- Home
- Entertainment
- జీవితమిచ్చిన జబర్దస్త్ పై కిరాక్ ఆర్పీ ఆరోపణలు... అంతా వ్యాపారమే నాగబాబు మాత్రం దేవుడు అంటూ..
జీవితమిచ్చిన జబర్దస్త్ పై కిరాక్ ఆర్పీ ఆరోపణలు... అంతా వ్యాపారమే నాగబాబు మాత్రం దేవుడు అంటూ..
జబర్దస్త్ కామెడీ షో అనేక మంది వర్ధమాన కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. నెల్లూరు యాసతో కిరాక్ ఆర్పీ తనదైన పంచెస్ తో ఫేమస్ అయ్యాడు. టీం మెంబర్ గా కెరీర్ ప్రారంభించి లీడర్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపై బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న కమెడియన్ మహేష్ కూడా ఆర్పీ టీమ్ లో చేసినవాడే.

Nagababu
ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆర్పీ ఒక స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు హోటల్ లో సర్వర్ గా చేసిన కిరాక్ ఆర్పీ ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని, పెళ్లి చేసుకునే విధంగా సెటిల్ అయ్యారు. ఆ మధ్య డైరెక్టర్ గా ఓ మూవీ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కిరాక్ ఆర్పీ ఇటీవల లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.
కొన్నాళ్లుగా ఆమెను ప్రేమిస్తున్న ఆర్పీ పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణలు చేశారు. నాగబాబును((Nagababu) దేవుడిగా వర్ణించిన ఆర్పీ మల్లెమాల నిర్మాతను మాత్రం వ్యాపారస్తుడు అంటూ ఎద్దేవా చేశాడు.
ఆర్పీ తన చెస్ట్ పై నాగబాబు పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో పేరో, కన్న తల్లి పేరో, ప్రేమించిన అమ్మాయి పేరో కాకుండా మీరు నాగబాబు పేరు పచ్చబొట్టు వేయించుకోవడానికి కారణం అడగగా.. నాగబాబు దేవుడితో సమానం, ఆయన నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచాడు. చాలా సహాయం చేశారు. అందుకే ఆయన పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను
ఇక మల్లెమాల విషయానికి వస్తే ఆ షో తల్లేమీ కాదు. జబర్దస్త్(Jbardasth)షో అంతా వ్యాపారం. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీకెంత నాకెంత అన్నట్లు ఆలోచిస్తారు. నాగబాబు అలా కాదు మన సమస్యలు అర్థం చేసుకొని సహకారం అందిస్తారని కిరాక్ ఆర్పీ(Kirak RP) చెప్పుకొచ్చాడు.
నిజానికి నాగబాబును ఆర్థికంగా నిలబెట్టింది కూడా జబర్దస్త్ షోనే. ఆరెంజ్ మూవీ తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన నాగబాబు జబర్దస్త్ జడ్జిగా మారి స్థిరపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా ఒప్పుకున్నారు. 2019లో జబర్దస్త్ పై ఆరోపణలు చేసి నాగబాబు బయటికి వచ్చారు. రెమ్యునరేషన్ తో పాటు కనీసం మంచి ఫుడ్ కూడా జబర్దస్త్ మేకర్స్ ఇవ్వరని మండిపడ్డారు.
Nagababu - Niharika
నాగబాబుతో పాటు తనకు అనుకూలంగా ఉండే చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయారు. జబర్దస్త్ మేనేజర్స్ కూడా నాగబాబుతో పాటు వెళ్లిపోయారు.బయటికి వచ్చిన నాగబాబు జబర్దస్త్ కి పోటీగా అదిరింది పేరుతో జీ తెలుగులో కామెడీ షో ప్రారంభించారు. ఇది ఫెయిల్యూర్ కాగా... ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్స్ అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ చేస్తున్నారు.