MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `పుష్ప 2` మూవీ రివ్యూ, రేటింగ్‌

`పుష్ప 2` మూవీ రివ్యూ, రేటింగ్‌

అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమా విడుదలైంది. ఇది ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

6 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 05 2024, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, ఇండియన్‌ ఆడియెన్స్ సైతం ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా `పుష్ప 2`. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కిది రెండో పార్ట్. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీలా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు నెగటివ్‌ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా నేడు గురువారం(డిసెంబర్‌ 5)న విడుదలైంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. బిజినెస్ కూడా భారీ స్థాయిలో అయ్యింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్మురేపింది. మరి ఇంతటి భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కథః 
పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్‌ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్‌ చేస్తాడు. కట్‌ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో అడ్డులేకుండా ఎదుగుతాడు. సిండికేట్‌ మొత్తం తన కంట్రోల్‌లోకి వస్తుంది. మరోవైపు పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షేకావత్‌(పహద్‌ ఫాజిల్‌) ప్లాన్‌ చేస్తున్నాడు. ఓ కూలి వాడిగా అడవుల్లోకి వెళ్లి అందరిని అరెస్ట్ చేస్తాడు. చితక్కొడతాడు. తన మనషులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో అందరు పోలీసులను కొనేస్తాడు.

పోలీస్ స్టేషన్‌ మొత్తం ఖాళీ. దీంతో రెచ్చిపోయిన షేకావత్‌ ఒక సిండికేట్‌ని చంపేస్తాడు. దీంతో మిగిలిన సిండికేట్లు అంతా భయపడతారు. పుష్ప చేత సారీ చెప్పించాలని ఎంపీ సిద్దప్ప(రావు రమేష్‌) సమక్షంలో సిండికేట్‌ పార్టీ ఏర్పాటు చేయిస్తారు. అందులో పుష్ప బాగా తాగి వచ్చి షేకావత్‌కి సారీ చెబుతాడు. అయితే దాన్ని ఆయన అవమానంగా భావించి మళ్లీ వెళ్లి షేకావత్‌ కారుని ఢీ కొడతాడు.

స్విమ్మింగ్‌ పూల్‌లో టాయిలెట్‌ పోసి అవమానిస్తాడు. అప్పటికే ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌తో భారీ డీల్‌ కుదుర్చుకుంటాడు పుష్ప. రెండువేల టన్నులు ఎర్రచందనం అందించడం ఆ డీల్. భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. దానికోసమే పుష్ప ప్లాన్‌. దాన్ని అడ్డుకోవాలని షేకావత్‌ గట్టి ప్లాన్‌ చేస్తాడు. అయితే అంతకు ముందే సీఎంని కలవడానికి వెళ్లిన పుష్పకి అవమానం జరుగుతుంది. సీఎం ఫోటో ఇచ్చేందుకు వెనకాడతాడు. స్మగ్లర్‌తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని వద్దు అంటాడు. అక్కడ పుష్ప ఈగో దెబ్బతింటుంది.

దీంతో సీఎంనే మార్చేయాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకోసమే భారీగా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఈ డీల్‌ సెట్‌ చేస్తాడు. మరి షేకావత్‌ని దాటుకుని పుష్ప సరుకుని బార్డర్‌ దాటించాడా? సీఎంని మార్చేశాడా? ఈ క్రమంలో సెంట్రల్‌ మినిస్టర్‌, మైనింగ్‌ కింగ్‌ ప్రతాప్‌ రెడ్డితో గొడవేంటి? తనని అవమానించిన ఫ్యామిలీ పుష్ప వద్దకు ఎందుకు వచ్చింది? వారి కోసం పుష్ప ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. 
 

