ప్రియుడు ప్రవీణ్ కి ఫైమా హ్యాండ్... ఆమె నో చెప్పడంతో ఏడ్చానంటూ ఎమోషనల్!
ఫైమా షేక్ తన ప్రియుడు ప్రవీణ్ కి మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ప్రవీణ్ స్వయంగా స్పందించాడు. ఆసక్తికర కామెంట్స్ చేశాడు...

Faima-Praveen
జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో ఒకరైన ఫైమా బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఫైమా సీజన్ 6 లో పార్టిసిపేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి సత్తా చాటింది. జస్ట్ ఫైనల్ కి ముందు ఫైమా ఎలిమినేట్ అయ్యింది. ఫైమా కంటే టాప్ సెలెబ్స్ మధ్యలోనే చాట చుట్టారు. ఫైమా మాత్రం అంచనాలకు మించి రాణించింది.
Faima-Praveen
బుల్లితెర కమెడియన్ ప్రవీణ్ తో ఫైమా చాలా కాలంగా సన్నిహితంగా ఉంటుంది. ఫైమా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగా ఘన స్వాగతం పలికాడు. తన మెడలో ఉన్న బంగారు చైన్ ఫైమాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ చైన్ శాశ్వతంగా నాదే అని ఫైమా మురిసిపోయింది. ఇక ఫైమా-ప్రవీణ్ లవర్స్ గా ప్రాచుర్యం పొందారు.
Faima-Praveen
బిగ్ బాస్ షోలో ఫైమా పలుమార్లు ప్రవీణ్ ప్రస్తావన తెచ్చింది. తనను, తన కుటుంబాన్ని కష్ట సమయాల్లో ఆదుకున్నాడు. అండగా నిలిచాడని ఆమె చెప్పుకొచ్చింది. ప్రవీణ్ తన లవర్ అనే అర్థంలో ఫైమా మాట్లాడింది. అయితే తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో ప్రవీణ్ వెల్లడించాడు.
Faima-Praveen
ఫైమాతో నా ప్రేమ స్నేహంతో మొదలైంది. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. కానీ నా ప్రేమను ఆమె రిజెక్ట్ చేసింది. అందుకు ఫైమా మీద నాకు కోపం లేదు. తన నిర్ణయం తనది. ప్రేమను అంగీకరించకున్నా... మేము మంచి మిత్రులుగా ఉందామని అనుకున్నాం. ఒక ఫ్రెండ్ గా ఆమెతో నేను ఎప్పుడూ ఉంటాను. నా ప్రేమను అంగీకరించలేదనే బాధ ఉంది.. అన్నాడు.
Faima-Praveen
బిగ్ బాస్ షో అనంతరం ఆమె ఫైమా ఫేమ్ పెరిగింది. అందుకే ఫైమా ప్రవీణ్ ప్రేమను రిజెక్ట్ చేసిందనే వాదన వినిపిస్తుంది. దీనిపై కూడా ప్రవీణ్ క్లారిటీ ఇచ్చాడు. షో నుండి ఎలిమినేట్ అయినందుకు ఫైమా చాలా బాధపడింది. కొద్దిరోజులు ఎవరితో మాట్లాడలేదు. తర్వాత నాతో మాట్లాడింది. ఆమె హౌస్లో ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను... అన్నాడు.
Faima-Praveen
ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అంటారు. అందుకే ఆమె రిజెక్ట్ చేసినప్పుడు ఏడ్చాను. తర్వాత రియలైజ్ అయ్యాను. ఇప్పుడు నా ఫ్యామిలీ, కెరీర్ మీదే ఫోకస్. ఇటీవల మా నాన్న చనిపోయారు. ఆయన చనిపోయాక ఫ్యామిలీ అప్పుల గురించి తెలిసింది. ఆ అప్పులు తీర్చే పనిలో ఉన్నాను. ఫైమా ఎప్పుడు వచ్చి నా ప్రేమను అంగీకరించినా నేను సంతోషిస్తాను... అని ప్రవీణ్ ఎమోషనల్ అయ్యాడు...