర్‌ నారాయణమూర్తి సినిమాలు వేస్తుంటారు. అక్కడ నక్సల్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆయా సినిమాలు బాగా ఆడుతుంటాయి. ఈ క్రమంలో హీరోయిన్‌ పరిచయం అవుతుంది.ఆమెని పడేయాలని ప్లాన్‌ చేస్తాడు. అయితే ఆమెకి ఒక సమస్య ఉంటుంది. అప్పుల వాళ్లు వేధిస్తుంటారు. తన లవర్‌ కోసం తాను అప్పు కడతానని చెప్పి అన్నల్లోకి వెళ్తాడు. డ్రామా రూపంలో వెళ్లి నిజంగానే నక్సల్‌గా మారాల్సి వస్తుంది. దీంతో పోలీసుల హిట్‌ లిస్ట్ లో ఉంటాడు. మరోవైపు వీడు నకిలీ నక్సల్‌ అని అన్నలకు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఎలా నలిగిపోయాడు? ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు, తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడనేది ఈ సినిమా కథ. ఆద్యంతం ఫన్‌ ప్రధానంగా సాగుతుంది.కానీ ఆ ఫన్‌ ఆశించిన స్థాయిలో పండలేదనే ఫీలింగ్‌ ఉంది. ఎమోషన్స్ కూడా లేవనే టాక్‌ వినిపించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh Telugu Collections: హనుమాన్‌ అంశ్‌ తెలుగులో డల్‌ కలెక్షన్లు.. టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?
Recommended image2
Krishna: ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా భయపడిన కృష్ణ..18 పేజీల క్లైమాక్స్ తో దద్దరిల్లిన థియేటర్స్
Recommended image3
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Related Stories
Recommended image1
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image2
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved