కమెడియన్ అలీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి..దెబ్బ మీద దెబ్బ..
కొన్ని దశాబ్దాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ కెరీర్ మొదలు పెట్టారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. హీరోగా కూడా అలీకి మంచి సక్సెస్ ఉంది.
కొన్ని దశాబ్దాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ కెరీర్ మొదలు పెట్టారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. హీరోగా కూడా అలీకి మంచి సక్సెస్ ఉంది. హాస్యం పండించడంలో అలీది సపరేట్ స్టైల్. అయితే ప్రస్తుతం అలీ కెరీర్ లో జోరు బాగా తగ్గింది.
గతంలో లాగా అలీకి అవకాశాలు రావడం లేదు. కొత్త తరం కమెడియన్లు రావడం దీనికి కారణం కావచ్చు. బ్రహ్మానందం లాంటి సీనియర్లకి కూడా అవకాశాలు తగ్గాయి. అలీకి కూడానా అవకాశాలు బాగా తగ్గాయి. దీని గురించి ఇటీవల అలీ మాట్లాడుతూ.. తనకి ఆఫర్స్ తగ్గలేదని.. తానే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అలీకి తాజాగా రెండు ఊహించని షాక్ లు తగిలాయి.
అసలే అవకాశాలు తగ్గి వెనుకబడి ఉన్న తరుణంలో అలీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అలీ ఇటీవల అల్లు శిరీష్ బడ్డీ చిత్రంలో నటించాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అలీ పాత్ర కూడా హైలైట్ కాలేదు.. ఎలాంటి వినోదం అందించలేదు. ఇక అలీ భారీగా ఆశలు పెట్టుకున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాధ్ సినిమా అంటే అలీకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది.
అంతే కాదు.. పూరి చిత్రాల్లో అలీ పాత్ర బాగా హైలైట్ అవుతుంది. అంతలా పూరి.. అలీ పాత్రని డిజైన్ చేస్తారు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత లాంటి చిత్రాల్లో అలీ పాత్ర ఎంతలా వినోదాన్ని అందించిందో చూశాం. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో పూరి జగన్నాధ్ అలీ కోసం విచిత్రమైన గెటప్ లో కనిపించే క్యారెక్టర్ రాశారు.
ఈ చిత్రంలో అలీ రోల్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. వినోదాన్ని అందించలేదు కదా.. అలీ కామెడీ చిరాకు పుట్టించింది. అలీ పాత్రపై ట్రోలింగ్ జరుగుతోంది. అలీ సన్నివేశాలని తొలగించాలనే డిమాండ్ కూడా వినిపించింది. ఈ టైంలో ఇలా జరగడం అలీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.
ఇటీవల అలీ రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెడదాం అనుకుంటే ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది. అంటే అలీ కెరీర్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.