జస్ట్ 50 వేలతో మొదలు, వందల కోట్లకి పడగెత్తిన కమెడియన్ అలీ.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఆస్తులు
టాలీవుడ్ లో అగ్ర హాస్య నటుల్లో అలీ కూడా ఒకరు. టాలీవుడ్ లో చాలా మంది సీనియర్లకంటే సీనియర్ కమెడియన్ అలీ. అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకుపోతూనే ఉన్నాడు.
టాలీవుడ్ లో అగ్ర హాస్య నటుల్లో అలీ కూడా ఒకరు. టాలీవుడ్ లో చాలా మంది సీనియర్లకంటే సీనియర్ కమెడియన్ అలీ. అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకుపోతూనే ఉన్నాడు. కమెడియన్ అలీ మొదట గుర్తింపు ఉన్న పాత్రలో నటించింది సీతాకోక చిలుక చిత్రంలో. 1981లో కమెడియన్ అలీ కెరీర్ ప్రారంభం అయింది. అక్కడి నుంచి అలీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఏర్పరుచుకున్నాడు.
అలీ చెప్పే కొన్ని మాటలు, డైలాగులు అతడికి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంటాయి. కాట్రవల్లీ, ఎంద చాట లాంటి మాటలు బాగా పాపులర్ అయ్యాయి. రాజమండ్రి నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన అలీ .. డైరెక్టర్లు, నిర్మాతలు, నటులతో పరిచయాలు ఏర్పరుచుకుంటూ అవకాశాలు దక్కించుకున్నాడు. అలీకి ఉన్న ప్రత్యేకమైన మ్యానరిజమ్స్, కామెడీ టైమింగ్ వల్ల అతడికి హీరోగా కూడా అవకాశాలు వరించాయి.
హీరోగా అలీకి తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే యమలీల అని చెప్పొచ్చు. యమలీల చిత్రం 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి అలీ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. కేవలం 50 వేలు. అప్పట్లో 50 వేలు అంటే తనకి చాలా పెద్ద అమౌంట్ అని అలీ తెలిపారు. ప్రస్తుతం అయితే అలీ కమెడియన్ గానే రోజుకి 3 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అలీ కొన్ని వందల చిత్రాల్లో నటించారు.
Ali
తన సంపాదనలో ప్రతి రూపాయని అలీ ల్యాండ్ ఇన్వెస్టిమెంట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అలీ ఆస్తుల విలువ 750 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలీ ఇన్ని వందల కోట్లు సంపాదించారు అంటే అందుకు కారణం కేవలం సినిమా కాదు.. తన సంపాదనని భూములపై పెట్టుబడులుగా పెట్టడమే అని అంటున్నారు. భూముల రూపంలోనే అలికి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయట. లెజెండ్రీ హీరో శోభన్ బాబు ఇచ్చిన సలహా మేరకే అలీ ఇలా భూములు కొనడం ప్రారంభించారట.
అలీ చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్. కమెడియన్ గా, హీరోగా, బుల్లితెర హోస్ట్ గా రాణించారు. సుదీర్ఘ కాలం అలీ చిత్ర పరిశ్రమలో కోనసాగుతున్నారు. అలీ సంపాదించినట్లు ఆస్తులని కొందరు స్టార్ హీరోలు కూడా సంపాదించలేకపోయారు అనే టాక్ ఉంది. బహుశా అది కూడా వాస్తవమే కావచ్చు. ఎందుకంటే 750 కోట్ల ఆస్తులు అంటే అందరికీ సాధ్యం కాదు.