- Home
- Entertainment
- బాహుబలి వల్ల కమెడియన్ సంపాదించిన డబ్బంతా గోవిందా.. జబర్దస్త్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా ?
బాహుబలి వల్ల కమెడియన్ సంపాదించిన డబ్బంతా గోవిందా.. జబర్దస్త్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా ?
ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఒకప్పుడు జబర్దస్త్ ప్రధానంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత పాపులారిటీ పెరగడంతో అనేక చిత్రాల్లో కమెడియన్ వేషాలు వేశాడు.

ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఒకప్పుడు జబర్దస్త్ ప్రధానంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత పాపులారిటీ పెరగడంతో అనేక చిత్రాల్లో కమెడియన్ వేషాలు వేశాడు. భీమిలి కబడ్డీ జట్టు, పరుగు, పిల్ల జమిందార్, రాజుగారి గది లాంటి చిత్రాలు ధన్ రాజ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
జబర్దస్త్ షోతో పాటు సినిమాల్లో నటిస్తూ ధన్ రాజ్ బాగానే సంపాదించాడు. కానీ ఒక్కసారిగా అంతా పోగొట్టుకున్నట్లు ధన్ రాజ్ తెలిపాడు. తాజాగా ఇంటర్వ్యూలో ధన్ రాజ్ మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మించి డబ్బంతా పోగొట్టుకున్నా. ఆ సినిమా ధనలక్ష్మి తలుపు తడితే. ఈ మూవీలో నాతో పాటు శ్రీముఖి నటించింది. ఆ సినిమా వల్ల నష్టపోవడానికి ప్రధాన కారణం సినిమా బాగాలేకపోవడం కాదు.
చూసిన వారంతా సినిమా చాలా బావుందని చెప్పారు. ఆ మూవీ రిలీజ్ టైంలో నేను వరుణ్ తేజ్ లోఫర్ లో నటిస్తుండడం వల్ల రాజస్థాన్ లో ఉన్నా. శ్రీముఖి ఫోన్ చేసి ఓ థియేటర్ లో టికెట్స్ దొరకలేదు అని చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ తర్వాత వారమే బాహుబలి రిలీజ్ ఉంది. ఆడియన్స్ అంతా బాహుబలి కోసం ఎదురుచూస్తుండడంతో తొలి వారంలో కూడా మా చిత్రాన్ని చూడడానికి ఎవరూ రాలేదు.
బాహుబలి రిలీజ్ అయ్యాక థియేటర్స్ కి ముందుగా అగ్రిమెంట్ ఉండడంతో మా సినిమాని పూర్తిగా లేపేశారు. దీనితో భారీ నష్టాలు వచ్చాయి. నేను సంపాదించిన డబ్బుతో పాటు నా ఫ్రెండ్స్ నుంచి కూడా అప్పు చేసి ఆ మూవీ చేశా. అంతా పోయింది. నేను నా భార్యకి తప్ప ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
అదే డబ్బు ల్యాండ్స్ మీద పెట్టి ఉంటే ఇప్పటికి కొన్ని కోట్లు అయి ఉండేది. ఆమె చెప్పింది కూడా నిజమే. కానీ నేను ఒక మంచి సినిమా చేయాలనే ప్రయత్నం చేశాను. అది వర్కౌట్ కాలేదు. ఏం జరిగినా తిరిగి సంపాదించుకోవచ్చు అనే నమ్మకం ఉండేది. జబర్దస్త్ చేసే సమయంలో హైయెస్ట్ పేమెంట్ నాకు, వేణుకే.
ఒక్క ఎపిసోడ్ కి లక్ష ఇచ్చేవారు. నెలకి నాలుగు ఎపిసోడ్ లో నాలుగు లక్షలు. సంవత్సరానికి 48 లక్షలు. బాగానే సంపాదించే వాడిని. దాదాపు పదేళ్ల క్రితం అంత రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు అని ధనరాజ్ అన్నారు. ప్రస్తుతం ధనరాజ్ సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే చిత్రాన్ని దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు.