- Home
- Entertainment
- స్నేహితుడి వల్ల 100 కోట్లు పోగొట్టుకున్న బాధలో ఉండగా.. పూరి జగన్నాధ్ భార్యకి ఆ మాట చెప్పి గిఫ్ట్ ఇచ్చిన అలీ
స్నేహితుడి వల్ల 100 కోట్లు పోగొట్టుకున్న బాధలో ఉండగా.. పూరి జగన్నాధ్ భార్యకి ఆ మాట చెప్పి గిఫ్ట్ ఇచ్చిన అలీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతని మెప్పించే చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే చిత్రాలు కూడా చేశారు పూరి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతని మెప్పించే చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే చిత్రాలు కూడా చేశారు పూరి. తక్కువ సమయంలో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించడం పూరి జగన్నాధ్ స్టైల్. లెక్కలేనన్ని హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.
సమకాలీన దర్శకుల్లో పూరి జగన్నాధ్ చేసినన్ని చిత్రాలు మరే డైరెక్టర్ చేయలేదు. పూరి జగన్నాధ్ సంపాదించినట్లు కూడా ఇంకెవరూ సంపాదించలేదు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ , నాగార్జున ఇలా చాలా మంది స్టార్ హీరోలతో పూరి జగన్నాధ్ హిట్ చిత్రాలు చేశారు.
అయితే డబ్బు విషయంలో ప్రణాళికతో లేకపోవడం, స్నేహితులని గుడ్డిగా నమ్మడం వల్ల ఒక దశలో పూరి జగన్నాధ్ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉంటూనే పూరి జగన్నాధ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్నేహితుడు పొడిచిన వెన్నుపోటు వల్ల పూరి ఒక్కసారిగా 100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నారట. పూరి జగన్నాధ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
చివరికి ఇల్లు కూడా పోగొట్టుకుని చిన్న ఫ్లాట్ లోకి మారారట. మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. శత్రువు విసిరే కత్తి కంటే మిత్రుడు విసిరే కత్తి బలంగా దిగుతుంది అని పూరి ఒక చిత్రంలో డైలాగ్ రాశారు. తనకి రియల్ లైఫ్ లో అలాగే జరిగింది అని పూరి గుర్తు చేసుకున్నారు.
అలీ, పూరి జగన్నాధ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాదాపు పూరి చిత్రాలన్నింటిలో అలీ పాత్ర ఉంటుంది. చిరుత చిత్రంలో అలీ పాత్ర ముందుగా లేదు. డైలాగులు రాయడానికి పూరి జగన్నాధ్ బ్యాంకాక్ వెళుతుందట సెక్యూరిటీ నుంచి ఇమ్మిగ్రేషన్ అధికారులు వరకు ప్రతి ఒక్కరు అలీ పాత్ర ఉందా ఈ చిత్రంలో అని అడుగుతున్నారట.
Ali
బాబోయ్ అలీ పాత్ర లేకుంటే కొడతారేమో అని అప్పటి కప్పుడు అశ్విని దత్ కి ఫోన్ చేసి అలీ డేట్స్ తీసుకోండి అని చెప్పా. అప్పుడే అలీకి నచ్చిమి అనే పాత్రని పూరి రాశారట. అంత మంచి అనుబంధం ఉంది. ఆస్తి పోగొట్టుకుని బాధలో ఉన్న సమయంలో అలీ మా ఇంటికి వచ్చారని పూరి గుర్తు చేసుకున్నారు. పెద్ద గోల్డ్ చైన్ ఒకటి తీసుకువచ్చారు. అది కొన్ని లక్షల విలువ చేస్తుంది.
భయ్యా ఆస్తి పోయినందుకు బాధపడకు.. ఇది మహిమ గల చైన్. ప్రార్థనలు చేసి తీసుకువచ్చింది. నీ మెడలో వేసుకో. పోయింది అంతా తిరిగి వస్తుంది అని అలీ చెప్పాడట. కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు. వెంటనే నా భార్యకి ఆ చైన్ ఇచ్చి.. నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ అలీ మీద ఉంది. ఈ చైన్ నువ్వు వేసుకో అని నా భార్యకి ఇచ్చా. అలీ చెప్పినట్లే నా ఆస్తులు వచ్చాయి అని పూరి అన్నారు.