38

విశ్లేషణః 
`పుష్ప` సినిమాలో పుష్పరాజ్‌ కూలీగా ప్రారంభమై చిన్నపాటి సిండికేట్‌ మెంబర్‌గా ఎదుగుతాడు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఎస్పీ షేకావత్‌తో గొడవ పెట్టుకుని ఆయనకు ఛాలెంజ్‌ విసురుతాడు. `పుష్ప 2`లో సింగికేట్‌ని పుష్పరాజ్‌ రూల్‌ చేయడం ప్రధానంగా సాగుతుంది. తనకు అడ్డు వచ్చిన వారిని డబ్బుతో కొనేస్తాడు. చివరికి డబ్బుతోనే సీఎంని కూడా మార్చేసే స్థాయికి ఎదుగుతాడు. నేషనల్‌ దాటి ఇంటర్నేషనల్‌ డీల్స్ సెట్‌ చేస్తుంటాడు. ట్రైలర్‌లో డైలాగ్‌ చెప్పినట్టు ఇంటర్నేషనల్‌ టార్గెట్‌తో ఆయన ముందుకు వెళ్తుంటాడు. క్లుప్తంగా ఇదే కథ.

దీని కోసం పుష్ప ఏం చేశాడనేదే సినిమా. కథగా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. కమర్షియల్‌ ఫార్మాట్‌లో యాక్షన్‌ సినిమాలకు కావాల్సిన ఎలిమెంట్లు గట్టిగా జోడించి, ఎలివేషన్లు, అదిరిపోయే పాటలు, బీజీఎం, ఫైట్లతో సినిమాని నడిపించాడు సుకుమార్‌. మధ్యలో రష్మిక మందన్నాతో రొమాంటిక్ సీన్లు, అందులోనే కామెడీ పెట్టాడు. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషనల్‌ సీన్లని కూడా మధ్య ఒకటి రెండు చోట్ల యాడ్‌ చేసి ఆయా ఆడియెన్స్ ని కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు.

మొత్తంగా మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లు, యాక్షన్‌ సీన్ల గట్టిగా దట్టించి వండిన వంటకం `పుష్ప 2ః ది రూల్‌`. లాజిక్‌లు, కథ ఫ్లోకి సంబంధం లేకుండా ఎలివేషన్ సీన్లు, ఆ తర్వాత కాస్త రొమాన్స్, చిన్న కామెడీ, మళ్లీ యాక్షన్‌ సీన్ ఎలివేషన్‌, షేకావత్‌తో ఛాలెంజ్‌లో, సీఎంతో ఛాలెంజ్‌లు, ఇలా హై ఇచ్చే సీన్లతోనే కథనాన్ని నడిపించాడు సుకుమార్‌. ఎప్పటికప్పుడు మ్యాజిక్‌ చేస్తూ బోర్‌ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. 
 

48

మొదటి భాగంలో ఫస్ట్ ఫైట్‌ బాగుంది. అందులో బాస్‌ ఎవడ్రా మీ అందరికి నేనే బాస్‌ అని చెప్పే డైలాగ్‌ బాగుంది. ఆ తర్వాత గతంలోకి వెళ్తుంది కథ. అయితే అది కలనా, నిజంగా జరిగిందా అనేది క్లారిటీ లేదు. పుష్పని పట్టుకునేందుకు షేకావత్‌ చేసే ప్రయత్నం మొదట్లోనే బాగుంది. ఆ తర్వాత ప్రతి సారి షేకావత్‌ విఫలమవుతుంటాడు. ఆయన ఎత్తులు వేస్తే పై ఎత్తులు వేసి పుష్ప సరుకుని పంపిస్తుంటాడు.

ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని కామెడీగానూ ఉన్నాయి. మరికొన్ని పిచ్చెక్కించేలా ఉన్నాయి. సీఎం అవమానించాడని, సీఎంనే మార్చేయడం ఈ క్రమంలో వచ్చే సీన్లు సినిమాటిక్‌గానే ఉన్నాయి. సహజత్వంగా అనిపించలేదు. ఇలా కమర్షియల్‌ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్ లు పట్టించుకోలేదు. కానీ ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఒక్క హై ఇచ్చే సీన్‌ పెట్టి థియేటర్లలో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించారు.

దానికి తగ్గట్టుగానే పుష్ప రెచ్చిపోయిన తీరు బాగుంది. ఇంటర్వెల్‌ టైమ్‌లో వచ్చే సిండికేట్‌ పార్టీలో షేకావత్‌ కి వార్నింగ్‌, ఛాలెంజ్‌ విసరడం ఆశించిన స్థాయిలో పేలలేదు. ఉన్నంతలో ఓకే అనిపించింది. సెకండాఫ్‌లో జాతర ఎపిసోడ్‌ హైలైట్‌. ఇందులో అమ్మోరుగా వేషం వేసి పుష్ప చేసిన డాన్స్ నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఫైట్‌ సీన్స్ గూస్‌ బంమ్స్ పక్కా. దానికి కొనసాగింపుగానే ఫ్యామిలీ ఎమోషనల్‌ సీన్‌తో పిండేశాడు. ఇందులో రష్మిక పాత్ర సైతం రెచ్చిపోయిన తీరు బాగుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. 
 

