కమెడియన్ శివారెడ్డిని తొక్కేసిన స్టార్ నటుడు ఎవరు ? కన్నీళ్లు పెట్టుకుంటూ నిజాలు బయటపెట్టాడు
మిమిక్రీ ఆర్టిస్ట్ గా, కమెడియన్ టాలీవుడ్ లో శివారెడ్డి చాలా కాలం అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా శివారెడ్డిలో అద్భుతమైన మిమిక్రీ ట్యాలెంట్ ఉంది. ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ని కూడా శివారెడ్డి తన మిమిక్రీతో కడుపుబ్బా నవ్వించారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ గా, కమెడియన్ టాలీవుడ్ లో శివారెడ్డి చాలా కాలం అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా శివారెడ్డిలో అద్భుతమైన మిమిక్రీ ట్యాలెంట్ ఉంది. ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ని కూడా శివారెడ్డి తన మిమిక్రీతో కడుపుబ్బా నవ్వించారు. శివారెడ్డి తెలుగులో ఆనందం, మనసంతా నువ్వే, వసంతం, దొంగ దొంగది, అడివి రాముడు, దూకుడు లాంటి చిత్రాల్లో నటించి కామెడీ పండించారు.
అయితే శివారెడ్డికి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిపోయాయి. టాలీవుడ్ లో ఉన్న రాజకీయాల కారణంగా శివారెడ్డికి ఛాన్సులు తగ్గాయని, కొన్ని కాంట్రవర్సీలు కూడా అతడి కెరీర్ పై ప్రభావం చూపాయి అని అంటుంటారు. అయితే ఈ వివాదాల గురించి శివారెడ్డి ఎప్పుడూ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ అతడిపై ఇండస్ట్రీ పాలిటిక్స్ పనిచేశాయి అనేది మాత్రం వాస్తవం.
దీని గురించి ఓ ఇంటర్వ్యూలో శివారెడ్డి స్పందించారు. కుట్రలతో తనని ఇండస్ట్రీకి దూరం చేయడం గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓపెన్ అయ్యారు. నేను నటుడిగా రాణిస్తున్నప్పుడు నా కుటుంబ సభ్యులతో పాటు చాలా మందికి సహాయాలు చేశాను. పిల్లల స్కూల్ ఫీజులు లేకుంటే వాళ్ళకి సాయం చేసేవాడిని. ఇండస్ట్రీలో కమెడియన్ గా బిజీగా ఉన్నప్పుడు ఆ విధంగా చేసేవాడిని. లక్ష రూపాయలు వస్తే 25 వేలు మాత్రమే దాచుకునేవాడిని. మిగిలినదంతా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం వెచ్చించేవాడిని.
కానీ ఇప్పుడు అలా చేయలేకున్నా. ఆ విధంగా నలుగురిని అడ్డుకోవాలంటే ఇప్పుడు నేను నా ఇల్లు అమ్ముకోవాలి. ఒక స్టార్ కమెడియన్ మీపై రాజకీయాలు చేసి తొక్కేశారు అట కదా అని యాంకర్ ప్రశ్నిస్తే.. శివారెడ్డి స్పందించారు. నాకు స్పష్టంగా కారణాలు తెలియవు. బహుశా నేను హుందాగా కనిపించడం, మంచి బట్టలు వేసుకోవడం వాళ్ళకి నచ్చలేదోమో అని శివారెడ్డి అన్నారు.
కొందరు స్టార్లు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కూడా కొందరు వెళ్లి భజన చేస్తుంటారు. నేను అలా చేయను. వాళ్ళ పనిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకుంటా. దీనితో శివారెడ్డికి పొగరు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడాడు అని తప్పుగా భావించి ఉండొచ్చు. ఈ విషయాలని శివారెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటపెట్టారు.