- Home
- Entertainment
- `కమ్ బాక్ మెగాస్టార్`, సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. తలెత్తుకునే రోజుల కోసం ప్రార్థన
`కమ్ బాక్ మెగాస్టార్`, సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. తలెత్తుకునే రోజుల కోసం ప్రార్థన
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన `సికందర్` మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సక్సెస్ సెంటిమెంట్‌గా నిలిచిన రష్మిక మందన్నా ఉన్నా కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. దీంతో రంజాన్ సందర్భంగా విడుదలైన `సికందర్` భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇది సల్మాన్ ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచింది. ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందని గంపెడు ఆశలతో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశనే ఎదురయ్యింది.

Salman Khan Sikandar
Salman Khan: సల్మాన్ ఖాన్ హిట్ చూసి చాలా ఏళ్లు అవుతుంది. చివరగా ఆయన `టైగర్ జిందా హై` సినిమాతో సక్సెస్‌ని అందుకున్నారు. అంతకు ముందు `సుల్తాన్` ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత సల్మాన్ నటించిన మరే సినిమా సక్సెస్ కాలేదు.
బాక్సాఫీసు వద్ద వరుసగా బోల్తా పడుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల వచ్చిన `సికందర్` కూడా నిరాశ పరిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో సల్మాన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయింది.
salman khan sikandar
`సికందర్` చిత్రానికి తమిళ దర్శకుడు ఏ ఆర్ మరుగదాస్ దర్శకత్వం వహించగా, ఇందులో సల్మాన్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మికమందన్నా హీరోయిన్‌గా నటించింది. రంజాన్ సందర్భంగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన మూవీ వారిని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.
ఓ రకంగా ఇది రెండు మూడు రోజుల్లోనే థియేటర్ నుంచి వాష్ ఔట్ అయ్యింది. సల్మాన్ ఖాన్ మూవీ కి ఇలాంటి ఫలితం రావడం పట్ల ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తకోలేని పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన చెందుతున్నారు.
Salman Khan:
ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సల్లూ భాయ్ ఫాన్స్ ఆయనకు రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఒక్క హిట్ భాయ్ అంటూ అడుగుతున్నారు. కమ్ బాక్ మెగాస్టార్ అని, `భజరంగీ భాయిజాన్` నాటి సల్మాన్ మాకు కావాలని, `బజరంగీ భాయీజాన్`, `సుల్తాన్`, `టైగర్ జిందా హై` ల నాటి గోల్డెన్ ఎరాని మళ్లీ తీసుకురావాలని సల్మాన్ ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
సల్మాన్ తాలూకు ఛరిష్మాని, ఆయన క్రేజ్, ఎనర్జీని మళ్లీ చూడాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి సల్మాన్ కి ఎప్పుడు హిట్ పడుతుంది, ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీ అవుతారనేది చూడాలి. ప్రస్తుతం సల్మాన్ సోలో హీరోగా మరే మూవీని ప్రకటించలేదు. `ఆల్ఫా` అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.
read more: నాకు వెనకాల ఎవరూ లేరు, అందుకే నటించడం లేదు.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్