58

ఆ తర్వాత పడుతూ లేస్తూ షేకావత్‌ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, సీఎంని మార్చడం వంటి సీన్లతో సాగిపోతుంది. ఇక తన అన్న కూతురుని కిడ్నాప్‌ సందర్బంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్‌ విరోచితంగా ఉంది. పూనకాలు తెప్పించేలా ఉంది. ఎవ్వరికైనా ఆ సీన్లు చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుపు రావడం పక్కా. ఆ రేంజ్‌లో దాన్ని డిజైన్‌ చేశారు. అంతకు ముందు వచ్చే సీన్లు నార్మల్‌గానే సాగుతాయి. సెకండాఫ్‌లో ఈ రెండు ఎపిసోడ్లు హైలైట్‌గా నిలుస్తాయి.

ఇక క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ముగించాడు. ఓవరాల్గా సినిమా ఎపిసోడ్ల వైజ్‌గా బాగుంది. కానీ కథగా ఒక ఫ్లో లేదు. ఇష్టం వచ్చినట్టుగా సీన్లు పెట్టుకుని, పేర్చుకుంటూ పోయినట్టు ఉంటుంది. ఎమోషనల్‌ సీన్లు చాలా బలంగా ఉన్నా, ఆ ఫీల్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. కథనంలో క్లారిటీ లేకపోవడం వల్లే అని చెప్పొచ్చు.

చాలా లాజిక్‌లు కూడా లేవు. కమర్షియల్‌ ఫ్రీడమ్‌ అతిగా తీసుకున్నట్టు ఉంటుంది. అందుకే చాలా సీన్లు అసహజంగా అనిపిస్తాయి. కొన్ని సీన్లు ఇరికించినట్టుగానే ఉంటాయి. స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది. విలన్‌ బలంగా లేకపోవడంతో వార్‌ వన్‌ సైడ్‌ అయిపోతుంది. అది చప్పగా అనిపిస్తుంటుంది. అంతగా కిక్‌ ఇవ్వడు. సెంట్రల్‌ మినిస్టర్‌ ప్రతాప్‌ రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు పరిచయంకే పరిమితమయ్యాయి. డెప్త్ లేదు. మూడో పార్ట్ కి దాచి ఉంచారని అనిపిస్తుంది.

డైలాగ్స్ లోనూ క్లారిటీ లేదు. చాలా డైలాగులు అర్థం కావడం లేదు. అది పెద్ద మైనస్‌. అయితే ఇప్పుడు మాస్‌, యాక్షన్‌ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవాలనే దీన్ని డిజైన్‌ చేశారు. ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇచ్చారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ కి, మాస్‌ ఆడియెన్స్ కి మాత్రం పూనకాలు పక్కా. 

68
Allu Arjun, #Pushpa2, Sukumar

Allu Arjun, #Pushpa2, Sukumar

నటీనటులుః

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమాలోనే పుష్పరాజ్‌గా అదరగొట్టాడు. చిత్తూరు యాసలో, ఒక భుజం పైకెత్తి ఆయన నటనకు విశేష ఆదరణ దక్కంది. ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2లో ఆయన మరోసారి పుష్పరాజ్‌గా దుమ్ములేపాడు. మొదటి భాగం మించి ఆయన రెచ్చిపోయారు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ వంటి వారు ఉన్నా, వాళ్లని డామినేట్‌ చేశాడు.

ఇక జాతర ఎపిసోడ్‌లో అమ్మోరు గెటప్‌లో బన్నీని చూస్తే పూనకాలే అని చెప్పొచ్చు. యాక్షన్స్ లోనూ అదరగొట్టాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. డాన్సులతో ట్రీట్‌ ఇచ్చాడు. శ్రీవల్లిగా రష్మిక మందన్నా సైతం తన బెస్ట్ ఇచ్చింది. సినిమాలో ఆమెది మరో హైలైట్‌ అయ్యే పాత్ర అని చెప్పొచ్చు. అదరగొట్టింది. పాటల్లో బన్నీ, రష్మిక లు బాగా చేశారు. కనువిందు కలిగించారు. `పీలింగ్‌` పాటలో కూడా శ్రీలీలతో రెచ్చిపోయి చేశాడు బన్నీ. షేకావత్‌గా ఫాహద్‌ ఫాజిల్‌ సైతం రచ్చ చేశాడు.

నెగటివ్‌ షేడ్ ఉన్న రోల్‌లో ఆయన పిచ్చెక్కించాడు. అయితే ఆయన పాత్రని డల్‌గా చూపించడం మైనస్‌గా చెప్పొచ్చు. అనసూయ, సునీల్‌ పాత్రలు అలరించేలా ఉన్నాయి. జగపతిబాబు పాత్ర కొత్తగా యాడ్‌ అయ్యింది. సెంట్రల్‌ మినిస్టర్ ప్రతాప్‌ రెడ్డి పాత్రలో ఉన్నంత సేపు హై ఇచ్చాడు. ఆయన కూడా చిత్తూరు యాసలో కొత్త గెటప్‌లో రెచ్చిపోయాడు. రావు రమేష్‌కి మరింత బలమైన పాత్ర పడింది. ఎప్పటికీ గుర్తిండిపోతుంది. కేశవ పాత్రలో జగదీష్‌ మరోసారి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. 

78
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar

టెక్నీషియన్లుః
సినిమాకి మిరోస్లవ్‌ క్యూబా బ్రోజెక్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. విజువల్స్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. బాగా షూట్‌ చేశారు. క్లోజప్‌లు, లాంగ్‌ షాట్ లు బాగున్నాయి. విజువల్స్ గా ట్రీట్‌ అనేలా ఉంది. ఎడిటర్‌ నవీన్‌ నూలి కట్‌ పేస్ట్ లా ఉంది. ఒక లింక్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక పాటలు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన అన్ని పాటలు ఉర్రూతలూగించేలా ఉన్నాయి. పాటలకంటే సౌండింగ్‌, హీరోహీరోయిన్లు డాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.

పాటలకు థియేటర్లలో ఆడియెన్స్ సీట్లలో కూర్చోరంటే అతిశయోక్తి కాదు. చిత్రీకరణ, డాన్స్ కంపోజింగ్‌ కూడా అంతే బాగుంది. ఫైట్‌ సీన్లకి బీజీఎం మోతమోగించారు. రొటీన్‌ కి భిన్నంగానే ఉంది. థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, సామ్‌ సీఎస్‌ బీజీఎంతో అదరగొట్టారు. సినిమాకి అదే పెద్ద బలం. దర్శకుడు సుకుమార్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాడని చెప్పొచ్చు. పుష్ప రాజ్‌ పాత్రని మెయిన్‌గా తీసుకుని కథని నడిపించాడు. ఆయన కోణంలో కథ అంతా నడుస్తుంది.

కమర్షియల్‌ ఫార్మాట్‌ని ఫాలో అయ్యే క్రమంలో, బోయపాటి స్టయిల్‌ని ఫాలో అయ్యే క్రమంలో ఎపిసోడ్‌ ఎపిసోడ్‌గానే సినిమా బాగుందనిపిస్తుంది. ఈ విషయంలో సుకుమార్‌ ఇంకా వర్క్ చేయాల్సింది. డైలాగ్‌లు మాత్రం బాగున్నాయి. పవర్‌ కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. పుష్ప రాజ్‌ పాత్రని ఎలివేట్‌ చేసే విషయంలో బన్నీ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా మాస్‌కి, ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్‌ ఇచ్చాడు సుకుమార్‌. కథ, క్లీన్‌ స్క్రీన్‌ప్లే, ఫన్‌, ఎమోషన్స్, లాజిక్‌లపై దృష్టిపెట్టాల్సింది. 

88

ఫైనల్ గాః `పుష్ప 2` ఫ్యాన్స్‌ కి, మాస్‌ ఆడియెన్స్ కి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ ఊరమాస్‌ ట్రీట్‌. 

రేటింగ్‌ః 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved